Diwali Movies: ‘జపాన్’ To ‘టైగర్ 3’- దీపావళికి దుమ్మురేపే సినిమాలు ఇవే!
దీపావళి కానుకగా పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటిలో డబ్బింగ్ చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. అటు ఓటీటీలో లేటెస్ట్ మూవీస్, వెబ్ సిరీస్ లు విడుదల రెడీ అవుతున్నాయి.
దసరా మాదిరిగానే దీపావళికి కూడా పలు కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. అయితే, వీటిలో ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలే ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ ముందుకు రానున్నాయి. ఇంతకీ దీపావళి సందర్భంగా సినీ అభిమానులను అలరించే చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
ఈ వారం థియేటర్లలో అలరించే చిత్రాలు
1.‘జపాన్’- నవంబరు 10న విడుదల
కార్తి హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జపాన్’. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో కార్తి ‘జపాన్’ అనే దొంగగా కనిపించనున్నారు. రూ.200 కోట్ల విలువైన నగలను ఆయన ఎలా కొట్టేశాడు? పోలీసులు అతడిని ఎలా పట్టుకున్నారు? అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబరు 10న విడుదల కానుంది.
2. ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’- నవంబరు 10న విడుదల
రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య కీలక ప్రధాన పాత్రల్లో తెరెక్కిన సినిమా ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 10న తమిళ, తెలుగు భాషల్లో విడుదలకానుంది. గ్యాంగ్‌స్టర్ కథ ఆధారంగా సినిమా తీయాలి అనుకున్న దర్శకుడు, గ్యాంగ్‌స్టర్‌నే హీరోగా పెట్టి సినిమా తీస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఇందులో చూపించనున్నారు.
3.‘అలా నిన్ను చేరి’- నవంబరు 10న విడుదల
దినేశ్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా రూపొందిన సినిమా ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా అలరించబోతోంది.
4.‘ది మార్వెల్స్’- నవంబరు 10న విడుదల
అమెరికన్ సూపర్ హీరో మూవీ ‘ది మార్వెల్స్’. ఇందులో హాలీవుడ్ నటి బ్రీ లార్సన్ కెప్టెన్ మార్వెల్ పాత్రలో కనిపించనుంది. నియా డకోస్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నవంబరు 10న తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళ భాషల్లో విడుదల కానుంది.
5.‘దీపావళి’- నవంబరు 11న విడుదల
అందమైన అందమైన పల్లెటూరి కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘దీపావళి’. రాము, వెంకట్, దీపన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబరు 11న విడుదల కానుంది.
‘టైగర్3’- నవంబరు 12న విడుదల
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘టైగర్3’. కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తోంది. ‘టైగర్ జిందా హై’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. నవంబరు 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు
అమెజాన్ ప్రైమ్
రెయిన్ బో రిష్టా (ఇంగ్లీష్) నవంబరు 7న విడుదల
బీటీస్: ఎట్ టూ కమ్ (కొరియన్ మూవీ) నవంబరు 9న విడుదల
పిప్పా (హిందీ) నవంబరు 10న విడుదల
నెట్‌ఫ్లిక్స్
ఇరుగుపట్రు (తమిళం) నవంబరు 6న విడుదల
రాబీ విలియమ్స్ (వెబ్‌సిరీస్) నవంబరు 8న విడుదల
ది కిల్లర్ (హాలీవుడ్) నవంబరు 10న విడుదల
ఆహా
ది రోడ్ (తమిళం) నవంబరు 10న విడుదల
డిస్నీ+హాట్‌స్టార్
విజిలాంటి (కొరియన్) నవంబరు 8న విడుదల
లేబుల్ (తెలుగు) నవంబరు 10న విడుదల
జీ5
ఘూమర్ (హిందీ) నవంబరు 10న విడుదల
బుక్ మై షో
ది రాత్ ఆఫ్ బెక్కీ (హాలీవుడ్)నవంబరు 7న విడుదల
ది అడల్ట్స్ (హాలీవుడ్) నవంబరు 10న విడుదల
Read Also: ఓటీటీలోకి దిల్‌రాజు, అసలు విషయం చెప్పేసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial