Laththi Movie Latest Release Date: 'లాఠీ'ని వెనక్కి తీసుకువెళ్లిన విశాల్ గాయాలు, వీఎఫ్ఎక్స్ వర్క్
Laththi Movie Release Postponed: విశాల్ కథానాయకుడిగా నటించిన 'లాఠీ' విడుదల వాయిదా పడింది. ఈ సినిమా ఆగస్టులో రావడం లేదు. మరి, థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే...
యాక్షన్ హీరో విశాల్ (Vishal) కథానాయకుడిగా ఎ. వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా 'లాఠీ' (Laththi Movie). హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. 'లాఠీ'తో సమాజంలో ఎటువంటి మార్పులకు విశాల్ నాంది పలికారన్నది సినిమాలో ఆసక్తికరమైన అంశం.
'లాఠీ' కోసం ఫైట్స్ తీస్తున్నప్పుడు విశాల్‌కు గాయాలు అయ్యాయి. అయినా సరే విశాల్ షూటింగ్ చేశారు. ఫైట్ సీక్వెన్స్‌ల కోసం కష్టపడ్డారు. సినిమాలో 45 నిమిషాల ఫైట్ సీక్వెన్స్ హైలైట్ అవుతుందట. అయితే... భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా విడుదల వాయిదా వేయక తప్పలేదు. తొలుత ఆగస్టు 12న సినిమాను విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 15కి వాయిదా వేశారు.
Also Read : కమల్ హాసన్‌కు, నాగార్జునకు పోలిక ఏంటి?
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న (Laththi Latest Release Date) సినిమాను విడుదల చేయనున్నారు. అన్ని భాషల్లో ఒకే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విశాల్ సరసన సునైనా కథానాయిక.
Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు
View this post on Instagram
View this post on Instagram