అన్వేషించండి

Vijay Devarakonda : 'లైగర్' విడుదలకు ముందు అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన 'లైగర్' సినిమా కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు యంగ్ అండ్ సెన్సేషనల్ హీరో ఒక నిజం చెప్పారు.

'లైగర్' (Liger Movie) సందడి థియేటర్లలో ప్రారంభం కావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ సందర్భంగా ఒక్కసారి వెనక్కి వెళితే... సినిమా ట్రైలర్ చూశారా? హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) యాటిట్యూడ్, దర్శకుడు పూరి జగన్నాథ్ టేకింగ్ & మేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌ను నిశితంగా గమనిస్తే... ఇంకో విషయం కూడా ఆకట్టుకుంది. అది ఏంటంటే... విజయ్ దేవరకొండకు రమ్యకృష్ణ కాలితో గట్టిగా ఒక్కటి ఇచ్చే సీన్! సినిమా విడుదలకు ముందు ఆ సీన్ వెనుక ఉన్న కథను విజయ్ దేవరకొండ బయట పెట్టారు.
 
అనన్యాతో రొమాన్స్...
రమ్యకృష్ణ కిక్ సీన్!
'లైగర్'లో విజయ్ దేవరకొండకు తల్లిగా రమ్యకృష్ణ నటించిన విషయం తెలిసిందే. కథానాయికగా అనన్యా పాండే నటించారు. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ ఎలా ఉంటుందనేది తెలియడానికి ఆల్రెడీ విడుదలైన సాంగ్స్ చూస్తే చాలు. 'ఆఫత్...' సాంగ్ రొమాంటిగ్‌గా ఉంది. ''ఆ ఆఫత్‌ల‌కు రియాక్షనే ఆ కిక్ సీన్. అమ్మ నన్ను గట్టిగా వేసింది'' అని విజయ్ దేవరకొండ తెలిపారు. అమ్మాయి వెనక పడుతూ కుమారుడు లక్ష్యాన్ని పక్కన పెట్టడంతో తల్లి గట్టిగా ఒక్కటి ఇచ్చిందన్నమాట. 'లైగర్' చిత్ర బృందాన్ని సుమ కనకాల ఇంటర్వ్యూ చేశారు. అందులో ఈ విషయాలు చెప్పారు.
 
నార్త్‌లో 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప' విజయాలపై 
విజయ్ దేవరకొండ అండ్ టీమ్ విశ్లేషణ
ఇప్పుడు ఉత్తరాదిలో దక్షిణాది సినిమాల హవా నడుస్తోంది. 'బాహుబలి', 'కెజియఫ్', 'ఆర్ఆర్ఆర్' నుంచి లేటెస్ట్ 'కార్తికేయ 2' వరకూ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ సినిమాలు హిందీలో ఎందుకు విజయాలు సాధిస్తున్నాయి? అనే చర్చ వచ్చింది. అప్పుడు ''మనం ఎప్పుడూ నేటివిటీకి దగ్గరగా ఉన్న క్యారెక్టర్లతో సినిమాలు తీస్తున్నాం. మాస్, అన్నీ ఉండేలా చూసుకుంటున్నాం'' అని దర్శకుడు పూరి జగన్నాథ్ అభిప్రాయ పడ్డారు.

Vijay Devarakonda On RRR and Pushpa Success In North India : 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప' విజయాలపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ''రమ్యకృష్ణ గారు రాజమౌళి, పూరి జగన్నాథ్ వంటి దర్శకులతో పని చేశారు కదా! కొంత మంది దర్శకులు సినిమా స్కేల్ ఎంత పెంచినా... ఎమోషన్స్ వదలరని ఆవిడ చెప్పారు. అది వింటే నిజమేనని అనిపించింది. చాలా మంది సినిమా స్కేల్ పెంచుతారు. ఫైట్స్ పెడతారు. అయితే, కోర్ ఎమోషన్ మిస్ అవుతుంది. అందువల్ల, ప్రేక్షకులకు కనెక్షన్ ఉండదు. పూరి గారు ఎంత స్కేల్ పెంచినా... ఆ మాస్, మదర్ అండ్ సన్ ఎమోషన్, లవ్ స్టోరీ మిస్ చేయరు. 'ఇడియట్', 'పోకిరి'లో ఎలా ఉందో... ఇప్పుడూ అలాగే ఉంది. కాకపోతే సినిమా స్కేల్ పెరిగింది. 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్', 'పుష్ప' ఇవన్నీ ఎంత పెద్ద స్కేల్‌లో ఉన్నా... ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎందుకు చూశారంటే... కోర్ ఎమోషన్ ఉండేలా చూసుకున్నారు. ఈ దర్శకుల స్పెషాలిటీ అది'' అని చెప్పారు. 

Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి

ఆగస్టు 25న 'లైగర్' థియేటర్లలో విడుదల అవుతోంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమా రూపొందింది. విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.     

Also Read : ఎవరు ఆపుతారో చూద్దాం - విజయ్ దేవరకొండ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Allu Arjun: ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
Embed widget