News
News
X

Kamal Haasan - Nagarjuna: కమల్ హాసన్‌కు, నాగార్జునకు పోలిక ఏంటి?

లోకనాయకుడు కమల్ హాసన్, కింగ్ అక్కినేని నాగార్జున సినిమాల మధ్య కంపేరిజన్స్ వస్తాయా? అసలు, వీళ్ళిద్దరి సినిమాలకు సంబంధం ఏమిటి?

FOLLOW US: 

లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan), కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మధ్య కంపేరిజన్స్ వస్తాయా? వాళ్ళిద్దరి సినిమాల మధ్య పోలికలు వస్తాయా? ఏమో... రావచ్చు, రాకపోవచ్చు. కానీ, ప్రస్తుతానికి అయితే ఇద్దరి సినిమాల మధ్య కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. నాగార్జున సినిమా విడుదలైతే తప్ప... కామన్ పాయింట్స్‌లో ఎన్ని కనెక్ట్ అవుతానేది చెప్పలేం!

'విక్రమ్' (Vikram Movie)తో కమల్ హాసన్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశారు. థియేటర్లలో, బాక్సాఫీస్ బరిలో దుమ్ము దులిపేసిన ఈ సినిమా... ఇప్పుడు ఓటీటీ వీక్షకులను సైతం ఆకట్టుకుంటోంది. 'విక్రమ్'కు, కింగ్ నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' (The Ghost Movie) సినిమాకు మధ్య కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దామా?

ఫస్ట్ అండ్ ఫస్ట్... పేర్లు!
'ది ఘోస్ట్' సినిమాలో హీరో నాగార్జున పేరు ఏంటో తెలుసా? విక్రమ్! అవును... విక్రమే! కమల్ హాసన్ పేరు మాత్రమే కాదు... సినిమా టైటిల్ కూడా అదే! రెండు సినిమాల్లో హీరోల పేర్లు ఒకటే కావడం యాదృశ్చికం కావచ్చు.

సెకండ్ థింగ్... ఘోస్ట్!
కమల్ హాసన్ 'విక్రమ్'లో ఒక థీమ్ సాంగ్ ఉంది... 'వన్స్ అపాన్ ఏ టైమ్, డేర్ లివ్డ్ ఏ ఘోస్ట్' అని! చంపడంలో 'ఘోస్ట్' లాంటి వాడని అర్థం వచ్చేలా సాంగ్ డిజైన్ చేశారు. ఇక, నాగార్జున సినిమా టైటిలే 'ది ఘోస్ట్'. ఇది రెండో కామన్ థింగ్. ఇదీ యాదృశ్చికం కావచ్చు.

ఇద్దరూ ఏజెంట్స్!
సినిమా టైటిల్స్, హీరోల పేర్లు కామన్ అయితే కంపేరిజన్స్ వస్తాయా? అనొచ్చు. అది అసలు విషయం కాదు... రెండు సినిమాల నేపథ్యమూ ఒక్కటే! 'విక్రమ్'లో కమల్ హాసన్ మాజీ రా ఏజెంట్ రోల్ చేశారు. 'ది ఘోస్ట్'లో నాగార్జున మాజీ 'రా' ఏజెంట్ రోల్‌లో కనిపించనున్నారు. హీరోల క్యారెక్టర్స్, సినిమాల బ్యాక్‌డ్రాప్‌ కూడా ఒక్కటే.

మోస్ట్ ఇంపార్టెంట్... సెంటిమెంట్!
'విక్రమ్' యాక్షన్ ఉంది. అంతకు మించి సెంటిమెంట్ కూడా ఉంది. కొడుకును చంపిన డ్రగ్ మాఫియా అంతు చూసిన మాజీ ఏజెంట్‌గా కమల్ భావోద్వేగాన్నీ పండించారు. మనవడితో అనుబంధం హైలైట్ అయ్యాయి. ఆ ఎమోషనల్ బాండింగ్ 'విక్రమ్'కు కీలకంగా నిలిచింది. 'ది ఘోస్ట్' సినిమాలోనూ అటువంటి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని తెలిసింది. ఇందులో నాగార్జునకు సోదరిగా గుల్ పనాగ్, ఆమె కుమార్తెగా మేనకోడలు పాత్రలో అనిఖా సురేంద్రన్ నటించారు. వీళ్ళ సెంటిమెంట్ సినిమాకు కీలకం అవుతుందట!

లాస్ట్ బట్ నాట్ లీస్ట్... ఫైట్స్!
'విక్రమ్'లో ఫైట్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోని రీతిలో 'ది ఘోస్ట్'లో ఫైట్స్ ఉన్నాయని టాక్. ఒక్క విషయం గమనిస్తే... 'విక్రమ్' నుంచి కమల్ హాసన్ కత్తితో ఉన్న పోస్టర్ ఒకటి విడుదలైంది. రీసెంట్‌గా 'ది ఘోస్ట్' టీజర్ విడుదల చేశారు. అందులో నాగార్జున కూడా కత్తి పట్టుకుని ఉన్నారు. ఆ ఫైట్ అందర్నీ ఆకట్టుకుంది.

Also Read : కృతి శెట్టి వయసెంత? - ఇదిగో రామ్ స్పందన

సినిమాల మధ్య కంపేరిజన్స్ రావడం కామన్. అయితే... దర్శకుడిని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. ఎన్టీఆర్ 'టెంపర్', కళ్యాణ్ రామ్ 'పటాస్' తీసుకుంటే... రెండు కథల్లో చాలా కామన్ పాయింట్స్ ఉంటాయి. కానీ, 'టెంపర్' పూరి జగన్నాథ్ స్టైల్‌లో ఉంటే... 'పటాస్' అనిల్ రావిపూడి స్టైల్‌లో ఉంటుంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు ఒక స్టైల్ ఉంది. 'గరుడవేగ'తో స్టైలిష్ యాక్షన్ సీన్స్ తీయడంలో తన టాలెంట్ ఏంటనేది చూపించారు. 'ది ఘోస్ట్'లో డిఫరెంట్‌గా తీసి ఉంటారని ఊహించవచ్చు.

Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

Published at : 13 Jul 2022 10:31 AM (IST) Tags: nagarjuna Praveen Sattaru Kamal Haasan vikram movie The Ghost Movie Comparison Between Vikram The Ghost

సంబంధిత కథనాలు

Khudiram Bose: భరత మాత ముద్దుబిడ్డ 'ఖుదీరాం బోస్' బయోపిక్, ఇదిగో టైటిల్ అనౌన్స్‌మెంట్‌

Khudiram Bose: భరత మాత ముద్దుబిడ్డ 'ఖుదీరాం బోస్' బయోపిక్, ఇదిగో టైటిల్ అనౌన్స్‌మెంట్‌

తరణ్ ఆదర్శ్ రివ్యూ: ‘లాల్ సింగ్ చడ్డా’ అలా - ‘రక్షాబంధన్’ ఇలా, బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుందా?

తరణ్ ఆదర్శ్ రివ్యూ: ‘లాల్ సింగ్ చడ్డా’ అలా - ‘రక్షాబంధన్’ ఇలా, బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుందా?

Laal Singh Chaddha Review - లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?

Laal Singh Chaddha Review - లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?

Rishabh Pant on Urvashi Rautela: నన్ను వదిలెయ్‌ చెల్లెమ్మా! ఊర్వశి రౌటెలాపై పంత్‌ పంచ్‌లు!

Rishabh Pant on Urvashi Rautela: నన్ను వదిలెయ్‌ చెల్లెమ్మా! ఊర్వశి రౌటెలాపై పంత్‌ పంచ్‌లు!

Allu Arjun: రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్న అల్లు అర్జున్ - అభిమానుల కోసమే అలా చేశాడట!

Allu Arjun: రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్న అల్లు అర్జున్ - అభిమానుల కోసమే అలా చేశాడట!

టాప్ స్టోరీస్

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !

Munugode Congress :

Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !

Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !

Maharastra News : మహారాష్ట్రలో మరో పార్థా - లీడర్ మాత్రేమ కాదు నోట్ల గుట్టలు మాత్రం సేమ్ టు సేమ్ !

Maharastra News : మహారాష్ట్రలో మరో పార్థా - లీడర్ మాత్రేమ కాదు నోట్ల గుట్టలు మాత్రం సేమ్ టు సేమ్ !