Sai Dhanshika Vs Rishav Basu : 'దక్షిణ'లో విలన్‌గా బెంగాలీ హీరో - పవర్‌ఫుల్ రోల్‌లో సాయి ధన్సిక
Rishav Basu As Villain In Sai Dhanshika's Dakshina Movie : తెలుగు తెరకు మరో బెంగాలీ నటుడు వస్తున్నారు. సాయి ధన్సిక 'దక్షిణ'లో రిషవ్ బసు విలన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే...
ఛార్మీ కౌర్ (Charmy Kaur) నటించిన సినిమాల్లో 'మంత్ర', 'మంగళ'కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ రెండూ తెలుగులో లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్స్ ఎక్కువ రావడానికి కారణం అని చెప్పాలి. కథ, కథనం, దర్శకత్వం విషయంలో ట్రెండ్ సెట్ చేశాయి. వాటికి ఓషో తులసీరామ్ (Osho Tulasi Ram) దర్శకుడు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా 'దక్షిణ' (Dakshina Movie).
'కబాలి'లో రజనీకాంత్ కుమార్తె పాత్రలో నటించిన సాయి ధన్సిక (Sai Dhanshika) గుర్తున్నారు కదా! 'దక్షిణ' (Dakshina Movie 2022) సినిమాలో ఆవిడ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. ఆదివారం సాయి ధన్సిక పుట్టినరోజు (Sai Dhanshika Birthday) సందర్భంగా మూవీ స్పెషల్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
'దక్షిణ' మోషన్ పోస్టర్ విషయానికి వస్తే... సముద్ర తీరంలో ఉన్న సాయి ధన్సికను చూపించారు. నేపథ్య సంగీతం శక్తివంతంగా ఉంది. బహుశా... టైటిల్ సాంగ్ మ్యూజిక్ కావచ్చు. సాధారణంగా ధన్సిక పేరు చెబితే 'కబాలి' గుర్తుకు వస్తుంది. కానీ, ఈ సినిమా తర్వాత 'దక్షిణ' ఫేమ్ ధన్సిక అంటారని నిర్మాత అశోక్ షిండే చెబుతున్నారు.
విలన్‌గా బెంగాలీ హీరో రిషవ్ బసు!
'దక్షిణ' సినిమాలో బెంగాలీ హీరో రిషవ్ బసు విలన్‌గా నటిస్తున్నట్లు నిర్మాత అశోక్ షిండే తెలిపారు. బెంగాలీ నుంచి కథానాయికలు, నటులు తెలుగుకు రావడం కొత్త కాదు. 'సిరివెన్నెల', 'స్వయం కృషి', ఇటీవల 'గాడ్ ఫాదర్' సినిమాల్లో నటించిన సర్వాధామన్ డి బెనర్జీ బెంగాలీ. ఈ మధ్య తెలుగులో ఎక్కువ విలన్ రోల్స్ చేస్తున్న జిష్షు సేన్ గుప్తా కూడా బెంగాలీ. ఇప్పుడు రిషవ్ బసు వస్తున్నారు.
Also Read : 'ఇట్లు మారేడుమిల్లి' to 'తోడేలు', 'లవ్ టుడే' - ఈ వారం థియేటర్లలో సందడి వీటిదే!
'దక్షిణ' స్పెషల్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా చిత్ర నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ ''ఇదొక లేడీ ఓరియెంటెడ్ సైకో థ్రిల్లర్. సాయి ధన్సిక, ఓషో తులసీరామ్ కలయికలో సినిమా చేయడం సంతోషంగా ఉంది. మా హీరోయిన్ సాయి ధన్సిక గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. 'దక్షిణ' ఫేమ్ ధన్సిక అనేలా మా సినిమా ఉంటుంది. సినిమాలో ఆవిడ అంత పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. ఈ 'దక్షిణ'లో కథ ఎంత హైలైట్ అవుతుందో... ఆవిడ పర్ఫార్మెన్స్ అంత హైలైట్ అవుతుంది. హై ఓల్టేజ్ పర్ఫార్మెన్స్‌తో సాయి ధన్సిక ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తారు. మా సినిమాలో బెంగాలీ హీరో రిషవ్ బసు విలన్ రోల్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్నాం. ఆల్రెడీ 70 శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. గోవా, హైదరాబాద్‌లో షూటింగ్ చేశాం. డిసెంబర్ నెలలో విశాఖలో జరిపే షెడ్యూల్‌తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. తెలుగులో 'మంత్ర', 'మంగళ' ఫిమేల్ ఓరియెంటెడ్ థ్రిల్లర్స్ ట్రెండ్ సెట్ చేశాయి. ఆ సినిమాల తరహాలో 'దక్షిణ' ఉంటుంది'' అని చెప్పారు.
'దక్షిణ' సినిమాలో కనిపించబోయే ఇతర నటీనటులు, సినిమాకు పని చేయబోయే సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. సాయి ధన్సిక, రిషబ్ బసు, సుభాష్, ఆనంద భారతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : నర్సింగ్, సంగీతం : బాలాజీ, నిర్మాణ సంస్థ: కల్ట్ కాన్సెప్ట్స్, నిర్మాత : అశోక్ షిండే, దర్శకత్వం : ఓషో తులసీరామ్.