అన్వేషించండి

Mrunal Thakur : సరస్వతి రోల్ వెరీ ఛాలెంజింగ్ - అంబులెన్స్‌తో రిస్కీ సీన్స్... మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఇంటర్వ్యూ

Mrunal Thakur Reaction : డెకాయిట్‌తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ మూవీలో సరస్వతి రోల్ వెరీ ఛాలెంజింగ్ అని తెలిపారు.

Mrunal Thakur Reaction On Adivi Sesh's Dacoit Movie : సీతారామం, హాయ్ నాన్న మూవీస్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తాజాగా, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ డెకాయిట్‌లో అడివి శేష్‌కు జోడీగా నటించారు. ఈ నెల 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ విశేషాలను మృణాల్ షేర్ చేసుకున్నారు.

ఛాలెంజింగ్ రోల్

డెకాయిట్‌లో సరస్వతి క్యారెక్టర్ చాలా డిఫికల్ట్ అని... ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయడం తనకు ఆనందాన్నిచ్చిందని చెప్పారు మృణాల్. 'ఈ క్యారెక్టర్‌ను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. నా కెరీర్‌లోనే ఇది చాలా డిఫరెంట్ రోల్. ఇప్పటివరకు నేను చేయని కొత్త జానర్ ఇది. సినిమాలో కొన్ని స్టంట్స్ కూడా చేశాను. 

చేజింగ్ సన్నివేశాలు, డ్రైవింగ్ సీన్స్ చాలా ఎంజాయ్ చేశాను. తెలుగు ఆడియన్స్ నన్ను ఓ తెలుగమ్మాయిలా అంగీకరించారు. వారి ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను. మంచి పాత్రలు చేస్తాననే నమ్మకం వారికి ఉంది. ఈ రోల్ అందర్నీ ఆకట్టుకుంటుంది. నా సినిమాను ఏ భాషలో చూసినా ఆడియన్స్ ఆ ఎమోషన్స్ ఆస్వాదించాలనేదే నా తపన. అది దృష్టిలో ఉంచుకునే స్టోరీస్ ఎంపిక చేసుకుంటా.' అని అన్నారు.

Also Read : సమ్మర్ వీక్... కూల్ ఎంటర్టైన్మెంట్ - ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో మూవీస్ లిస్ట్

అడివి శేష్ కెరీ‌ర్‌లోనే...

సినిమాలో హీరో అడివి శేష్ అద్భుతంగా నటించారని... ఆయన కెరీర్‌లోనే బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తుందని మృణాల్ తెలిపారు. 'ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. సరస్వతి, హరి ఎందుకు డెకాయిట్స్‌గా మారారనేది చాలా ఇంట్రెస్టింగ్ అంశం. అది మీరు బిగ్ స్క్రీన్ మీద చూడాలి. పాటలన్నీ సర్ప్రైజ్ చేస్తాయి. 

శేష్‌ది ఇప్పటివరకూ చేయని కొత్త క్యారెక్టర్. శేష్, ప్రకాష్ రాజ్ గారితో కలిసి పనిచేయడం మంచి అనుభవం. ఈ సినిమా 2 భాషల్లో షూట్ చేయడం నాకు మరింత ఛాలెంజింగ్‌గా అనిపించింది. తెలుగు డైలాగ్స్ నేర్చుకోవడం మంచి అనుభవం. ప్రొడ్యూసర్ సుప్రియ గారు సెట్‌లో ఏ విషయంలోనూ రాజీ పడరు. ఓసారి నాకు ఫీవర్ వస్తే రెండు రోజులు షూటింగ్ హోల్ట్ చేశారు.' అని అన్నారు.

అంబులెన్స్ డ్రైవ్ చేశా

'నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో కార్ డ్రైవ్ చేసిన మొదటి అమ్మాయి నేనే. యాక్షన్ సినిమాలు నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో అలాంటి యాక్షన్ చేసే అవకాశం దొరికింది. ఈ సినిమాకు వర్క్‌షాప్ కూడా చేశాం. ఎక్కువగా అవుట్‌ డోర్‌లో షూట్ చేశాం. ముఖ్యంగా రోడ్లపై డ్రైవింగ్ సీక్వెన్స్‌లు చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. ఒక అంబులెన్స్ డ్రైవ్ చేయాల్సి వచ్చింది. దానికి హ్యాండ్ బ్రేక్ ఉండదు. చాలా రిస్కీ సన్నివేశాలు కూడా చేశాం.' అని చెప్పారు మృణాల్.

షానిల్ డియో దర్శకత్వం వహించిన డెకాయిట్‌లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. ప్రకాష్ రాజ్, జైన్ మేరీ ఖాన్, అనురాగ్ కశ్యప్, సునీల్, అతుల్ కులకర్ణి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget