News
News
X

Samantha: సమంతపై రూమర్లు - అందులో నిజం లేదట!

సమంతపై కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. నిజానికి సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.

FOLLOW US: 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. ప్రస్తుతం తెలుగులో 'ఖుషి', 'యశోద'.. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది సమంత. 

ఇంత బిజీగా గడుపుతోన్న సమంతపై కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. నిజానికి సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూనే ఉంటారు. వర్కవుట్ వీడియోలను, తన పెంపుడు కుక్క వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. అలాంటిది కొన్నాళ్లుగా ఆమె సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆమెపై కొన్ని రూమర్స్ మొదలయ్యాయి. 

సమంతను మళ్లీ పెళ్లి చేసుకోమని ఆమె తల్లి ఒత్తిడి చేస్తోందని.. ఆ ప్రెజర్ తట్టుకోలేకే ఆమె అన్నింటికీ దూరమై.. సినిమాలపై ఫోకస్ పెట్టిందని కొన్ని మీడియా వర్గాలు ప్రచురించాయి. కొన్ని వెబ్ ఛానెల్స్ లో అయితే సమంతకు రీసెంట్ గా సర్జరీ అయిందని.. దాని నుంచి కోలుకోవడానికి ఆమెకి సమయం పడుతుందని.. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదని వార్తలొచ్చాయి.

ఇవన్నీ రూమర్స్ మాత్రమేనని.. అందులో ఒక్క నిజం కూడా లేదని అంటున్నాయి సమంత సన్నిహిత వర్గాలు. ప్రస్తుతం సమంత షూటింగ్ తో బిజీగా ఉన్నారని.. చాలా హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది. ఆమె సోషల్ మీడియాలో సైలెంట్ గా ఎందుకు ఉన్నారో కారణం తెలియదు కానీ సోషల్ మీడియాలో, మీడియాలో జరుగుతున్న ప్రచారంలో మాత్రం నిజం లేదని తెలుస్తోంది. 

రెమ్యునరేషన్ పెంచేసిన సామ్:

ఇదిలా ఉండగా.. ఇప్పుడు సమంత తన రెమ్యునరేషన్ పెంచేసిందట. 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అమ్మడు రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. అలానే 'యశోద', 'శాకుంతలం' సినిమాలకు రూ.2.5 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంది. అయితే ఇప్పుడు ఏకంగా రూ.3.5 కోట్లు డిమాండ్ చేస్తుందట ఈ బ్యూటీ. అంతకంటే తక్కువ ఆఫర్ చేస్తోన్న ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం లేదట. 

'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 తరువాత సమంత క్రేజ్ పెరిగింది. ఓటీటీ, శాటిలైట్ ఛానెల్స్ లో తన సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతోంది. అందుకే సమంత రెమ్యునరేషన్ విషయంలో అసలు వెనక్కి తగ్గడం లేదు. సౌత్ లో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ అంటే నయనతార అనే చెప్పాలి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి సమంత కూడా చేరబోతోంది. 

Also Read : సుమన్ బతికుండగా చంపేసిన యూట్యూబ్ ఛానళ్లు

Also Read : విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్ల హిట్టూ ఫ్లాపులు రాలేదు - దర్శక అభిమాని సూటి లేఖ

Published at : 31 Aug 2022 08:18 PM (IST) Tags: samantha Samantha rumours khushi movie

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Rashmika: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో రిలేషన్ - రష్మిక మాటలు విన్నారా?

Rashmika: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో రిలేషన్ - రష్మిక మాటలు విన్నారా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Ghost Hindi Release Date : హిందీలో రెండు రోజుల ఆలస్యంగా నాగార్జున 'ఘోస్ట్' - ఎందుకో వివరించిన నిర్మాత

Ghost Hindi Release Date : హిందీలో రెండు రోజుల ఆలస్యంగా నాగార్జున 'ఘోస్ట్' - ఎందుకో వివరించిన నిర్మాత

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మంట పెట్టిన బీబీ ఛాట్ బండార్ - వరస్ట్ పానీపూరి ఎవరికి వచ్చింది?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మంట పెట్టిన బీబీ ఛాట్ బండార్ - వరస్ట్ పానీపూరి ఎవరికి వచ్చింది?

టాప్ స్టోరీస్

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు