Chhattisgarh Encounter: భారీ ఎన్‌కౌంటర్‌లో 14 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు !
Odisha Chhattisgarh encounter | ఛత్తీస్ గఢ్- ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మొత్తం 14 మంది వరకు మావోయిస్టులు భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

ఒడిశా -ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గరియాబంద్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 14 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని సమాచారం. జనవరి 19 నుంచి జరిగిన ఎదురుకాల్పులలో ఇదివరకే 12 మంది మావోయిస్టులు మృతిచెందడం తెలిసిందే. తరువాత మరో ఇద్దరు చనిపోయారని ఓ ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కోబ్రా CRPF, ఒరిస్సా SOG పోలీసు ఎన్‌కౌంటర్ బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో పెద్ద మొత్తంలో మావోయిస్టులు మృతిచెందారని అధికారులు తెలిపారు.
పోలీసులు విడుదల చేసిన లేఖలో ఏముందంటే..
1. ఒడిశాలోని నువాపాడ జిల్లా సరిహద్దు నుంచి కేవలం 5 కి.మీ దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని కులరిఘాట్ రిజర్వ్ ఫారెస్ట్‌లో జనవరి 19 రాత్రి నుంచి జరిగిన ఎదురు కాల్పుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు.
2. మావోయిస్టుల గురించి మాకు సమాచారం అందగా ఆదివారం రాత్రి ఒడిశాలోని నువాపాడ జిల్లా, ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా సరిహద్దులో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీసులు- CRPF సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ ప్రారంభించారు
3. సోమవారం జరిగిన ఎందురుకాల్పులలో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతమయ్యారు. అదే సమయంలో భద్రతా దళాలు పెద్ద అక్కడ పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, 1 SLR, IEDలను స్వాధీనం చేసుకున్నాయి
4. ఈ అంతర్ రాష్ట్ర ఆపరేషన్ కొనసాగింపులో భాగంగా జనవరి 21 తెల్లవారుజామున SOG బృందం, ఇతర బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. కాల్పులు జరిపిన చోట భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో పోలీసులు ఇంకా భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
2024లో ఇక్కడ జరిగిన ఎన్‌కౌంటర్ లో 6 మంది మావోయిస్టులు మరణించారు. మరో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. మరో 24 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. 2025లో ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు, CAPFతో కలిసి చేసిన ఆపరేషన్లలో మొత్తం 14 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఘరియాబాద్ ఎన్కౌంటర్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట తరాలపల్లి కి చెందిన మోడం బాలకృష్ణ @ బాలన్న @ భాస్కర్, @ మనోజ్ SZC కూడా ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు సమాచారం అయితే అధికారిక ధ్రువీకరణ జరగలేదు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

