అన్వేషించండి

Salaar postpone effect: 'సలార్' డేట్‌పై ఖర్చీప్స్ వేస్తున్న క్రేజీ సినిమాలు!

'సలార్' వాయిదా పడుతుందని క్లారిటీ రాగానే, సెప్టెంబర్ 28 కోసం పోటీ ఎక్కువైంది. ఇప్పటికే కొన్ని సినిమాలు ఆ డేట్ పై ఖర్చీఫ్స్ వేయగా, మరికొన్ని చిత్రాలు విడుదల తేదీని ప్రకటించడానికి రెడీ అవుతున్నాయి. 

రెబల్ స్టార్ ప్రభాస్, KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషనల్ లో తెరకెక్కుతున్న 'సలార్' పార్ట్-1 చిత్రాన్ని సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. 5 రోజుల లాంగ్ వీకెండ్ కావడంతో ఈసారి బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని డార్లింగ్ ఫ్యాన్స్ భావించారు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు సలార్ రిలీజ్ డేట్ మారుతోంది. నిర్మాతలు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కానీ, సినిమా విడుదల వాయిదాపై ఇండస్ట్రీ వర్గాల్లో అందరికీ క్లారిటీ వచ్చేసింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఒక్కసారిగా విడుదల తేదీలన్నీ తారుమారు అవుతున్నాయి. 

'సలార్' వాయిదా పడుతుందని తెలియగానే, సెప్టెంబర్ 28 డేట్ కోసం టాలీవుడ్ లో తీవ్ర పోటీ నెలకొంది. అంతమంచి తేదీని వదులుకోవడం ఎందుకని ప్రతీ మేకర్ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆల్రెడీ కొందరు సలార్ డేట్ పై ఖర్చీప్స్ వేసుకొని కూర్చున్నారు. మరికొందరు అదే వీక్ లో రావడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఇంకొందరు దసరా లాంటి టఫ్ కాంపిటీషన్ ను వదిలేసి, అదే తేదీకి ప్రీ పోన్ చేసుకోవాలని చూస్తున్నారని సమాచారం అందుతోంది. 

ఇప్పటికే కొన్ని సినిమాలు 'సెప్టెంబర్ 28 విడుదల' అంటూ హడావుడి మొదలెట్టేసాయి. ‘రాజా వారు రాణి గారు’, ‘SR కళ్యాణ మండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం తన లేటెస్ట్ మూవీ ‘రూల్స్ రంజన్’ ని అదే తేదీకి రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. ఏఎం రత్నం సమర్పణలో రత్నం కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. 

అలానే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న 'మ్యాడ్' (MAD) మూవీని సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ తో నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక కూడా నిర్మాతగా సినీ రంగంలో ఎంట్రీ ఇస్తోంది. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read: ఓవర్సీస్ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన మిస్టర్ పోలిశెట్టి!

సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న 'పెదకాపు-1' సినిమా కూడా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా రోజులుగా మంచి డేట్ కోసం చూస్తున్న మేకర్స్.. సెప్టెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అడ్డాల కూడా కీలక పాత్ర పోషించడం విశేషం. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్ పై 'అఖండ' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

ఇప్పుడు లేటెస్టుగా 'స్కంద' సినిమా కూడా ఈ రిలీజుల జాబితాలో చేరిపోయింది. ఉస్తాద్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ముందుగా సెప్టెంబర్ 15న విడుదల చేయాలని భావించారు. దీనికి తగ్గట్టుగానే సిల్వర్ స్క్రీన్ నిర్మాతలు దూకుడుగా ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు 'సలార్' డేట్ మారడంతో సెప్టెంబర్ 28వ తేదీకి తమ సినిమాని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పు వెనుక నిర్మాత దిల్ రాజు హస్తం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. 

సెప్టెంబర్ 15న ప్లాన్ చేసిన 'స్కంద', 'చంద్రముఖి 2' సినిమాలను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ బ్లాక్ చేసుకున్న డేట్ ఫ్రీ అవ్వడంతో, ఒక సినిమాని సలార్ డేట్ కు పంపాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగానే రామ్ - బోయపాటిల చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై రేపో ఎల్లుండో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

ఏదేమైనా ఒక్క 'సలార్' డేట్ మారడంతో చాలా సినిమాల విడుదలలు మారిపోతున్నాయి. ఇప్పటికే అభిషేక్ అగర్వాల్ నిర్మించిన 'ది వ్యాక్సిన్ వార్' అనే సినిమా బరిలో ఉండనే ఉంది. ఇప్పుడు కొత్తగా అదే వారంలో నాలుగు చిత్రాలు రాబోతున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా సెప్టెంబర్ 28న రావాలని చూస్తున్నాయి. మరి ఫైనల్ గా 'సలార్' తేదీకి ఏయే సినిమాలు రిలీజ్ అవుతాయో వేచి చూడాలి.

Also Read: 'పుష్ప' తరహాలో 2 పార్ట్‌లు‌గా 'హరి హర వీరమల్లు'? రిలీజ్ డేట్‌పై నిర్మాత క్లారిటీ!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget