అన్వేషించండి

Gangs of Godavari: బ్యాడ్‌న్యూస్‌ చెప్పిన విశ్వక్‌ సేన్‌ - మళ్లీ వాయిదా పడిన 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి', కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే

Gangs of Godavari Movie: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఫ్యాన్స్‌కి మళ్లీ నిరాశే ఎదురైంది. అతడు నటించిన లేటెస్ట్‌ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మళ్లీ వాయిదా పడింది.

Gangs of Godavari Movie Again Postponed: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఫ్యాన్స్‌కి మళ్లీ నిరాశే ఎదురైంది. అతడు నటించిన లేటెస్ట్‌ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మళ్లీ వాయిదా పడింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. ఇక ఎట్టకేలకు మే 17న రిలీజ్‌కు రెడీ అయ్యిందనుకుంటే ఇప్పుడు ఈ సినిమా మళ్లీ పోస్ట్‌పోన్‌ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో విశ్వక్‌ సేన్‌ వెల్లడించాడు. ఈ మేరకు అతడు తన ఎక్స్‌లో పోస్ట్‌ షేర్‌ చేశాడు. మన గస్తీ గ్యాంగ్‌స్టర్‌ లంకల రత్న మరింత ఆలస్యంగా వస్తున్నాడు.

ఐదేళ్ల క్రితం 'ఫలక్‌నుమా దాస్' వచ్చిన మే 31న మరోసారి హిస్టరీ రిపీట్‌ అవుతుంది. గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి మే 17 నుంచి మే 31 వాయిదా పడింది" తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. దీంతో ఈ మాస్‌ కా దాస్‌ ఫ్యాన్స్‌ మళ్లీ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాను గతేడాది డిసెంబర్‌ 8న రిలీజ్‌ చేసేందుకు మూవీ టీం ప్లాన్‌ చేసింది. కానీ, అనుకోని కారణాల వల్ల మూవీ వాయిదా పడి మార్చి 8న డేట్‌ ఫిక్స్‌ చేసుకుంది. అదే తేదీ విశ్వక్‌ సేన్‌ గామి మూవీ, గోపిచంద్‌ భీమా రెండు భారీ సినిమాలు ఉండటంతో వెనక్కి తగ్గింది. ఇక ఏప్రిల్‌లో ఈ మూవీ రిలీజ్‌ అన్నారు.

కానీ అదీ కుదరలేదు. ఇక లోక్‌సభ ఎన్నికల అనంతరం మే 17న సినిమాను రిలీజ్‌ చేయాలని ఫిక్స్‌ అయిన మూవీ టీం అదే తేదీన వస్తున్నామంటూ ప్రకటన ఇచ్చింది. మే 17న గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి ఏ అడ్డంకు లేకుండ థియేటర్లోకి వచ్చేస్తుందని ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. ఇక సినిమాను చూసేందుకు ప్రేక్షకులంతా సిద్ధమవుతున్న తరుణంలో మరోసారి మూవీ వాయిదా పడిందంటూ విశ్వక్‌ సేన్‌ ప్రకటన ఇచ్చి షాకిచ్చాడు. ఈ మూవీ మరోసారి మే 31కి వాయిదా పడిందంటూ తన సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. అయితే 'ఫలక్‌నుమా దాస్' సెంటిమెంట్‌ని ఫాలో అవుతూ ఈ మూవీని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

కాగా విశ్వక్‌ సేన్‌ నటించిన 'ఫలక్‌నుమా దాస్' ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీతోనే విశ్వక్‌ ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయాడు. అతడికి మాస్‌ కా దాస్‌ అనే మాస్‌ ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది సినిమానే. ఇందులో తెలంగాణ యాసలో మాట్లాడి ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఐదేళ్ల క్రితం మే 31న వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ని కంటిన్యూ చేస్తూ 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' వాయిదా వేసి మరి అదే డేట్‌కి రిలీజ్‌ చేస్తున్నారు. మరి 'ఫలక్‌నుమా దాస్'లా గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి హిస్టరి రిపీట్‌ చేస్తుందో లేదో చూడాలి. చల్‌ మోహన్‌రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో అతడి సరసన 'డీజే టిల్లు' ఫేం నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget