అన్వేషించండి

Citadel: Honey Bunny: 'సిటాడెల్‌' రెండో ట్రైలర్‌ విడుదల... యాక్షన్‌తో అదరగొట్టిన సమంత - ప్రియాంక కంటే బెటరా?

సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ ‘సిటాడెల్‌: హనీ బన్నీ’. త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రానున్న నేపథ్యంలో మేకర్స్ రెండో ట్రైలర్ ను విడుదల చేశారు.

Citadel: Honey Bunny Trailer 2 : టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత, బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పై యాక్షన్‌ వెబ్ సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ బన్నీ’. హాలీవుడ్ లో ఇండియన్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటించిన ‘సిటాడెల్’కు ఇండియన్ వెర్షన్ గా ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘ఫర్జీ’ లాంటి సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ లను తెరకెక్కించిన రాజ్, డీకే ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటున్నది. త్వరలో ప్రేక్షకుల ముదుకు రాబోతున్నది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగా ‘సిటాడెల్‌: హనీ బన్నీ’కి సంబంధించిన రెండో ట్రైలర్ ను విడుదల చేశారు.  

యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టిన సమంత

‘సిటాడెల్‌: హనీ బన్నీ’కి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ట్రైలర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వెబ్ సిరీస్ పై భారీగా అంచనాలను పెంచేసింది. తాజాగా రెండో ట్రైలర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. గతంలో ఎప్పుడూ కనిపించని రీతో సమంతా ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టింది. అమ్మడు యాక్టింగ్ చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ ముద్దుగుమ్మ స్టంట్స్ చూసి వారెవ్వా అంటున్నారు. కొంత మంది సామ్ ఫ్యాన్స్ అయితే ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్ కంటే ఈ ట్రైలర్ బావుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు సమంత చేసిన యాక్షన్ వెబ్ సిరీస్ లను తలదన్నేలా ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ ఉండబోతుందంటున్నారు అమె అభిమానులు. ఈ వెబ్ సిరీస్ లో హనీగా సమంత, బన్నీగా వరుణ్ ధావన్ అదరగొట్టేశారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)

సమంత యాక్షన్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆడియెన్స్   

చాలా రోజుల తర్వాత సమంత యాక్షన్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సిరీస్ కోసం ఆమె అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కే కే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికిందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌ కిత్ పరిహార్, కష్వీ మజ్ముందర్ ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు డి2ఆర్ ఫిల్మ్స్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించాయి. నవంబర్‌ 7న హిందీ, తెలుగు,తమిళ్‌, కన్నడ, మలయాళంలో ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ వెబ్ సిరీస్  స్ట్రీమింగ్‌ కానుంది. ఇప్పటికే రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో ‘ఫ్యామిలీ మ్యాన్‘ సీజన్ 2లో నటించిన సమంత.. ఇప్పుడు మరోసారి వారితో కలిసి పనిచేస్తోంది.    

Read Also: టీనేజ్ కుర్రాళ్ల తప్పటడుగులు... రియలిస్టిక్‌గా ఆకట్టుకుంటున్న ‘ముర’ ట్రైల‌ర్

టాప్ హెడ్ లైన్స్

Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Embed widget