Kadak Singh : 'కడక్ సింగ్' ట్రైలర్ - వింత వ్యాధి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ - ఓ ఫ్యామిలీ మ్యాన్ ఎమోషనల్ జర్నీ ఇదీ!
Kadak Singh : బాలీవుడ్ విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'కడక్ సింగ్' మూవీ ట్రైలర్ ని గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించిన ‘కడక్ సింగ్’. ఈ మూవీ ట్రైలర్ ని గోవాలో జరిగిన 54 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభ వేడుకల్లో విడుదల చేశారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే IFFI కి సంబంధించిన గాలా ప్రీమియర్స్ లో ‘కడక్ సింగ్’ మూవీ ప్రీమియర్ కాబోతోంది. డిసెంబర్ 8న ZEE5 ఈ మూవీని ప్రదర్శించనుంది.
నేషనల్ అవార్డు విన్నర్ అనిరుద్ రాయ్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పార్వతీ తిరువోతూ, సంజనా సంఘీ, బంగ్లాదేశ్ నటి జయ ఎహసాన్, దిలీప్ శంకర్, పరేష్ పాహుజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఓపెన్ కమ్యూనికేషన్స్, విజ్ ఫిలిమ్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆండ్రే తిమ్మన్స్, వీరాఫ్ సర్కారీ, సబ్బాస్ జోసెఫ్, మహేష్ రామనాథన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇక కడక్ సింగ్ ట్రైలర్ విషయానికొస్తే.. ఏకే శ్రీ వాస్తవ్ అలియాస్ కడక్ సింగ్ ఫినాన్సియల్ క్రైమ్ డిపార్ట్మెంట్లో జాయిన్ డైరెక్టర్ గా పనిచేస్తుంటారు. తను రెట్రో గేడ్ అమ్నీషియాతో బాధపడుతుంటాడు. హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆయన గతానికి సంబంధించిన కొన్ని విషయాలు వర్తమాన జీవితంపై ప్రభావితం చూపుతుంటాయి. సగం సగం గుర్తుకొచ్చిన జ్ఞాపకాలపై ఇబ్బంది పడుతున్న కడక్ సింగ్ ఓ రోజు తనకు ఏమైందో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇదే క్రమంలో తన కుటుంబం విడిపోకుండా కాపాడుకుంటూ వస్తుంటాడు. ఓవైపు థ్రిల్లింగ్ ఎలివెంట్స్ తో పాటు ఫ్యామిలీకి సంబంధించిన భావోద్వేగాలను కొత్త కోణంలో చూపించే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది.
ఇక ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ.. "నటుడుగా ఎన్నో విలక్షణమైన పాత్రలు చేశాను. కానీ కడక్ సింగ్ లాంటి పాత్రలో ఎప్పుడు నటించలేదు. ఇలాంటి క్యారెక్టర్ చేయడం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. గోవాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో మా కడక్ సింగ్ ట్రైలర్ విడుదల అవ్వడం సంతోషంగా ఉంది" అని అన్నారు. పార్వతి తిరువోతూ మాట్లాడుతూ.. "కడక్ సింగ్ లో నటించడం అరుదుగా దొరికే అవకాశం. అందులోనూ పంకజ్ త్రిపాఠి లాంటి యాక్టర్ తో కలిసి నటించడం మెమొరబుల్ ఎక్స్ పీరియన్స్" అని అన్నారు.
"ఈ సినిమా కథ విన్నప్పుడు కొత్తగా అనిపించింది. డైరెక్టర్ అనిరుద్ అండ్ టీమ్ దాన్ని చాలా బాగా తెరకెక్కించారు. గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మా మూవీ ట్రైలర్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది" అని తెలిపారు సంజన సంగీ. "కడక్ సింగ్ లో పైవిద్యమైన పాత్రలో కనిపిస్తాను. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పంకజ్ వంటి గొప్ప యాక్టర్ తో నటించడం మర్చిపోలేను. నేను నటించిన సినిమాల్లో దీనికి ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈసినిమా కోసం నేను ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు బంగ్లాదేశ్ నటి జయ.
Also Read : టాలీవుడ్ మన్మథుడు, ‘బిగ్ బాస్’ హోస్ట్ ఆస్తుల విలువ అన్ని వేల కోట్లా?