By: ABP Desam | Updated at : 21 Apr 2023 03:38 PM (IST)
సీఎస్కే vs ఎస్ఆర్‌హెచ్(Image Credits: Srinivasaa Silver Screen /Twitter)
Custody on CSK vs SRH : టాలీవుడ్ హీరో నాగ చైతన్య, డైరెక్టర్ వెంకట్ ప్రభు మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో వారిద్దరూ పోట్లాడుకున్నారు. తిట్టుకున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన సింగర్, కంపోజర్ ప్రేమ్ జీ అమరన్ వారిద్దరికీ నచ్చజెప్పి, వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ఇంతకీ నాగ చైతన్య, డైరెక్టర్ వెంకట్ ప్రభు ఎందుకు గొడవ పడ్డారు. వారి గొడవకు కారణమేంటీ అన్న దానిపై ప్రస్తుతం తీవ్రంగా చర్చ సాగుతోంది.
సీఎస్కే vs ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ కోసం కస్టడీ మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో హీరో నాగచైతన్య గొడప పడ్డారు. మే 12 కస్టడీ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగా నాగ చైతన్య, వెంకట్ ప్రభు ఓ ఇంట్రస్టింగ్ టాపిక్ ను ఎంచుకున్నారు. చాలా మంది ఆసక్తి కనబరిచే ఐపీఎల్లో జరగబోయే చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ను వీరు కంటెంట్ గా ఉపయోగించుకున్నారు. డైరెక్టర్ వెంకట్ ప్రభు తమిళ వ్యక్తి కావడంతో సీఎస్కే జట్టుకు, నాగ చైతన్య తెలుగువాడు కావడంతో ఎస్ఆర్‌హెచ్ జట్టుకు సపోర్ట్ చేస్తున్నట్టు ఆ టీమ్స్ జెర్సీలను ధరించారు.
సీఎస్కే జట్టు గొప్పదని డైరెక్టర్ వెంకట్ ప్రభు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గొప్పదంటూ హీరో నాగ చైతన్య వాదించుకున్నారు. నా టీమ్ గొప్పంటే నా టీమ్ గొప్ప అంటూ సాగిన వారి వాదన.. చివరికి గొడవకు దారి తీసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడు నిమిషాల నిడివి గల ఈ కస్టడీ ప్రమోషనల్ వీడియో మొత్తం తమిళంలోనే ఉండడం గమనార్హం. ఇందులో చైతూ కూడా తమిళంలోనే మాట్లాడుతూ కనిపిస్తూ అందర్నీ ఆకర్షించారు. గొడవ చివరి వరకూ ఎక్కడా తగ్గకుండా తమ పంతాన్ని కొనసాగించారు.
సరిగ్గా ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన సింగర్, హాస్య నటుడు ప్రేమ్‌జీ (ప్రేమ్‌గి అమరెన్).. వీరిద్దరి మధ్య జరిగిన విషయాన్ని తెలుసుకుని, వాళ్లకు సర్ది చెప్పారు. సన్ రైజర్స్ కూడా తమిళ వాళ్ల టీమే అని, ఇటు సీఎస్కేలో తెలుగువాడు అంబటి రాయుడు ఉన్నాడంటూ వారివురినీ శాంతపర్చుతారు. ఈ వీడియో అంతా డ్రామానే అని ఆడియెన్స్ కు తెలిసినా.. చూసేందుకు మాత్రం చాలా ఇంట్రస్టింగ్ గా, నవ్వును తెప్పేంచేదిగా ఉండడంతో నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వారిద్దరి ఎక్స్ ప్రెషన్స్ ను గమనిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో మూవీ ప్రమోషన్ కోసమే ఈ నాటకమంతా అంటూ చమత్కరిస్తున్నారు. ఏదేమైనా ఆద్యంతం ఇంట్రస్టింగ్ సాగే వీరి మధ్య సంభాషణకు సంబంధించిన వీడియో అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా కస్టడీని తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ కానుంది. దాన్ని చెప్పే ప్రయత్నమే ఈ ప్రమోషనల్ వీడియోనని తెలుస్తోంది. కాగా మే 12న రిలీజ్ కాబోతున్న కస్టడీ మూవీ నుంచి ఈ మధ్యే ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. కస్టడీ మూవీలో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ గా కనిపిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన కృతి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాతోనే వెంకట్ ప్రభు టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమవుతుండడం విశేషం. అంతే కాకుండా ఈ మూవీలో సీనియర్ నటులు అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి సైతం నటించారు.
Read Also: వామ్మో, శంకర్ ప్లాన్ మామూలుగా లేదుగా, ‘గేమ్ ఛేంజర్’లో కనీవినీ ఎరుగని ఫైట్ సీన్
Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?
Vijay Antony: మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్
Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్
Gundeninda Gudi Gantalu Serial : మదర్ సెంటిమెంట్‌తో 'స్టార్ మా' సరికొత్త సీరియల్ 'గుండె నిండా గుడిగంటలు'
Bigg Boss Telugu 7: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్‌పై రతిక చెత్త కామెంట్స్
CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే
Komatireddy Venkat Reddy: చంద్రబాబు కేసుల వార్తలు వస్తే టీవీ బంద్ చేస్తా, ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
మహిళా రిజర్వేషన్ బిల్‌కి రాష్ట్రపతి ఆమోదం, ఇక అమలు చేయడమే తరువాయి
/body>