అన్వేషించండి

Vivek Agnihotri: అతడికి ఆ అర్హతే లేదు, రాహుల్ గాంధీపై వివేక్ అగ్నిహోత్రి సంచలన ట్వీట్

రాహుల్ గాంధీపై బాలీవుడ్ దర్శకుడు సంచలన ట్వీట్ చేశారు. పార్లమెంట్ నుంచి అతడిని డిస్ క్వాలిఫై చేయడంపై వ్యంగ్య బాణాలు విసిరారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కాంగ్రెస్ టాప్ లీడర్ రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడిని పార్లమెంట్ సభ్యుడి పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేయడంపై వ్యంగ్యంగా స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఇప్పుడు తెలుకుందాం..

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తాజాగా రాహుల్ గాంధీపై సూరత్ కోర్టు సెన్సేషనల్ తీర్పు వెల్లడించింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ మోడి ఇంటిపేరు ఉన్న వాళ్లందరూ దొంగలు అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం రాహుల్ కు రెండు సంవత్సరాల పాటు శిక్షవిధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయనను పార్లమెంట్ సభ్యుడి పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ అంశంపై వివేక్ అగ్నిహోత్రి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.  

రాహుల్ గాంధీపై సంచలన ట్వీట్

నిజానికి రాహుల్ గాంధీ రాజకీయాలకు అర్హత లేని నాయకుడని వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యానించారు. అయితే, ఈసారి అధికారికంగా రుజువైందంటూ సంచలన కామెంట్స్ చేశారు. “రాజకీయాల్లో ఎల్లప్పుడూ అర్హత లేని వ్యక్తి రాహుల్ గాంధీ. అయితే, ప్రస్తుతం అది అధికారికంగా రుజువైంది” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

ఇందిరాగాంధీపై అనర్హత వేటు అంశాన్ని గుర్తు చేసిన వివేక్

ఈ సందర్భంగా ఇందిరా గాంధీ ప్రస్తావన కూడా ఆయన తీసుకొచ్చారు. గతంలో ఇందిరాగాంధీపై కూడా అనర్హత వేటు పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఆమె నిజాయితీ కలిగిన నాయకురాలు కాబట్టి మళ్లీ పుంజుకుందన్నారు. “ఇందిరాగాంధీపైన అనర్హత వేటు పడిన సమయంలో కూడా కాంగ్రెస్‌ వాదులు దుమ్మెత్తిపోశారు. కానీ, ఆమె నిజమైన నాయకురాలు కాబట్టి తిరిగి పుంజుకున్నారు. మాస్ బేస్ ఉన్న నాయకుడు ఎవరూ లేకపోవడంతో కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడాలి” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పటిష్టనాయకత్వం లేక నానా ఇబ్బందులు పడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ తిరిగి పుంజుకునే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదన్నారు.  ఇందిరా గాంధీ కాశ్మీర్‌ను కాపాడి ఉంటే, తాను ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా తీసి ఉండేవాడిని కాదని ఆయన వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివేక్ కామెంట్స్

ప్రస్తుతం వివేక్ ట్వీట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుంటే, మరికొంత మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి వివేక్, తరచుగా లెఫ్ట్ భావజాలంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా తర్వాత తన వ్యాఖ్యలకు మరింత పదును పెట్టారు. దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై తీవ్ర స్థాయిలో ఆయన స్పందిస్తున్నారు.

Read Also: సిగ్గు, శరంలేని జాతి - విశాఖ జీ20 సదస్సులో తమిళ బ్యానర్లపై నటి సంచలన వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Emmanuel: హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్... శ్రీ సత్యతో రొమాన్స్... లవ్ సాంగ్ 'ఇద్దరి గుండెలపైన' లిరిక్స్
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్... శ్రీ సత్యతో రొమాన్స్... లవ్ సాంగ్ 'ఇద్దరి గుండెలపైన' లిరిక్స్
Friday OTT Movies : శుక్రవారం ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్ - ఓటీటీల్లో ఈ మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్ - ఓటీటీల్లో ఈ మూవీస్ డోంట్ మిస్
Ruku Ruku Rukmini Song Lyrics: 'రుక్కు రుక్కు' సాంగ్ లిరిక్స్... నితిన్ 'అలియాస్ రుక్మిణి'లో మెలోడీ - పూర్ణాచారి ఏం రాశారంటే?
'రుక్కు రుక్కు' సాంగ్ లిరిక్స్... నితిన్ 'అలియాస్ రుక్మిణి'లో మెలోడీ - పూర్ణాచారి ఏం రాశారంటే?
Gondhal Telugu Trailer Review : ఒక్క రాత్రిలో నవ వధువు ఊహించని వ్యూహం? - తెలుగులో వచ్చేస్తోన్న ఆస్కార్ ఎంట్రీ 'గోంధళ్'... ట్రైలర్ చూశారా?
ఒక్క రాత్రిలో నవ వధువు ఊహించని వ్యూహం? - తెలుగులో వచ్చేస్తోన్న ఆస్కార్ ఎంట్రీ 'గోంధళ్'... ట్రైలర్ చూశారా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget