Ghaati: అనుష్క 'ఘాటి'తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కోలీవుడ్ నటుడు... ఆ వారసుడి ఫస్ట్ లుక్ రిలీజ్, చూశారా?
Vikram Prabhu Telugu Debut: అనుష్క, డైరెక్టర్ క్రిష్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న మూవీ ‘ఘాటి’. యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమా, విక్రమ్ ప్రభుకు తెలుగులో ఫస్ట్ ఫిల్మ్.

క్వీన్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం ‘ఘాటి’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టీజర్ గ్లింప్స్ ఇటీవల విడుదలై ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టీజర్‌లో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అనుష్కను సరికొత్త అవతార్‌లో చూపిస్తూ.. క్రిష్ చేస్తున్న ఈ ప్రయత్నం టీజర్‌తోనే సక్సెస్ అనేలా టాక్‌ని సొంతం చేసుకుంది. ‘వేదం’ తర్వాత క్రిష్, అనుష్కల కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై మాములుగానే అంచనాలు ఉండగా.. టీజర్ గ్లింప్స్ తర్వాత ఈ సినిమాను చూసే విధానమే మారిపోయింది. అంతగా టీజర్ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది.
ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ముఖ్యంగా అనుష్క అభిమానులు అయితే ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎంతో ఆతృతగా ఉన్నారు. అలాంటి వారందరి కోసం పొంగల్‌ని పురస్కరించుకుని విషెస్ తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో అనుష్క అయితే లేదు కానీ, మరో పాత్రని ఈ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఇంతకీ ఈ పోస్టర్‌లో ఉన్న నటుడెవరని అనుకుంటున్నారా? తమిళ్‌లో ఇప్పుడిప్పుడే విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకుంటున్న విక్రమ్ ప్రభు. ‘ఘాటి’లో విక్రమ్ ప్రభు విలన్‌గా నటిస్తున్నాడా? లేదంటే మరో పాత్ర ఏదైనా చేస్తున్నారా? అనేది తెలియదు కానీ.. ఇందులో ఆయన ‘దేశి రాజు’గా ఒక క్రూసియల్ రోల్ చేస్తున్నాడనేది మాత్రం ఈ పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది.
ఈ విక్రమ్ ప్రభు మరెవరో కాదు.. లెజెండ్ శివాజీ గణేషన్ మనవడు, నటుడు ప్రభు కుమారుడు. ప్రస్తుతం తమిళ యాక్టర్స్ చాలా మంది టాలీవుడ్‌లోనూ తమ ప్రతాపం చూపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ సంగతి పక్కన పెడితే.. విజయ్, అజిత్, ధనుష్, సూర్య, విక్రమ్, కార్తీ, శింబు, శివకార్తీకేయన్.. ఇలా కోలీవుడ్ స్టార్ హీరోలందరూ తమ సినిమాలను టాలీవుడ్‌లోనూ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమా నడుస్తుంది. ఈ క్రమంలోనే విక్రమ్ ప్రభు కూడా డైరెక్ట్‌గా ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకు ముందు ఆయన నటించిన తమిళ సినిమాలు టాలీవుడ్‌లో డబ్ అయ్యాయి. కానీ ఇదే ఆయన డైరెక్ట్ తెలుగు సినిమా.
Team #GHAATI roars with pride as we wish the incredible @iamVikramPrabhu garu a very Happy Birthday 🎉🔥
— UV Creations (@UV_Creations) January 15, 2025
Brace yourselves to feel the fire and witness him set the screen ablaze as the explosive #DesiRaju.
A Special Glimpse Video dropping today at 4:30 PM.#GHAATI on 18th April… pic.twitter.com/oKmZnJArTe
ఈ సినిమాతో ఆయన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తారో తెలియదు కానీ.. ఆయన బర్త్‌డే స్పెషల్‌గా వచ్చిన ఈ లుక్‌తో మాత్రం ఆయన బాగానే ఆకట్టుకుంటున్నారు. సీరియస్ మోడ్‌లో ఇంటెన్స్ లుక్‌లో ఆయన ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘వేదం’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత అనుష్క, క్రిష్‌ల కలయికలో వస్తున్న రెండవ చిత్రం ‘ఘాటి’ కాగా, UV క్రియేషన్స్ బ్యానర్‌లో అనుష్కకు ఇది నాల్గవ సినిమా. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. విద్యాసాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీతో సహా పలు భాషల్లో 18 ఏప్రిల్ 2025న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.





















