News
News
వీడియోలు ఆటలు
X

Game Changer Movie: వామ్మో, శంకర్ ప్లాన్ మామూలుగా లేదుగా, ‘గేమ్ ఛేంజర్’లో కనీవినీ ఎరుగని ఫైట్ సీన్

రామ్ చరణ్, శంకర్ కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా క్లైమాక్స్ ను శంకర్ ఓ రేంజిలో ప్లాన్ చేశారు. ఏకంగా 1000 మంది ఫైటర్స్ తో చెర్రీ యాక్షన్ సీన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కలసి ఓ భారీ ప్రాజెక్టు చేస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’ పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. చెర్రీ కెరీర్ లో 15వ చిత్రంగా తెరకెక్కుతోంది.  రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేస్తారని మేకర్స్. ఈ టైటిల్ చాలా బాగుందంటూ మెగా అభిమానులతో పాటు, సినీ లవర్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.  అటు శంకర్ సైతం ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

View this post on Instagram
 
A post shared by Ram Charan (@alwaysramcharan)

ఏప్రిల్ 24 నుంచి క్లైమాక్స్ ఫైట్ షూటింగ్!

శంకర్ ఇటీవలే కమల్ హాసన్ చిత్రం ‘ఇండియన్ 2’కు సంబంధించి సౌత్ ఆఫ్రికాలో కీలక షెడ్యూల్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ చెర్రీ, కియారా అద్వానీ కలిసి నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’పై ఫోకస్ పెట్టారు. సినీ పరిశ్రమ నుంచి అందుతున్న సమచారం ప్రకారం శంకర్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ ను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారట. ఈ క్లైమాక్స్ ఫైట్‌ను ఏప్రిల్ 24 నుంచి మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్‌లో రామ్ చరణ్ ఏకంగా 1,000 మంది ఫైటర్స్‌ తో గొడవ పడనున్నట్లు తెలుస్తోంది. ‘KGF’ అన్బరీవ్ ఈ యాక్షన్ కొరియోగ్రఫీని పర్యవేక్షించనున్నారు. క్లైమాక్స్‌ చిత్రీకరణ కోసం శంషాబాద్‌ సమీపంలో ప్రత్యేక సెట్‌ వేశారు. ఈ షెడ్యూల్ మే 5 వరకు ఉంటుందని సమాచారం. ‘గేమ్ ఛేంజర్‌’ సినిమాలోని ఇతర ముఖ్య నటులు ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర,  జయరామ్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారు. ఇక ఈ మూవీలో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ లో మూవీ ను నిర్మిస్తున్నారు.

సానా బుచ్చిబాబు దర్శకత్వంలో చెర్రీ సినిమా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' తర్వాత 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. ఆ సినిమా సంగీత దర్శకుడిగా ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ పేరు వినబడుతోంది. ఈ  సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అవుతుందని రామ్ చరణ్ గతంలో తెలిపారు. ఇందులో తనది పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ అన్నారు. 'రంగస్థలం' కంటే బెటర్ సబ్జెక్ట్ అండ్ క్యారెక్టర్ అని ఇండియా కాన్‌క్లేవ్‌లో రామ్ చరణ్ తెలిపారు. రామ్ చరణ్ - సానా బుచ్చి బాబు సినిమాతో సతీష్ కిలారు నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ స‌గ‌ర్వ సమర్పణలో ఆయనకు చెందిన వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు.

Read Also: ఫైట్ సీన్స్‌లో సల్మాన్ నన్ను కొట్టనన్నారు - అందుకే జుట్టుకు రంగేసుకున్నా: జగపతిబాబు

Published at : 20 Apr 2023 04:18 PM (IST) Tags: Shankar Ram Charan Game Changer Movie Game Changer climax

సంబంధిత కథనాలు

'Hari Hara Veera Mallu Movie: ‘హరిహర వీర మల్లు’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షూటింగ్ మరింత ఆలస్యం?

'Hari Hara Veera Mallu Movie: ‘హరిహర వీర మల్లు’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షూటింగ్ మరింత ఆలస్యం?

Ram Sita Ram Song: ఆహా ఎంత అద్భుతం! ఆకట్టుకుంటున్న‘ఆదిపురుష్‌’ ‘రామ్ సీతా రామ్’ సాంగ్

Ram Sita Ram Song: ఆహా ఎంత అద్భుతం! ఆకట్టుకుంటున్న‘ఆదిపురుష్‌’ ‘రామ్ సీతా రామ్’ సాంగ్

HanuMan Movie: ‘హనుమాన్‘ చిత్రంలో 1600 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ - మరి రిలీజ్?

HanuMan Movie: ‘హనుమాన్‘ చిత్రంలో 1600 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ - మరి రిలీజ్?

Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?

Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?

అఖిల్‌‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!

అఖిల్‌‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!