Zayn Marie Khan : డెకాయిట్ బ్యూటీ ఫోటోస్ వైరల్ - బాలీవుడ్ To టాలీవుడ్... అసలెవరీ జైన్ మేరీ ఖాన్?
Dacoit Movie : బాలీవుడ్ హీరోయిన్ జైన్ మేరీ ఖాన్ పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగుతోంది. డెకాయిట్‌తో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అసలు ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ ఓసారి చూస్తే...

Actress Zayn Marie Khan Trending After Dacoit Trailer Launch Event : జైన్ మేరీ ఖాన్... అడివి శేష్ డెకాయిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న పేరు. ఈవెంట్‌లో బ్యూటిఫుల్ లుక్‌లో మెరిసిన ఈ బ్యూటీ ఎవరా? అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తూ... ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
అసలెవరీ జైన్ మేరీ ఖాన్?
జైన్ మేరీ ఖాన్ (31) ... బాలీవుడ్ దర్శక నిర్మాత మన్సూర్ ఖాన్ కుమార్తె. బాలీవుడ్ లెజెండ్ అమీర్ ఖాన్‌కు మేనకోడలు. బాలీవుడ్ నటులు ఇమ్రాన్ ఖాన్, జునైద్ ఖాన్ ఈమెకు కజిన్స్. ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన జైన్... డెకాయిట్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కపూర్ అండ్ సన్స్ (2016), సీక్రెట్ సూపర్ స్టార్ (2017) వంటి చిత్రాలకు జైన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఆ తర్వాత యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో ఆ దిశగా అడుగులు వేశారు.
ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ 2020లో నిర్మించిన 'మిసెస్ సీరియల్ కిల్లర్' మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మోనికా ఓ మై డార్లింగ్ (2020) మూవీలోనూ నటించి మెప్పించారు. ఫీల్స్ లైక్ ఇష్క్, ఆర్యన్ అండ్ మీరా, మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్‌ల్లో నటించారు. ఆకాష్ మొహిమన్‌ను 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగులో డెకాయిట్ మూవీలో కీలక పాత్ర పోషించారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు.
Also Read : గ్రామంలో చిన్నారుల హత్యలు - బంగ్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటనలు... ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్ 'గ్రానీ'
ఈ మూవీకి షానిల్ డియో దర్శకత్వం వహించగా... అడివి శేష్, మృణాల్‌లతో పాటు ప్రకాష్ రాజ్, జైన్ మేరీ ఖాన్, సునీల్, అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ సంస్థలపై కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు























