Cobra Movie First Review: 'కోబ్రా' ఫస్ట్ రివ్యూ - సినిమా ఎలా ఉందంటే?
'కోబ్రా' సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది.
చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కథానాయకుడిగా నటించిన సినిమా 'కోబ్రా' (Cobra Movie). ఇందులో 'కెజియఫ్ 2' (KGF 2 Movie) ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కథానాయిక. ఇటీవల చెన్నైలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. మొదట ఆగస్టు 11న 'కోబ్రా'ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ సమయానికి రావడం కుదరలేదు. ఇప్పుడు ఆగస్టు 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది. దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు 'కోబ్రా' సినిమాకి రివ్యూ చెప్పేశారు. ఈ సినిమాలో హీరో విక్రమ్ మరోసారి అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని.. తన నటనతో సినిమాకే హైలైట్ గా నిలిచారని చెప్పుకొచ్చారు. డైరెక్షన్ కూడా చాలా టెరిఫిక్ గా ఉందని.. క్లైమాక్స్, ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఈ సినిమాలో నటించారు. ఆయన నటనను కూడా కొనియాడారు.
ఎన్నో ట్విస్ట్ లతో ఈ సినిమాను దర్శకుడు అద్భుతంగా మలిచారని తెలిపారు. ఫైనల్ గా మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు కచ్చితంగా ఈ సినిమా కనెక్ట్ అవుతుందని అన్నారు. మరి మాస్ ఆడియన్స్ ని ఈ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందనేది చూడాలి. గతంలో ఉమైర్ సంధు చాలా సినిమాలకు ఇలానే పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. రీసెంట్ గా 'లైగర్' సినిమా గురించి పాజిటివ్ గా చెప్పారు. ఆ సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. మరిప్పుడు 'కోబ్రా' విషయంలో ఏం జరుగుతుందో చూడాలి!
ఇక 'కోబ్రా' సినిమాలో విక్రమ్ సుమారు 20 పాత్రల్లో కనిపిస్తారని టాక్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. ఎ.ఆర్.రెహమాన్ (A.R.Rahman)సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయనే స్వయంగా రిలీజ్ చేస్తున్నారు.