Virupaksha Collections: ‘విరూపాక్ష’ క్రేజ్‌కు బద్దలైన బాక్సాఫీస్ - రెండు రోజుల్లో ఎంత వచ్చిందో తెలుసా?
‘విరూపాక్ష’ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఏపీ, తెలంగాణలో ఈ రెండు రోజులు ఎంత వసూలు చేసిందో చూడండి.
సాయి ధరమ్ తేజ్, సంయుక్త ప్రధాన పాత్రల్లో నటించిన ‘విరూపాక్ష’.. ఎక్కడాలేని క్రేజ్ లభిస్తోంది. పబ్లిసిటీతో పనిలేకుండానే.. మౌత్ పబ్లిసిటీతో మూవీకి బోలెడంత బజ్ లభిస్తోంది. దీంతో ‘విరూపాక్ష’ చిత్రయూనిట్ గుండెలపై చేతులు వేసుకుని హాయిగా రిలాక్స్ అవుతోంది. మరోవైపు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్‌లకు అభిమానులు, సెలబ్రిటీలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. పాజిటివ్ టాక్ వల్ల సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ మూవీ భారీ వసూళ్లను సాధించింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో ఇప్పటి వరకు రూ.10.58 కోట్లు లభించాయి. అయితే, ఇది శుక్ర, శనివారాల్లో లభించిన మొత్తం. ఆదివారం వసూళ్లు ఇంకా ఎక్కువ ఉండవచ్చని తెలుస్తోంది.
రెండో రోజైన శనివారం ‘విరూపాక్ష’కు నైజాంలో రూ.2.71 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.75 లక్షలు, సీడెడ్‌లో రూ.89 లక్షలు వచ్చాయి. మొత్తంగా ఏపీ, తెలంగాణలో కలిసి రూ.5.79 కోట్లు వసుళ్లు లభించాయి. మూవీ విడుదలైన రోజు నుంచి రెండు రోజుల వసూళ్లను కలిపితే.. రూ.10.58 కోట్లు వచ్చాయి. వీటిలో అత్యధిక నిజాం (రూ.4.53 కోట్లు) నుంచే వచ్చాయి. విశాఖలో రూ.1.33 కోట్లు, సీడెడ్‌లో రూ.1.43 కోట్లు, గుంటూరులో రూ.81 లక్షలు, నెల్లూరులో రూ.38 లక్షలు, కృష్ణలో రూ.70 లక్షలు, పశ్చిమలో రూ.66 లక్షలు, తూర్పులో రూ.74 లక్షలు లభించాయి. ప్రపంచవ్యాప్తంగా లభించిన 13.5 కోట్ల వరకు కలెక్షన్లు లభించినట్లు తెలిసింది. అంటే మొత్తంగా రెండు రోజుల్లోనే ఈ మూవీ సుమారు రూ.20 కోట్లను దాటేసింది. ఈ మూవీని త్వరలో హిందీతోపాటు మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేయనున్న నేపథ్యంలో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతమైతే చిత్రయూనిట్ తెలుగు, తమిళ వెర్షన్ల కలెక్షన్ల మీదే ఫోకస్ పెట్టారు. అయితే, తమిళనాడులో ఈ సినిమాకు పెద్దగా బజ్ లేనట్లు తెలుస్తోంది. అక్కడ ఇప్పటి వరకు కేవలం రూ.3 లక్షలు మాత్రమే వసూళ్లయ్యాయి. అయితే, తమిళ డబ్బింగ్ వెర్షనా లేదా తెలుగు వెర్షనా అనేది తెలియాల్సి ఉంది.
ఇంత ప్రేమ మీకే సాధ్యం,
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 22, 2023
ఆ ప్రేమంతా మాకే సొంతం ❤️🙏
Watch #BlockbusterVirupaksha in your nearest screens 👇https://t.co/Ytgn5yEDGS#Virupaksha pic.twitter.com/k6ZpBb7qtN
దర్శకుడి ఫోన్ మాయం
ప్రేక్షకుల రెస్పాన్స్‌ను స్వయంగా చూద్దామని దర్శకుడు కార్తీక్ వర్మ దండు శుక్రవారం నిర్మాత బీవీఎన్ఎస్ ప్రసాద్ కలిసి హైదరాబాద్‌లోని పలు థియేటర్లు చుట్టేశారు. ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన చూసి దర్శకనిర్మాతలిద్దరూ చాలా సంబరపడ్డారు. అయితే, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. గుర్తుతెలియని వ్యక్తి థియేటర్‌లో కార్తీక్ ఫోన్ కొట్టేశాడు. నిర్మాత పర్శు కూడా పోయిందని తెలిసింది. ఆ దీంతో కార్తీక్, ప్రసాద్ తలపట్టుకున్నారు. మరి, ఆ ఫోన్ దొరికిందా లేదా అనేది మాత్రం తెలియాలేదు. ఇప్పటివరకు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం. వీరిద్దరు ఐమాక్స్ థియేటర్‌తోపాటు సంధ్య, శ్రీరాములు థియేటర్లకు వెళ్లారు. దీంతో ఫోను, పర్శులు ఎక్కడ పోయాయనేది తెలియరాలేదు.
Also Read : తెలుగులో బుజ్జి కన్నా - నిర్మాత తనయుడితో 'లవ్ టుడే' హీరోయిన్