అన్వేషించండి

Allu Arjun: పుష్పరాజ్ లెవెల్ ఇంటర్నేషనల్, ‘పుష్ప-3’పై అల్లు అర్జున్ సాలిడ్ అప్ డేట్

‘పుష్ప’ తో పోల్చితే ‘పుష్ప 2’ మరింత అద్భుతంగా ఉండబోతుందని అల్లు అర్జున్ వెల్లడించారు. తొలి భాగంలో పుష్పరాజ్ ప్రాంతీయ స్థాయిలో కనిపిస్తే, ఈ సినిమాలో ఆయన రేంజిలో ఇంటర్నేషనల్ లెవల్ లో ఉంటుందన్నారు.

Allu Arjun On Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పుష్ప 2’. శరవేగంగా నిర్మాణ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను, త్వరలో ప్రేక్షలకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఎర్రచందనం స్మగ్లర్ అయిన ‘పుష్ప’, పోలీసు అధికారి షెకావత్ మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో ‘పుష్ప’ సినిమా ఎండ్ అవుతోంది. ‘పుష్ప-2’లో వీరిద్దరి మధ్య ఘర్షణ మరింత ముదురుతుంది. ‘పుష్ప- ది రూల్’ మూవీ ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తోంది.

‘పుష్ప 2’లో మరింత పవర్ ఫుల్ రోల్- అల్లు అర్జున్

తాజాగా ‘పుష్ప 2’ సినిమా గురించి అల్లు అర్జున్ కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో పాల్గొన్నన ఆయన.. ఈ వేడుకలో ‘పుష్ప’ సినిమాను పదర్శించనున్నట్లు తెలిపారు.  విదేశీ ప్రేక్షకులు ‘పుష్ప’ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఉందన్నారు. భారతీయ సినిమాను వాళ్లు ఏ కోణంలో చూస్తారో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే  ఫిలిం ఫెస్టివల్ కు వచ్చినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఓ హాలీవుడ్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘పుష్ప’ సినిమాతో పోల్చితే ‘పుష్ప 2’లో తన షేడ్స్ చాలా భిన్నంగా ఉంటాయని చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలిపారు.  పుష్పరాజ్ స్కేల్, క్యారెక్టరైజేషన్, కాన్వాస్, ప్రెజెంటేషన్ పెద్ద రేంజిలో ఉంటుందన్నారు. ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్ ప్రాంతీయ స్థాయిలో తన కార్యకలాపాలు కొనసాగిస్తే, పార్ట్ 2 లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ఉండబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ గొడవ తీవ్రస్థాయికి వెళ్లనున్నట్లు చెప్పారు.

‘పుష్ప 3’పై సాలిడ్ అప్ డేట్

అటు ‘పుష్ప3’ అల్లు అర్జున్ సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాను ప్రాంచైజీగా చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. "పుష్ప 3ని కచ్చితంగా ఆశించవచ్చు. ఎందుకంటే, మేం ‘పుష్ప’ను ఓ ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నాం. సీక్వెల్స్ కోసం మా దగ్గర చక్కటి ఆలోచనలున్నాయి. ‘పుష్ప3’ ఆశించడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు” అని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో మరిన్ని పాన్ ఇండియన్ సినిమాలు వస్తాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆగష్టు 15న ‘పుష్ప 2’ విడుదల

‘పుష్ప 2’ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా ఫాహద్‌ ఫాజిల్ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు.  అనసూయ కీలక పాత్రలో కనిపించబోతోంది. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మిస్తున్న ‘పుష్ప 2’ మూవీ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు అల్లు అర్జున్‌ త్రివిక్రమ్‌తో పాటు సందీప్‌ రెడ్డి వంగాతో సినిమాలు చేసేందుకు ఓకే చెప్పారు. బోయపాటి శ్రీనుతో కూడా ఒక ప్రాజెక్ట్‌ చేయనున్నారని టాక్‌ వినిపిస్తోంది.

Read Also: ‘గామి’ టీజర్ వచ్చేసింది, అఘోరాగా అంచనాలు పెంచుతున్న విశ్వక్!

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget