SK23: మృణాల్‌ను కాదని రుక్మిణి వసంత్‌కు ఛాన్స్ - దర్శకుడు మురుగదాస్ ఎందుకలా చేశారు?
మురుగదాస్, శివ కార్తికేయన్ సినిమాలో మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, చివరకు ఈ మూవీలో రుక్మిణి వసంత్ ను ఫిక్స్ చేశారు.
Murugadoss Chose Rukmini Vasanth Over Mrunal Thakur For SK23: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేషన్ ప్రధాన పాత్రలో తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ ఓ సినిమా చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా? అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ మూవీ షూటింగ్ మొదలయ్యింది. KS23 పేరుతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చైన్నెలో అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. సరికొత్త కథాంశంతో పూర్తి స్థాయిలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
SK23లో హీరోయిన్ గా రుక్మిణి వసంత్
KS23 సినిమాలో హీరోయిన్‌గా ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేశారు దర్శకుడు మురుగదాస్. షూటింగ్ ప్రారంభంలో ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఈ సినిమాలో ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆమెను కాదని రుక్మిణిని ఓకే చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మురుగదాస్ ఎందుకు మృణాల్ ను కాదని ఈమెను తీసుకున్నారా? అని ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై దర్శకుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “మా సినిమాకు ప్రాక్టికల్ యువతిలా కనిపించే అమ్మాయి కావాలి. నేను రుక్మిణి నటించిన చాలా సినిమాలు చూశాను. ఆమె నటన, వ్యక్తిత్వం నేను రాసుకున్న పాత్రకు దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. అందుకే ఆమెను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాను” అని చెప్పారు. మొత్తంగా స్టార్ డైరెక్టర్ తో మృణాల్ సినిమా చేయబోతున్నట్లు వచ్చిన వార్తలు నిజం కాకపోవడంతో, ఆమె అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. ఈ సినిమాలో ఆమె నటించి ఉంటే బాగుండేది అనుకుంటున్నారు.
Very happy to have these amazing and talented people on board. Together, something special on your way🎉@Siva_Kartikeyan @rukminitweets@anirudhofficial @dhilipaction @SudeepElamon @sreekar_prasad #ArunVenjaramoodu@teamaimpr pic.twitter.com/WFYhi2DPAx
— A.R.Murugadoss (@ARMurugadoss) February 15, 2024
‘సప్త సాగరాలు దాటి’ రుక్మిణికి మంచి గుర్తింపు
ఇక ‘సప్త సాగరదాచే ఎల్లో’ (సప్త సాగరాలు దాటి) సినిమాతో రుక్మిణి వసంత్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా రెండు పార్టులలోనూ అందం, అభినయంతో ఆకట్టుకుంది. తమిళంలో స్టార్ హీరో విజయ్ సేతుపతి తదుపరి చిత్రంలో హీరోయిన్ గా ఓకే అయ్యింది. ఈ సినిమాలో ఆమె కోలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది. ఇప్పుడు SK23తో మరో క్రేజీ ఛాన్స్ దక్కించుకుంది. దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో రుక్మిణి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారే అవకాశం ఉందంటున్నారు సినీ అభిమానులు. రష్మికను కన్నడ ఇండస్ట్రీకి పరిచయం చేసిన రక్షిత్ శెట్టి సినిమాతోనే, ఈమె కూడా తెలుగులో పాపులర్ అయ్యింది. ఇక K23లో మోహన్ లాల్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.
అటు తమిళ స్టార్ దర్శకుడు మురుగదాస్ ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘గజిని’, ‘తుపాకీ’ లాంటి సినిమాలు కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. తెలుగులో చిరంజీవితో ‘స్టాలిన్’, మహేష్ బాబుతో ‘స్పైడర్’ లాంటి హిట్ సినిమాలు చేశారు. హిందీలో అమీర్ ఖాన్‌తో ‘గజిన్’ రీమేక్ చేశారు. కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇప్పుడు ‘KS23’తో మళ్లీ మెగా ఫోన్ పట్టారు.
Read Also: పుష్పరాజ్ లెవెల్ ఇంటర్నేషనల్, ‘పుష్ప-3’పై అల్లు అర్జున్ సాలిడ్ అప్ డేట్