అన్వేషించండి

Villain Satya Prakash: రమ్య కృష్ణ నన్ను రేప్ చేస్తానంది - సిగ్గులేదా నీకు అని తిట్టారు: విలన్ సత్య ప్రకాష్

తెలుగు సినిమా పరిశ్రమలో విలన్ పాత్రలు చేసి బాగా పాపులర్ అయ్యారు నటుడు సత్య ప్రకాష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కెరీర్ తొలినాళ్లలో తాను చేసిన క్యారెక్టర్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Villain Satya Prakash About Rape Scenes: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విలన్ అనగానే గుర్తుకు వచ్చిన వ్యక్తి నటుడు సత్య ప్రకాష్. సినిమాల్లో ఆయన కనిపించగానే ప్రేక్షకులకు ఎక్కడలేని కోపం వచ్చేదంటే ఆయన నటన ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పలు భాషల్లో వందలాది సినిమాలు చేసిన ఆయన, తెలుగు సుమారు 30 సినిమాల్లో కనిపించారు. తెలుగు ఆయన ఎక్కువగా విలన్ పాత్రలే పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సీని కెరీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

రేప్ సీన్లు చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డా!

కెరీర్ తొలినాళ్లలో రేప్ సీన్లు చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని చెప్పారు సత్య ప్రకాష్. “సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో రేప్ సీన్లు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. తొలినాళ్లలో నేను చేసిన క్యారెక్టర్లు చూస్తే ఇప్పుడు అసహ్యం కలుగుతుంది. అప్పట్లో నేను ఈ సీన్ చేయను అని చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు సినిమాల్లో రేప్ సీన్లు లేవు. ప్రేక్షకులు ఇప్పుడు అలాంటి సీన్లు చూసి అట్రాక్టివ్ కావట్లేదు. అప్పట్లో బాగా అట్రాక్టివ్ అయ్యేవాళ్లు. ‘పెళ్లి చేసుకుందాం’ సినిమాలో వర్షం పడుతున్న సమయంలో సౌందర్యను వ్యాన్ లోకి లాగి రేప్ చేసే సీన్ ఇప్పటికీ జనాలకు గుర్తుంది. ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో రమ్యకృష్ణ రేప్ సీన్ కూడా బాగా పాపులర్ అయ్యింది. ఆ సీన్ షూటింగ్ లో మూడు టేక్ లు అయ్యాయి. అయినా సరిగా రాలేదు. అప్పుడు సుబ్బయ్య గారు.. సిగ్గు లేదా సత్యా, ఈ సీన్ ఇన్నిసార్లు కరెక్టుగా చేయలేవా? అన్నారు. అప్పుడు రమ్యకృష్ణ కలుగజేసుకుని, సర్, మీరు ఓకే అనండి నేనే సత్యను రేప్ చేస్తానని అని చెప్పింది. ఆమె అంత డేర్ గా ఉండేది. సత్య ఇది జస్ట్ యాక్టింగ్.. అలాగే చెయ్ అని నాకు ధైర్యం చెప్పింది. నేను ఆమెతో ఆ సీన్ చేసే సమయానికి తను పెద్ద స్టార్, నేను అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నాను. అందుకే నాకు భయం వేసింది” అని చెప్పారు.

నా గురించి సౌందర్య కంప్లైంట్ చేసింది!

ఇక సౌందర్య రేప్ విషయంలో పెద్ద కంప్లైట్ వచ్చిందని సత్య ప్రకాష్ తెలిపారు. ఆమె ఏకంగా తన గురించి చిరంజీవి చెప్పినట్లు వెల్లడించారు. “‘చూడాలని ఉంది’ సినిమాలో సౌందర్య హీరోయిన్. అన్నపూర్ణ స్టూడియోలో ఓ షూటింగ్ జరుగుతోంది. పక్కన చిరంజీవి గారు ఉన్నారని తెలిసి వెళ్లాను. అక్కడ సౌందర్య కూడా కూర్చొని ఉంది. అప్పుడు.. చిరంజీవి గారు.. నా కెరీర్ లో ఒక సినిమాలో రేప్ జరిగింది. ఆ రేప్ చేసిన దుర్మార్గుడు వీడే” అని చెప్పింది. దాన్ని నేను కాంప్లిమెంట్ గా తీసుకున్నాను” అని చెప్పారు. ఇక భోజ్ పురి సినిమాలు చేస్తున్న సమయంలో ఓ రేప్ సీన్ అయ్యాక  ఇంటర్వ్యూ ఇచ్చాను. అప్పుడు వాళ్లు పేపర్ లో ‘దేర్ ఈజ్ ద రేపిస్ట్ ఇన్ ద సిటీ- బీ కేర్ ఫుల్’ అని హెడ్డింగ్ పెట్టారు. నేను దాన్ని చూసి షాక్ అయ్యాను. ఇలాంటి రాస్తే యూపీ, బీహార్ లో చంపేస్తారని ఆ పత్రిక వాళ్లతో మాట్లాడాను. అవన్నీ మంచి జ్ఞాపకాలు. కానీ, నేను చేసిన రేప్ సీన్లు ఇప్పుడు చూస్తే నాకు అసహ్యం వేస్తుంది” అని చెప్పుకొచ్చారు సత్య ప్రకాష్.

Also Read: ఆ సినిమా షూటింగ్ సమయంలో బాత్రూమ్స్ లేవు, అలా చేయాల్సి వచ్చింది - ప్రియమణి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget