అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

రాకేష్ మాస్టర్‌ అలా చేసి ఉంటే టాప్‌లో ఉండేవారు, యూట్యూబ్‌లో ఆయన్నిఅలా చూసి షాకయ్యా: వైవీఎస్ చౌదరి

కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల అనారోగ్య కారణాలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన సంతాప సభను నిర్వహించగా.. ఈ సభలో ఒకప్పటి దర్శకుడు వై వి ఎస్ చౌదరి ఆయన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. విజయనగరంలో షూటింగ్ నిమిత్తం వెళ్లి వడదెబ్బ తగలడంతో విరోచనాలు, రక్త వాంతులకు గురై ఈనెల 18న రాకేష్ మాస్టర్ తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన శిష్యులు ప్రస్తుత టాలీవుడ్ అగ్ర కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, జానీ, గణేష్ మాస్టర్స్ తదితరులు ఆయన అంత్యక్రియలకు హాజరై ఘన నివాళులు అర్పించారు. అయితే ఈరోజు రాకేష్ మాస్టర్ సంతాప సభను ఏర్పాటు చేయగా.. ఈ సభలో ఒకప్పటి అగ్ర దర్శకుడు వైవిఎస్ చౌదరి పాల్గొని రాకేశ్ మాస్టర్ తో తనకున్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ మేరకు వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ.." 'దేవదాస్' సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు సాధారణంగా దర్శకులు, నిర్మాతలు ఇండస్ట్రీలో పేరు మోసిన డాన్స్ మాస్టర్లని, లేకపోతే ఎక్కువగా ఫారిన్ లొకేషన్స్ లో కొరియోగ్రఫీ చేసిన డాన్స్ మాస్టర్స్ ని బేస్ చేసుకుని వెళ్తారు. కానీ నేను ఎంతో ధైర్యంతో, మాస్టర్ మీద ఉన్న నమ్మకంతో ఆయన్ని అమెరికా తీసుకెళ్లా. అసిస్టెంట్స్ కూడా ఉండరు. ఎందుకంటే కొత్తవాళ్ళను పరిచయం చేసే సినిమాల్లో ఎక్కువ టీం ని తీసుకెళ్లే అవకాశం ఉండదు. దీంతో ఆయన ఒక్కరే వచ్చారు. నా వెంటే ఓ అసిస్టెంట్ డైరెక్టర్ లా ఉంటూ.. మేం చేసిన 45 నుంచి 50 రోజుల షూటింగ్ లో మాతో పాటు ట్రావెల్ అవుతూ మేము ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటూ, ఏం తింటే అది తింటూ మాలో ఒక కుటుంబ సభ్యుడి లాగా ఉండి ఎంతో ఎనర్జీని ఇచ్చారు. దేవదాస్ మూవీలోని ఆ సాంగ్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. షూటింగ్ మధ్య మధ్యలో నేను మూమెంట్స్ ని చూపించమని అడుగుతూ ఉండేవాడిని. సాహిత్యానికి తగ్గ మూమెంట్ లేకపోతే ఇంకా బెటర్ గా కావాలని నేను అడిగేవాడిని. ఆయన కూడా చేస్తూనే ఉండేవారు. ఇలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి’’ అని చెప్పారు.

‘‘కానీ ఇంత జర్నీలో నాకు ఒకటే తెలియలేదు. రాకేష్ మాస్టర్ మద్యం సేవిస్తారనే విషయం నాకు అస్సలు నిజంగా తెలియదు. అసలు షూటింగ్స్ లో మాకు ఎక్కువ కనబడే వారు కాదు. ఇప్పుడు మీరంతా చూసిన మాస్టర్ గారు వేరు. నేను ఆరు సినిమాల వరకు చూసిన మాస్టర్ గారు వేరు. షూటింగ్స్ లో చాలా ఇన్నోసెంట్ గా, గౌరవంగా, నిబద్ధతతో ఏదో సాధించాలనే కసి ఆయనలో కనిపించేది. ఆకలి, దాహం అన్నింటినీ పక్కనపెట్టి కేవలం తన వర్క్ పైన ఫోకస్ పెట్టేవారు. అలాంటి మాస్టర్‌ను తదనంతర కాలంలో యూట్యూబ్ ఛానల్స్ అన్ని వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే విధానం చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. అంటే మాస్టర్ గారు ఇలా కూడా మాట్లాడగలరా? ఆయన మద్యం కూడా సేవిస్తారా? ఇవన్నీ చూసి షాక్ అయ్యాను. దేవదాస్ షూటింగ్ అంతా అయిపోయి సినిమా రిలీజ్ అయి పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆయన ఓపిగ్గా పది మంది దగ్గరికి వెళ్లగలిగితే నెమ్మదిగా ఆయనకంటూ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ గా చాలా పెద్ద కెరీర్ ఉండేది అనేది నా నమ్మకం. ఎందుకంటే మేమందరం ఆయనతో ట్రావెల్ చేసాం’’ అని తెలిపారు.

‘‘ఆయన తర్వాత చాలా మంది కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యేవారు. కానీ ఆ తర్వాత ఆయనలో ఓ భావోద్వేగం కలిగి నేను కూడా డైరెక్టర్ అవుతానని నా దగ్గరికి వచ్చి చెప్పారు. అప్పుడు మాస్టర్ గారికి నేను గుడ్ లక్ అని చెప్పి, షేక్ హ్యాండ్ ఇచ్చా. ఒకటి కాదు రెండు సినిమాలు డైరెక్ట్ ఇస్తున్నానని చెబితే డబుల్ కంగ్రాట్యులేషన్స్ మాస్టర్ గారు అని చెప్పాను. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. 6 సినిమాల వరకు నాకు కనిపించిన రాకేష్ మాస్టర్ వేరు, తర్వాత కనిపించిన మాస్టర్ గారు వేరు. 2008 నుంచి ఏర్పడిన ఒక అంతర్జాల ప్రపంచంలో ఒక రజనీకాంత్, ఒక నందమూరి తారకరామారావు గారి లాంటి బిగినింగ్ స్టార్స్ కి జరిగిన ఒక ఇమేజ్ ఏదైతే ఉందో, అది రాకేష్ మాస్టర్‌కు ఏర్పడింది. అది చాలా గొప్ప విషయం. అలాగే ఇప్పుడు యూట్యూబ్లో ఎంత మంది పెద్ద స్టార్స్ అయినా కూడా రాకేష్ మాస్టర్ ఎవరెస్ట్ లాంటి పాపులారిటీ సంపాదించారు. అది నేను నిజంగా ఆశ్చర్యపోతున్నాను. గర్వపడుతున్నాను" అని చెప్పుకొచ్చారు వై వీ ఎస్ చౌదరి.

Also Read : డబ్బింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ - ‘బ్రో’ టీజర్‌ వచ్చేది రేపే, ఎన్ని గంటలకో తెలుసా?

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget