అన్వేషించండి

Venkatesh Pan India Film : వెంకీ మామ మాస్ & స్టైల్ - పాన్ ఇండియా సినిమా టైటిల్ వచ్చేసిందోచ్

Venkatesh's Saindhav Movie : వెంకటేష్ పాన్ ఇండియా సినిమా టైటిల్ ఈ రోజు వెల్లడించారు. అలాగే, ఆయన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.

విక్టరీ వెంకటేష్ (Venkatesh) కథానాయకుడిగా 'హిట్' ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ రోజు సినిమా టైటిల్ వెల్లడించారు. అలాగే, వెంకటేష్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. 

'సైంధవ్'గా వెంకటేష్!
వెంకటేష్ 75వ చిత్రమిది. దీనికి 'సైంధవ్' టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ చూస్తే... వెంకీ ఊర మాస్ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నట్టు అర్థం అవుతోంది. ఆ రగ్గడ్ లుక్, తన చేతిలో గన్ చూడటం, లుక్స్ ఇంటెన్సిటీ... బావున్నాయి. 

ఐదు భాషల్లో 'సైంధవ్'
'సైంధవ్' వెంకటేష్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కానుంది. దీని కంటే ముందు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'రానా నాయుడు' విడుదల కానుంది. అలాగే, సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమాతో హిందీ ప్రేక్షకులను పలకరించనున్నారు. హిందీ 'హిట్' ద్వారా శైలేష్ కొలను హిందీ ప్రేక్షకులకు తెలుసు. 'సైంధవ్'ను తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. 

నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి 'సైంధవ్'ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, సినిమాటోగ్రఫీ : ఎస్. మణికందన్, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీత దర్శకుడు : సంతోష్ నారాయణన్. 

హెయిర్ స్టైల్ చేంజ్ చేసిన వెంకీ!
గత కొన్నేళ్ళుగా ప్రతి సినిమాలోనూ వెంకటేష్ దాదాపు ఒకే తరహా లుక్ మైంటైన్ చేస్తున్నారు. మధ్యలో సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్ లో కనిపించినా... చాలా రోజులుగా హెయిర్ స్టైల్ చేంజ్ చేయలేదు. 'సైంధవ్' కోసం ఆయన హెయిర్ స్టైల్ చేంజ్ చేసినట్టు ఈ లుక్ చూస్తుంటే తెలుస్తోంది.

Also Read : 'పఠాన్' రివ్యూ : కింగ్ ఖాన్ షారుఖ్ ఈజ్ బ్యాక్! మరి, సినిమా ఎలా ఉంది?

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కానుంది. ‘శ్యామ్ సింగ రాయ్’ తర్వాత నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. హిట్‌వర్స్ కాకుండా కొత్త కథతో శైలేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు జనవరి 25వ తేదీన వెల్లడించనున్నారు.

Also Read : విజయ్ ఆంటోనీ సేఫ్ - సర్జరీ పూర్తి, హాస్పిటల్ బెడ్ నుంచి అప్‌డేట్

సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు వెంకటేష్. గత ఏడాది మేలో 'ఎఫ్ 3' విడుదల అయ్యింది. ఆ తర్వాత ఆయన అంగీకరించిన చిత్రమిది. ఇంతకు ముందు చెప్పినట్టు... ఓటీటీ వేదికలో కూడా వెంకటేష్ అడుగు పెట్టారు. తెలుగు సీనియర్ హీరోల్లో వెబ్ సిరీస్ చేసిన ఏకైక హీరో ఆయనే. 'రానా నాయుడు'లో వెంకీ అన్న కుమారుడు రానా దగ్గుబాటి కూడా నటించారు. సూపర్ హిట్ అయిన ఇంగ్లిష్ వెబ్ సిరీస్ 'రే డొనొవన్'కు అధికారిక రీమేక్‌గా ఈ సిరీస్ తెరకెక్కుతుంది. ఈ సిరీస్ కూడా ఈ సంవత్సరమే విడుదల అయ్యే అవకాశం ఉంది. 

వెంకటేష్‌కు శైలేష్‌తో చేస్తున్న సినిమానే చివరి మైల్‌స్టోన్ మూవీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సీనియర్ హీరోలు అందరిలో మెల్లగా సినిమాలు చేస్తూ వెళ్తుంది వెంకీనే. ఈ స్పీడ్‌లో మరో 25 సినిమాలు పూర్తి చేయడం అంటే దాదాపు ఇంపాజిబుల్ అని చెప్పవచ్చు. కాబట్టి ఈ సినిమాను మెమరబుల్‌గా మార్చుకోవడానికి వెంకటేష్ చాలా కష్టపడతారు.

ఇక శైలేష్ కొలను కూడా సూపర్ ‘హిట్’లతో దూసుకుపోతున్నారు. హిట్ 1, హిట్ 2 సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. హిట్ 3లో నాని నటిస్తున్నట్లు ‘హిట్ 2’ క్లైమ్యాక్స్‌లోనే అధికారికంగా ప్రకటించారు. వెంకటేష్‌తో సినిమా పూర్తయ్యాక ‘హిట్ 3’ మీదకు శైలేష్ వెళ్లే అవకాశం ఉంది. హిట్ సిరీస్‌లో మొత్తంగా ఏడు సినిమాలు ఉంటాయని శైలేష్ గతంలోనే చాలా సార్లు తెలిపారు. ఈ స్పీడ్‌ను బట్టి చూస్తే హిట్ వర్స్ పూర్తవ్వడానికి మరో 10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget