అన్వేషించండి

Bholaa Shankar: అలా చేసుంటే 'భోళా శంకర్' బెటర్‌గా ఉండేదేమో: పరుచూరి గోపాలకృష్ణ

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'భోళా శంకర్'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడానికి గల కారణాలను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషించారు. 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భోళా శంకర్'. ఇది 8 ఏళ్ళ క్రితం తమిళ్ లో ఘన విజయం సాధించిన 'వేదాళమ్' మూవీకి అధికారిక రీమేక్ అనే సంగతి తెలిసిందే. తెలుగులో తమన్నా భాటియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. చిరు కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లోనే అతి పెద్ద పరాజయాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి గల కారణాలను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషించారు. 

పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పాఠాలు' అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సినిమాలకు సంబంధించిన విశేషాలను అందరితో పంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'భోళా శంకర్' మూవీ గురించి మాట్లాడారు. తమిళంలో విజయవంతమైన సినిమా ఇక్కడ సక్సెస్ అవ్వాలని లేదని.. కానీ ఆ హీరో బాడీ లాంగ్వేజ్ కు ఆ కథ అతుకుతుందా లేదా? అనేది చూసుకోవాలని అన్నారు. సినిమాలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా చిరంజీవితో పాటుగా తమన్నా, కీర్తి సురేష్ మాత్రమే కనిపించారు. మిగతా పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉన్నట్లు నాకు అనిపించలేదన్నారు. 

''భోళా శంకర్.. అన్నాచెల్లెలి కథ కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఇది చెల్లి కాని చెల్లిని తన చెల్లిగా స్వీకరించిన అన్న కథ. అది ఒక అద్భుతమైన పాయింట్. బహుశా అది ‘వేదాళం’లో బాగా ఎక్కి ఉంటుంది. ఇక్కడికి వచ్చే సరికి అలా జరగలేదు. సినిమాలో కథానాయకుడు అన్ని హత్యలు చేసిన తర్వాత కూడా అరెస్ట్ అవ్వకుండా ఉన్నాడంటే అతను సీబీఐ ఆఫీసర్ లేదా ప్రభుత్వంతో నియమించబడిన అధికారి అయినా అయ్యుండాలి. లేకపోతే అన్ని హత్యలు చేసినందుకు జైలుకి వెళ్ళాలి''

''ఏ సినిమా అయినా ప్రాంతీయత అనేది బాగా ప్రభావం చూపిస్తుంది. ఇది మన ప్రాంతానికి చెందిన కథ కాదని సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అనిపిస్తే మాత్రం డిస్ కనెక్ట్ అయిపోతాడు. అందుకే తమిళ్ రీమేక్ చిత్రాల్లో కూడా మన ఊర్ల పేర్లు పెడుతుంటారు. ఇక్కడ 'భోళా శంకర్'లో ఎప్పుడైతే కలకత్తా అన్నావో ఇది మన ఆంధ్రా తెలంగాణ కథ కాదనే ఫీలింగ్ నాకు అనిపించింది. మరి ఆ బ్యాక్ డ్రాప్ ని ఎందుకు మార్చుకోలేదో తెలియలేదు''

''ఇది ప్రధానంగా అన్నా చెల్లెలి సెంటిమెంట్ నేపథ్యంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ని తుద ముట్టించిన హీరో కథ. రక్త సంబంధం, ఆడపడుచు, నాగేశ్వరరావు సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు చూసుకున్నా.. అన్నా చెల్లెళ్ళ కథ రూట్ మ్యాప్ వేరే ఉంటుంది. కానీ ఇందులో భయంకరమైన మాఫియాని అణచివేసే హీరో, అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ అనే రెండు పడవల మీద ప్రయాణం చేశారా అనే అనుమానం కలుగుతుంది''

''హత్య అనేది అత్యంత ప్రమాదకరమైన ఇన్సిడెంట్. ఫస్టాఫ్ లో హత్యలు చేసి, సెకండాఫ్ లో కథ చెబుతామంటే.. హీరో ఎందుకు చంపుతున్నాడనేది చూసేవారికి అర్థం కాదు. హీరో హత్యలు ఎందుకు చేస్తున్నాడనేది రివీల్ చెయ్యకుండా కొన్ని సినిమాలు చేసి మేం దెబ్బ తిన్నాం. 'ఖైదీ' చిత్రాన్ని తీసుకుంటే.. కథంతా ముందే చెప్పేసి, ఆయనకు జరిగిన అన్యాయాన్ని చూపించిన తర్వాత చిరంజీవి ఒక్కొక్కడిని నరుకుతుంటే జనాలకు నచ్చింది. కాబట్టి ఒక హీరో హత్యలు చేసుకుంటూ వెళ్ళాలి అంటే, దాని వెనకున్న కారణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందే చూపించాలి''

''భోళా శంకర్ లో చిరంజీవి లాంటి హీరోని పెట్టుకొని, ఓపెనింగ్ లోనే హత్యలు చేసుకుంటూ వెళ్తుంటే ఉలిక్కి పడ్డాం. ఆ తర్వాత తమన్నా ఆయన్ను ద్వేషిస్తుంది. ఒక మెగాస్టార్ ని వద్దు అనుకునే పాత్ర ఆడియన్స్ కు ఎక్కదు. హీరోయిన్ హీరో వెంట పడుతుంటే నచ్చుతుందే తప్ప, హీరోని అల్లరి చేయాలని అవమానం చెయ్యాలనుకుంటే మాత్రం అది ప్రమాదంగా మారుతుంది. అలాంటిది ఇక్కడ ఆవిడకే ఫ్లాష్ బ్యాక్ చెప్పించారు'' 

''సినిమాకు సంబంధించి ప్రతీ విషయంలో చిరంజీవి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయన ఒక ఫేజ్ లో భయంకరమైన పోరాట యోధుడుగా, మరో ఫేజ్ లో ఎంటర్టైన్మెంట్ సినిమాలు, ఆ తర్వాత క్యారక్టర్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. 'ఠాగూర్' 'ఇంద్ర' లాంటి సినిమాలే చేయాలి అనుకుంటున్న టైములో.. 'వాల్తేరు వీరయ్య' లాంటి మూవీ తీసి సక్సెస్ చేసి చూపించారు. కానీ ఆ బాడీ లాంగ్వేజ్ 'భోళా శంకర్' కథకు సరిపోలేదు. ఫస్టాఫ్ లో అద్భుతమైన హీరోయిజాన్ని చూపించి, సెకండాఫ్ లో ఇల్లు ఖాళీ చేయించడం, ప్రకృతి వైద్యంతో మనుషులను బ్రతికించే మనిషికి ఆయన కూతురికి అన్యాయం చేస్తున్నాడు అనే సరికి టక్కున డిస్ కనెక్ట్ అయిపోతారు''

''చిరంజీవి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా శ్రీముఖి లాంటి అమ్మాయిని కాకుండా ఒక హీరోయిన్ ని పెట్టి, ఆమెతో ప్రేమలో ఉన్నట్లు, ఆమెకు జరిగిన అన్యాయం మీద పోరాటం చేసినట్లు చూపిస్తే బాగుండేదేమో. అసలు ఈ కథను తిప్పి చెప్పాల్సిన అవసరం లేదు. అలా కాకుండా యధాతధంగా కథని నడిపిస్తూ.. ఒక మామూలు వ్యక్తి సీబీఐ దృష్టికి వెళ్లి, హ్యూమన్ ట్రాఫికింగ్ ని నామరూపాలు లేకుండా చేసే బాధ్యత తీసుకున్నాడు అనే విధంగా చూపిస్తే.. హీరో పాత్ర అద్భుతంగా ఉండేది. ఉన్నదాన్నే బాగు చేసుకొని, ఎంటర్టైన్మెంట్ ని అలా చేయాలనే నిర్ణయం తీసుకోకుండా ఉండి ఉంటే.. ఇదే సినిమా ఇంకా బెటర్ గా ఆడేదేమో అని నాకు అనిపించింది'' అని పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

Also Read: బాలయ్య 'అన్ స్టాపబుల్' అప్డేట్ - సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Vidudala OTT: డిసెంబర్ 20న విజయ్ సేతుపతి ‘విడుదల 2’... ఓటీటీలో ఫ్రీగా ప్రీక్వెల్ చూసేయండి - ఎందులోనో తెలుసా?
డిసెంబర్ 20న విజయ్ సేతుపతి ‘విడుదల 2’... ఓటీటీలో ఫ్రీగా ప్రీక్వెల్ చూసేయండి - ఎందులోనో తెలుసా?
Look Back 2024: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Embed widget