Karthikeya 2 Trailer : ఎప్పుడూ విజయం కంటెంట్‌దే - నిఖిల్ 'కార్తికేయ 2'కు విష్ణు మంచు సపోర్ట్
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'కార్తికేయ 2' సినిమా ఆగస్టు రెండో వారంలో విడుదలకు సిద్ధమైంది. నిఖిల్ అండ్ ఈ సినిమాకు సపోర్ట్ చేస్తూ విష్ణు మంచు ట్వీట్ చేశారు.
'కార్తికేయ 2' (Karthikeya 2 Movie) విడుదల ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడింది. దీనికి కారణం సినిమా యూనిట్ సభ్యులు కాదు. ఇండస్ట్రీలో కొందరు! ఇతర సినిమాలు ఉండటంతో థియేటర్లు ఇవ్వమని చెప్పడంతో వాయిదా వేసుకోక తప్పలేదు. తమ సినిమాకు థియేటర్లు ఇవ్వమని చెప్పినప్పుడు బాధ పడ్డానని, కన్నీళ్లు పెట్టుకున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిఖిల్ చెప్పారు. బ్యాక్‌గ్రౌండ్ లేదు కాబట్టే ఈ విధంగా జరిగిందన్నారు. ప్రతి వారం ఏదో ఒక సినిమాతో పోటీ పడక తప్పదని, అందుకే ఆగస్టు 12న వస్తున్నామని ఆయన అన్నారు.
నిఖిల్ 'కార్తికేయ 2'కు విష్ణు మంచు సపోర్ట్
నిఖిల్ 'కార్తికేయ 2'కు మద్దతుగా ప్రముఖ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు ట్వీట్ చేశారు. ఎల్లప్పుడూ కంటెంట్‌దే విజయం అని, కంటెంట్ విజయం సాధిస్తుందని, అందరూ ఈ విషయాన్ని అంగీకరిస్తారని విష్ణు పేర్కొన్నారు. నిఖిల్ సిద్ధార్థ్‌కు అండగా తాను ఎప్పుడూ ఉంటానని, 'కార్తికేయ 2' కోసం ఎదురు చూస్తున్నాని ఆయన చెప్పారు.
My brother @actor_Nikhil I am always there. Stay strong. As everyone agrees, Content always wins. Looking forward for #Karthikeya2 ✊🏽
— Vishnu Manchu (@iVishnuManchu) August 2, 2022
ఆగస్టు 6న 'కార్తికేయ 2' ట్రైలర్
ఆగస్టు రెండో వారంలో 'కార్తికేయ 2' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం. అంతకు ముందు... తొలి వారంలో ట్రైలర్ విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 6న 'కార్తికేయ 2' ట్రైలర్ విడుదల కానుంది.
'కార్తికేయ 2'ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.
Also Read : స్టార్స్ సెక్స్ లైఫ్ గురించి అడిగితే మీ అమ్మ ఏమీ అనుకోరా? - కరణ్ జోహార్‌ను ఆటాడుకున్న ఆమిర్ ఖాన్
ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: కాల భైరవ.
Also Read : బడా నిర్మాతలపై ఐటీ రైడ్స్ - కోలీవుడ్‌లో ఏం జరుగుతోంది? సూర్య, కార్తీపై ఎఫెక్ట్?
View this post on Instagram