అన్వేషించండి

Daggubati Suresh Babu: టికెట్ ధరల పెంపుతో సినిమాలకు ప్రేక్షకులు దూరం - నిర్మాత సురేష్ బాబు ఏమన్నారు?

టికెట్ ధరల పెంపుకన్నా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ముఖ్యం అన్నారు నిర్మాత సురేష్ బాబు. ధరల పెంపు కారణంగా ప్రేక్షకులు సినిమాలకు దూరం అవుతున్నట్లు వెల్లడించారు.

Daggubati Suresh Babu About Ticket Prices: సినిమా టికెట్ల ధరల పెంపుపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు కీలక విషయాల వెల్లడించారు. సినిమా టికెట్ల ధర పెంపు కారణంగా చాలా మంది ప్రేక్షకులు సినిమాలకు దూరం అవుతున్నారని చెప్పారు. టికెట్ల ధరల పెంపుపై ఫోకస్ పెట్టడం కంటే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

తక్కువ ధర ఉంటేనే సామాన్యులు సినిమాలు చూస్తారు!

టికెట్ల ధరల పెంపు గురించి ఓ నేషనల్ మీడియా సంస్థ నిర్వహించిన ఎగ్జిబిటర్ల ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేష్ బాబు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. “తమిళనాడులో సినిమా టికెట్ల రేట్లు ఇప్పటికీ నియంత్రణలో ఉంటాయి. అక్కడ టికెట్ గరిష్ట ధర రూ. 190. తెలుగులోనూ ధరల పరిమితి ఉంది. కానీ, స్టార్ హీరోల సినిమాల టికెట్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం వేధిస్తుంది. ధరల పెంపు కారణంగా త్వరగా లాభాలు వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. అలా ధరలు పెంచడం మంచిదా? కాదా? అనే విషయంలో చాలా అభిప్రాయాలు ఉన్నాయి. టికెట్ ధర ఓసారి రూ. 500 ఉంటుంది. మరోసారి రూ. 100 ఉంటుంది. తక్కువ ధర ఉన్నప్పుడే సామాన్యులు సినిమాలు చూస్తారు. ఎక్కువ ధరల కారణంగా లాభాలు వస్తాయని భావించడం కంటే సామాన్యులు సినిమాలకు దూరం అవుతున్నారే విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని సురేష్ బాబు వెల్లడించారు.

Read Also: ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’లకు మైత్రీ క్రేజీ డీల్ - బాలీవుడ్‌లో ఇంక జాతరే!

ధరలు ఎక్కువగా ఉండకూడదు- సురేష్ బాబు

సినిమా టికెట్ల ధరలు ఎక్కువగా ఉండకూడదనేది తన అభిప్రాయం అన్నారు సురేష్ బాబు. “టికెట్ ధరలు ఎక్కువగా ఉండకూడదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ప్రజల కోసం చాలా ఖర్చుతో సినిమా తీస్తున్నాం. సినిమా అనేది ఒక అనుభవం. కానీ, ఇప్పుడు మనిషి ఆ అనుభవం ఆచరణీయమైనదేనా? అని ఆలోచిస్తున్నాడు. అందుకే, ఎక్కువ ధరలు పెట్టి థియేటర్లలో సినిమాలు చూడట కంటే, కొద్ది రోజులు ఆగితే ఓటీటీలో చూడవచ్చు అనే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే, ఇప్పటికైనా టికెట్ల ధరల పెంపు విషయంలో మేకర్స్ మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది” అని సురేష్ బాబు తెలిపారు.   

పెరుగుతున్న ధరలతో సినిమాలకు ప్రేక్షకులు దూరం

పెరుగుతున్న టికెట్ ధరల కారణంగా చాలా మంది ప్రేక్షకులు సినిమాలకు దూరం అవుతున్నారని పలువురు చిత్ర నిర్మాతలు అభిప్రాయపడ్డారు. ఓటీటీల విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో మున్ముందు సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా టికెట్ ధరల విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాణ ఖర్చులు తగ్గించుకుంటూనే ప్రేక్షకులకు టికెట్ ధరలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్ ప్రేక్షకులు సినిమాకు వచ్చినప్పుడే మౌత్ పబ్లిసిటీ పెరుగుతుందన్నారు. వీలైనంత వరకు మాస్ ప్రేక్షకులు సినిమాలకు వచ్చేలా చూసుకోవాలని మేకర్స్ కు సురేష్ బాబు సూచించారు.    

Read Also: మెగా వర్సెస్ నందమూరి వర్సెస్ అక్కినేని, ఈ సంక్రాంతి క్లాష్ తో బాక్స్ ఆఫీసు మోత మోగాల్సిందే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు - ఆకస్మిక వరదలకు అవకాశం
దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు - ఆకస్మిక వరదలకు అవకాశం
Telangana High Court : ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో దక్కని ఊరట -  ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని ఆదేశాలు
ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో దక్కని ఊరట - ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని ఆదేశాలు
Daggubati Suresh Babu: టికెట్ ధరల పెంపుతో సినిమాలకు ప్రేక్షకులు దూరం - నిర్మాత సురేష్ బాబు ఏమన్నారు?
టికెట్ ధరల పెంపుతో సినిమాలకు ప్రేక్షకులు దూరం - నిర్మాత సురేష్ బాబు ఏమన్నారు?
Sajjala Ramakrishna Reddy Notice : టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హెజ్బుల్లా రహస్య సొరంగం వీడియో షేర్ చేసిన ఇజ్రాయేల్పీవీ నరసింహా రావుకి రతన్‌ టాటా లెటర్, వైరల్ అవుతున్న లేఖMaoist Nambala Keshava Rao Village | మావోయిస్టు దాడులు ఎక్కడ జరిగినా వినిపించే పేరు | ABP DesamIndian Navy VLF Station: నేవీ VLF స్టేషన్ అంటే ఏంటి? వికారాబాద్‌ అడవుల్లోనే ఎందుకు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు - ఆకస్మిక వరదలకు అవకాశం
దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు - ఆకస్మిక వరదలకు అవకాశం
Telangana High Court : ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో దక్కని ఊరట -  ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని ఆదేశాలు
ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో దక్కని ఊరట - ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని ఆదేశాలు
Daggubati Suresh Babu: టికెట్ ధరల పెంపుతో సినిమాలకు ప్రేక్షకులు దూరం - నిర్మాత సురేష్ బాబు ఏమన్నారు?
టికెట్ ధరల పెంపుతో సినిమాలకు ప్రేక్షకులు దూరం - నిర్మాత సురేష్ బాబు ఏమన్నారు?
Sajjala Ramakrishna Reddy Notice : టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
Akhanda 2 : చిన్న కుమార్తె స్విచ్ ఆన్ - పెద్ద కుమార్తె క్లాప్ - బాలయ్య ' అఖండ 2' తాండవం షురూ 
చిన్న కుమార్తె స్విచ్ ఆన్ - పెద్ద కుమార్తె క్లాప్ - బాలయ్య ' అఖండ 2' తాండవం షురూ 
Vivo Y300 Plus: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన వివో - వావ్ అనిపించే కెమెరాలతో!
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన వివో - వావ్ అనిపించే కెమెరాలతో!
Telangana News : ఆ ఒక్క కారణంతోనే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ నో చెప్పారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఆ ఒక్క కారణంతోనే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ నో చెప్పారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
DA Hike: దీపావళి కానుక - ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగిందోచ్‌
దీపావళి కానుక - ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగిందోచ్‌
Embed widget