Kannappa OTT Release: 'కన్నప్ప' ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే? - ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన విష్ణు మంచు
Vishnu Manchu: 'కన్నప్ప' ఓటీటీ రిలీజ్‌పై హీరో విష్ణు మంచు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. థియేటర్లలో రిలీజైన 10 వారాలకు ముందు తన సినిమా ఓటీటీలోకి రాదంటూ స్పష్టం చేశారు.

Manchu Vishnu About Kannappa OTT Release: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ కాగా.. ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా... ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు
'కన్నప్ప' థియేటర్లలో రిలీజైన 10 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని విష్ణు క్లారిటీ ఇచ్చారు. ''కన్నప్ప' మూవీ థియేటర్లలో రిలీజైన 10 వారాలకు ముందు ఓటీటీలోకి రాదు. ఈ మేరకు డీల్ కుదుర్చుకున్నా. నాకు రిలీజ్ ప్రెషర్ లేదు. ప్రేక్షకులకు ఓ మంచి మూవీ అందించాలనేదే నా లక్ష్యం. దేవుడి దయ వల్ల ఓటీటీ రిలీజ్ ప్రెజర్ లేదు.' అంటూ స్పష్టం చేశారు.
Also Read: అసలు ఎవరీ ముకేష్ కుమార్ సింగ్ - బాలీవుడ్ To టాలీవుడ్.. 'కన్నప్ప' డైరెక్టర్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
'కన్నప్ప' ఓటీటీపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. ఇంతకు ముందు ఇంటర్వ్యూల్లో మూవీని ఓటీటీల్లో రిలీజ్ చేయనని విష్ణు చెప్పారు. కన్నప్ప ఓటీటీ కోసం ఓ సంస్థ వద్దకు వెళ్తే వారు చెప్పిన ఫిగర్ తనకు నచ్చలేదని చెప్పారు. 'ఓటీటీ డీల్ కోసం ఓ సంస్థ వద్దకు వెళ్లి చాలా పెద్ద నెంబర్ అడిగితే వాళ్లు చెప్పిన ఫిగర్ నాకు నచ్చలేదు. సినిమా హిట్ అయిన తర్వాత అమ్మితే ఎంత ఇస్తారని అడిగితే వాళ్లు చెప్పిన ఫిగర్ నాకు చాలా నచ్చింది. చెక్ రెడీ చేసి పెట్టుకోండి రిలీజ్ అయ్యాక వస్తానని చెప్పాను. నేను పెట్టిన బడ్జెట్ నాకు థియేట్రికల్ రన్‌లోనే వస్తుందనే నమ్మకం నాకు ఉంది.' అంటూ గతంలో చెప్పారు విష్ణు.
అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్
ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రెస్పాన్స్ అదిరిపోయిందంటూ విష్ణు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 1,15,000 టికెట్స్ అమ్ముడుపోయినట్లు చెప్పారు. ఈ జనరేషన్ ఆడియన్స్‌కు బెస్ట్ మూవీ అందించాలనేదే నా ఉద్దేశమని అన్నారు. ఏపీలో టికెట్ ధరలు పెరిగాయని.. తెలంగాణలో టికెట్స్ ధరల పెంపు లేదని వెల్లడించారు. ఏ రోజైతే థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు తగ్గుతాయో ఆ రోజు మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరలు పెంచడం గురించి ఆలోచిస్తానన్నారు.
పవన్‌కు మూవీ చూపిస్తా
'కన్నప్ప' రిలీజ్ అయిన వెంటనే టైం తీసుకుని వ్యక్తిగతంగా కలిసి పవన్ కల్యాణ్‌కు సినిమా చూపిస్తానని విష్ణు తెలిపారు. 'మనకు తెలిసిన పవన్ వేరు. ఈ రోజు ఆయనపై రాష్ట్రం మొత్తం బాధ్యత ఉంది. తప్పుకుండా ఆయన టైం తీసుకుని మూవీ చూపించాలి. నటుడిగా ఆయన నాకు సీనియర్. ఆయన ప్రశంసలు వస్తాయా? రావా? అనేది ఆసక్తిగా ఎదురూచూస్తున్నా.' అని చెప్పారు.
Vishnu Reaction On Notice: సినిమా రివ్యూలు రాసే వారు, ట్రోలర్స్‌కు 'కన్నప్ప' టీం సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంపైనా విష్ణు రియాక్ట్ అయ్యారు. 'సినిమాను బతికించాలనేదే నా ఉద్దేశం. నార్త్‌లో రివ్యూవర్స్ మూవీ చూసి నన్ను ప్రేమగా హత్తుకున్నారు. సినిమా గురించి చెప్పాలనే ఉద్దేశంతో ముందే రివ్యూలు ఇచ్చేశారు. ఇదే అదనుగా కొంతమంది సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టారు. వారిని దృష్టిలో ఉంచుకునే ఆ పోస్ట్ పెట్టాం.' అంటూ క్లారిటీ ఇచ్చారు.





















