అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ అయిన 'ఇంటింటి రామాయణం'
రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో ఆహా స్టూడియోస్ నిర్మించిన 'ఇంటింటి రామాయణం' సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతోంది.
రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఇంటింటి రామాయణం'. సీనియర్ నటుడు నరేష్ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించగా.. బిత్తిరి సత్తి, గంగవ్వ ఇతర పాత్రలో నటించారు. కంప్లీట్ తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో ఆహా స్టూడియోస్ వారు రూపొందించిన ఈ సినిమా జూన్ 9న థియేటర్స్ లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది. మారుతీ టాకీస్, సితార నాగ వంశీ సమర్పణలో వెంకట్ ఉప్పుకూరి, గోపీచంద్ ఇన్నమూరి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని సురేష్ నారెడ్ల కరెక్ట్ చేశారు. నిజానికి ఈ సినిమాని ముందుగా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు సడన్ గా ట్రైలర్ రిలీజ్ చేసి థియేటర్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ ట్రైలర్ను డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ లాంచ్ చేశారు. దీంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక అందుకు తగ్గట్టుగానే థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఇప్పుడు నేరుగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఈ క్రమంలోనే మేకర్స్ తాజాగా ఓటీటీ రిలీజ్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ మేరకు జూన్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ ఆహా లో 'ఇంటింటి రామాయణం' మూవీ స్ట్రీమింగ్ కానుంది. నిజానికి ఓ సినిమా థియేటర్లో విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీ ఎంట్రీ ఇవ్వాలి. కానీ ఇంటింటి రామాయణం సినిమా మాత్రం థియేటర్స్ లో విడుదలై 15 రోజులు కాకముందే ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తుండడం గమనార్హంగా మారింది. నిజానికి ఆహా ఓటిటి సంస్థ వాళ్లే ఈ సినిమాని రూపొందించారు కనుకే ఇంత తొందరగా ఓటీటీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది కాబోలు.
ఇక సినిమా కథ విషయానికొస్తే.. తెలంగాణలోని జమ్మికుంట అనే గ్రామంలో జరిగిన కథగా ఈ మూవీ ఉంటుంది. ఇంట్లో జరిగిన ఓ బంగారం చోరీ ఆ ఇంట్లో వాళ్ళ మధ్య ఎలా చిచ్చు పెట్టిందో ఈ సినిమాలో సరదాగా చూపించే ప్రయత్నం చేశారు. అలా అని కేవలం కామెడీ కే ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సందర్భం వచ్చినప్పుడల్లా ఎమోషన్స్ తో ఆకట్టుకున్నారు. అప్పటివరకు ఎంతో అన్యోన్యంగా ఆప్యాయంగా కలిసి ఉన్న ఆ కుటుంబం వారి బంధువులు, స్నేహితులు ఈ చోరీ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? అనేది ఈ ఇంటింటి రామాయణం కథ. ఒక్క ముక్కులో చెప్పాలంటే గ్రామాల్లో ప్రతి ఇంట్లో జరిగే కథే ఈ సినిమా. సినిమా అంతా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోనే ఉంటుంది. అందుకే తెలంగాణ యాస, సంస్కృతిని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఆ కోవలోనే 'ఇంటింటి రామాయణం' కూడా ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక థియేటర్స్ లో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.
ఇంటి దొంగను ఈశ్వరుడు అయిన పట్టలేడు... #IntintiRamayanamOnAHA మీరు చూడకుండా ఉండలేరు 😉
— ahavideoin (@ahavideoIN) June 15, 2023
Premieres June 23 ✌🏻@SitharaEnts @DirectorMaruthi @vamsi84 @IVYProductions9 @ItsActorNaresh @eyrahul @Sureshflms @Venkatupputuri @innamuri8888 #NavyaSwamy @GangavvaMilkuri #AnjiMama… pic.twitter.com/6SOA6LUi3j
Also Read: ఏఏఏ సినిమాస్ ను ప్రారంభించిన అల్లు అర్జున్ - ఈ మల్టీప్లెక్స్ ప్రత్యేకతలేంటో తెలుసా?