అన్వేషించండి

Yatra 2 : 'యాత్ర 2'లో సోనియా గాంధీ - ఇటలీ నుంచి కాదు, జర్మన్ నటి!

Sonia Gandhi In Yatra 2 : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితాన్ని ఆధారం చేసుకుని మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న సినిమా 'యాత్ర 2'. ఇందులో సోనియా గాంధీ పాత్రకు జర్మన్ నటిని ఎంపిక చేశారు. ఆమె ఎవరో తెలుసా?

Suzanne Bernert as Sonia Gandhi in Yatra2 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్... తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాల సందడి షురూ అయ్యింది. ఎన్నికలకు ముందు థియేటర్లలోకి వచ్చే సినిమాలపై ప్రేక్షకుల చూపు కూడా పడుతోంది. అందులో ముఖ్యమైన సినిమా 'యాత్ర 2' (Yatra 2). తెలుగు రాజకీయ నాయకులు, ప్రేక్షకులు... ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రమిది.

జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర' తెరకెక్కించారు మహి వి రాఘవ్. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా... వైఎస్సార్ తనయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) జీవితం ఆధారంగా 'యాత్ర 2'  తెరకెక్కిస్తున్నారు. 

త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక 'యాత్ర 2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రి మరణం తర్వాత జగన్ నాయకునిగా ఎదిగిన తీరుతో పాటు 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో జ‌రిగిన రాజకీయ ఘటనలు కీలకం కాబోతున్నాయి.

'యాత్ర 2'లో సోనియా గాంధీ ఎవరో తెలుసా?
'యాత్ర'లో వైయస్సార్ పాత్ర చేసిన మమ్ముట్టి... 'యాత్ర 2'లో మరోసారి ఆ పాత్రలో కనిపించనున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ హీరో, నిర్మాత ఆర్బీ చౌదరి తనయుడు జీవా (Jiiva Hero) నటిస్తున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో హిందీ & మరాఠీ దర్శకుడు, నటుడు మహేష్ మంజ్రేకర్ నటిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో సోనియా గాంధీ పాత్రలో జర్మన్ నటి నటిస్తున్నారు. 

Also Read : ‘జపాన్‌’ To ‘టైగర్ 3’- దీపావళికి దుమ్మురేపే సినిమాలు ఇవే!

Suzanne Bernert as Sonia Gandhi : వైయస్సార్ మరణం తర్వాత తెలుగు గడ్డపై జరిగిన రాజకీయాల్లో కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ పేరు బలంగా వినిపించింది. 'యాత్ర 2'లో ఆమె పాత్ర ఉంది. ఆ పాత్రకు జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ (Suzanne Bernert)ని ఎంపిక చేశారు. ఆల్రెడీ షూటింగ్ కూడా చేశారు. మంగళవారం ఆమె లుక్ విడుదల చేస్తున్నారు. హిందీ నటుడు, ఈ ఏడాది మరణించిన అఖిల్ మిశ్రా భార్య ఈవిడ. సుమారు 20 ఏళ్ళ నుంచి భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్, సీరియళ్లు చేస్తున్నారు. తెలుగులో ఆమెకు తొలి సినిమా 'యాత్ర 2'. 

Also Read : ఆ పెళ్లి కొడుకు ఎవరో నాకూ చెప్పండయ్యా - అల్లు కామెంట్స్ వైరల్ కావడంతో హీరోయిన్ క్లారిటీ

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suzanne Bernert (@suzannebernert)

ఫిబ్రవరి 8న 'యాత్ర 2' విడుదల!
'నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి... నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' అంటూ ప్రచార చిత్రాల్లో చెప్పిన జగన్ డైలాగ్ ప్రజలను ఆకట్టుకుంటోంది. 'యాత్ర'ను ఫిబ్ర‌వ‌రి 8, 2019లో విడుద‌ల చేశారు. 'యాత్ర 2'ను కూడా ఆ తేదీకి విడుదల చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న 'యాత్ర 2' విడుదల కానుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : మది, సంగీతం : సంతోష్ నారాయణన్‌. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget