War 2 Box Office Collection Day 2: నెగిటివ్ టాక్‌తో రెండో రోజు ఎక్కువ కలెక్ట్ చేసిన ఎన్టీఆర్... వంద కోట్ల క్లబ్బులో 'వార్ 2'
War 2 Movie Day 2 Collection: ఓపెనింగ్ డే రికార్డులు బ్రేక్ చేయడంలో 'వార్ 2' ఫెయిల్ అయ్యింది. అయితే రెండో రోజు నెగిటివ్ టాక్‌తో మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం విశేషం.

మాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటించిన లేటెస్ట్ సినిమా 'వార్ 2' (War 2 Collection Day 2) ఓపెనింగ్ డే కలెక్షన్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్. వరల్డ్ వైడ్ 85 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్. అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయిన, విపరీతమైన నెగిటివ్ టాక్ ఎదుర్కొంటున్న 'వార్ 2' రెండో రోజు మాత్రం ఇండియాలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది.
మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ
NTR's War 2 Box Office Collection: 'వార్ 2'కు ఇండియాలో రిలీజ్ రోజు రూ. 51.5 కోట్లు వచ్చాయి. హిందీ వెర్షన్ రూ. 29 కోట్లు, తెలుగు వెర్షన్ రూ. 22 కోట్లు కలెక్ట్ చేయడం వల్ల ఆ మాత్రం వచ్చాయి. రెండో రోజు రూ. 56.50 కోట్లు కలెక్ట్ చేసినట్లు ఎర్లీ ఎస్టిమేషన్. అంటే... ఆగస్టు 14 కంటే ఆగస్టు 15న ఐదు కోట్లు ఎక్కువ.
Also Read: కూలీ Vs వార్ 2... ఓపెనింగ్ డే రజనీ టాప్... ఎన్టీఆర్ మూవీ కలెక్షన్స్ ఎంత - తేడా తెలిస్తే షాక్!
'వార్ 2'కు వచ్చిన రివ్యూలు, సోషల్ మీడియాలో జరిగిన నెగిటివిటీ చూస్తే రెండో రోజు కలెక్షన్స్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే అంచనాలు తల్లకిందులు చేస్తూ మొదటి రోజు కంటే రెండో రోజు కాస్త ఎక్కువ వసూళ్లు రాబట్టింది. దాంతో ఇండియాలో ఈ సినిమా వంద కోట్ల నెట్ కలెక్షన్ మార్క్ దాటింది.
ఓవర్సీస్ మార్కెట్టులో దారుణమైన కలెక్షన్!
War 2 Overseas Collection Day 1: ఎన్టీఆర్ రీసెంట్ పాన్ ఇండియా సినిమాలతో కంపేర్ చేస్తే ఓవర్సీస్ మార్కెట్టులో 'వార్ 2'కు దారుణమైన కలెక్షన్ వచ్చింది. ఓపెనింగ్ డే విదేశాల్లో ఈ మూవీకి జస్ట్ 18 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. హృతిక్ రోషన్ స్టార్ పవర్ ఈ మూవీకి అసలు ఏమాత్రం యాడ్ కాలేదు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన ఈ సినిమా వీకెండ్ వరకు ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
Also Read: కూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?





















