Virupaksha OTT Streaming : 'విరూపాక్ష' డిజిటల్ స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే - మరి, శాటిలైట్ రైట్స్?
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'విరూపాక్ష' ఓటీటీ, శాటిలైట్ రైట్స్ విడుదలకు ముందు అమ్మేశారు. ఆ రెండూ ఎవరెవరు సొంతం చేసుకున్నారు? అంటే...
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'విరూపాక్ష' (Virupaksha Movie). ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత సాయి తేజ్ నటించిన తొలి సినిమా ఇది. అందువల్ల, సినిమాపై ఆసక్తి నెలకొంది.
రెగ్యులర్ కమర్షియల్ కథ కాకుండా... మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంపిక చేసుకుని సినిమా చేయడం కూడా కలిసి వచ్చింది. ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెంచింది. థియేటర్లలో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలకు ముందు సినిమా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్మేశారు.
నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి 'విరూపాక్ష'
Virupaksha OTT Release : 'విరూపాక్ష' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ (Netflix OTT) సొంతం చేసుకుంది. తమ డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామి నెట్ ఫ్లిక్స్ అని థియేటర్లలో నిర్మాతలు తెలిపారు. ఎన్ని వారాలకు సినిమా ఓటీటీలో వస్తుంది? అనేది ఇప్పుడు చెప్పడం సరికాదు.
'స్టార్ మా' చేతికి శాటిలైట్ రైట్స్!Virupaksha Satellite Rights : 'విరూపాక్ష' శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ నెట్వర్క్ 'స్టార్ మా' సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాను రూపొందించారు. 'స్టార్ మా'కు అన్ని భాషల్లో ఛానల్స్ ఉన్నాయి కాబట్టి... ఆ గ్రూప్ ఛానళ్లలో సినిమా టెలికాస్ట్ కావచ్చు.
సంయుక్త సూపర్బ్ పెర్ఫార్మన్స్!
'విరూపాక్ష'లో సాయి ధరమ్ తేజ్ జోడీగా సంయుక్తా మీనన్ (Samyuktha Menon) నటించారు. సినిమాలో ప్రేమకథ బోర్ కొట్టిందని చాలా మంది చెబుతున్న మాట. అయితే, పతాక సన్నివేశాలు వచ్చేసరికి సంయుక్త అద్భుతంగా నటించారని అందరూ చెబుతున్నారు. ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు సంయుక్తతో పాటు సుకుమార్ స్క్రీన్ ప్లే, బి అజనీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతం, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ సైతం ప్రశంసలు అందుకుంటున్నాయి.
హిట్ టాక్ తెచ్చుకున్న 'విరూపాక్ష'
'విరూపాక్ష' సినిమాకు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ పతాకాలపై బాపినీడు బి సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. అమెరికా ప్రీమియర్స్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎర్లీ మార్నింగ్ షోస్ వరకు అన్ని ఏరియాల్లో సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో మెయిన్ ట్విస్ట్ రివీల్ చేయవద్దని చిత్ర బృందం ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తోంది. నిజం చెప్పాలంటే... స్పాయిలర్స్ చూడకుండా సినిమాకు వెళితే మంచిది. లేదంటే ఎంజాయ్ చేయలేరు.
Also Read : 'మళ్ళీ పెళ్లి' - ఇది సినిమానా? లేదంటే నరేష్ - పవిత్ర జీవితమా? మొదటి భార్యకు నరేష్ పంచ్
సాయి ధరమ్ తేజ్ విజయం అందుకున్నాడని వచ్చిన ఎర్లీ రివ్యూస్ మెగా అభిమానులు అందరికి సంతోషాన్ని ఇచ్చాయి. సోషల్ మీడియాలో మెగా మేనల్లుడికి కంగ్రాట్స్ చెబుతున్నారు. 'విరూపాక్ష' సినిమాలో సాయి చంద్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సునీల్, అజయ్, సోనియా సింగ్, రవి కృష్ణ, అభినవ్ గోమఠం, యాంకర్ శ్యామల, కామాక్షీ భాస్కర్ల, కమల్ కామరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రతి ఒక్కరూ పాత్రల పరిధి మేరకు చేశారని పేరు తెచ్చుకున్నారు.
Also Read : రవితేజ & శర్వానంద్ - ఓ మల్టీస్టారర్, ఎక్స్‌క్లూజివ్ డీటెయిల్స్