Vikrant Rona Telugu Trailer: భయమంటే ఏమిటో తెలియనివాడు - సుదీప్ 'విక్రాంత్ రోణ' ట్రైలర్ చూశారా?
Vikrant Rona Official Telugu Trailer Released By Ram Charan: కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'. రామ్ చరణ్ ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
Vikrant Rona: కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
'విక్రాంత్ రోణ' ట్రైలర్ విషయానికి వస్తే... ప్రారంభంలోనే సుదీప్‌ను చూపించారు. ఆయన రన్నింగ్, సిగరెట్ కాల్చే విధానం స్టయిల్ గా ఉన్నాయి. ఆ తర్వాత 'ఆ ఊరే ఒక మర్మమైన ఊరు. ఆ ఊరి ప్రజలు ఏదో ఒక భయంకరమైన కథను దాచాలని అనుకుంటున్నారు. కథని దాచగలరు. కానీ, భయాన్ని దాచలేరు. ఆ కథ మళ్ళీ మొదలైంది. ఆ డెవిల్ మళ్ళీ వచ్చాడు' అని ఒక అమ్మాయి చెప్పడంతో అసలు ట్రైలర్ మొదలైంది.
భయం నిండిన ఊరిలో భయమంటే ఏమిటో తెలియని వాడిగా విక్రాంత్ రోణగా సుదీప్ మరోసారి స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఇన్స్పెక్టర్ సురేష్ కృష్ణ హత్యతో పాటు ఆ ఊరిలో జరిగిన మరొకొన్ని హత్యల వెనుక నిజాలను వెలికితీసే అధికారి పాత్రలో సుదీప్ నటించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమైంది. సుదీప్ డ్యూయల్ రోల్ చేసినట్టు ఉన్నారు.
Also Read : 'కొండా' రివ్యూ: కొండా మురళి, సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Wishing @KicchaSudeep garu all the very best !! #VikrantRonatrailer looks quite exciting! 🥂
— Ram Charan (@AlwaysRamCharan) June 23, 2022
Here’s the Telugu Trailer : https://t.co/eEHhOILSMz@anupsbhandari @JackManjunath @shaliniartss @InvenioF @ZeeStudios_ @laharimusic @neethaofficial @Asli_Jacqueline
అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా 'విక్రాంత్ రోణ'ను తెరకెక్కించారు. ఈ సినిమాలో సుదీప్ సరసన జాక్వలిన్ ఫెర్నాండేజ్ నటించారు. అనూప్ భండారి దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్, సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ సమర్పణలో జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్ నిర్మించారు. అలంకార్ పాండియన్ సహ నిర్మాత. ఈ సినిమా జూలై 28న విడుదల కానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో త్రీడీలో సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సినిమాపై సుదీప్ చాలా నమ్మకంగా ఉన్నారు.
Also Read : అల్లు అర్జున్‌కు వీరాభిమాని అరుదైన కానుక - ఐకాన్ స్టార్ అభిమానులే ఖర్చులన్నీ భరించి