Stree 2 Success Bash: తమన్నా డ్యాన్స్‌కు ప్రియుడు ఫిదా, విజిల్స్ వేస్తూ ఒకటే సందడి, వీడియో వైరల్
‘స్ట్రీ 2‘ సక్సెస్ బాష్ లో తమన్నా, విజయ్ వర్మ సందడి చేశారు. ‘ఆజ్ కీ రాత్‘ పాటకు శ్రద్ధా కపూర్, తమన్నా డ్యాన్స్ చేస్తుండగా, విజయ్ వర్మ విజిల్స్ వేస్తూ వారిని మరింత ఉత్సాహపరిచాడు.

Vijay Varma At Stree 2 Success Bash: అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కి తాజా చిత్రం ‘స్త్రీ 2‘. ఆగష్టు 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా రూ. 228 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ బాష్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో పలువురు సినీ తారలు పాల్గొని సందడి చేశారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తమన్నా డ్యాన్స్ కు విజయ్ విజిల్స్
‘స్త్రీ 2’ సక్సెస్ బాష్ లో ‘ఆజ్ కీ రాత్’ పాటకు శ్రద్దా కపూర్, కృతి సనన్ తో కలిసి తమన్నా భాటియా డ్యాన్స్ చేస్తూ అలరించారు. వీరి డ్యాన్స్ చూసి తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ ఫుల్ ఖుషీ అయ్యాడు. విజిల్స్ వేస్తూ వారిని ఎంకరేజ్ చేశాడు. బ్లాక్ డ్రెస్ లో తమన్నా అందాలు ఆరబోస్తూ అందరినీ ఆకట్టుకుంది. చిత్ర దర్శకుడు అమర్ కౌషిక్, నటుడు అభిషేక్ బెజన్సీ సైతం డ్యాన్స్ చేస్తున్నా హీరోయిన్లను చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సక్సెస్ బాష్ అంటే ఈ మాత్రం ఉండాల్సిందే.. అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Exclusive!
— Team Tamannaah ♥︎ (@TeamTamannaah) August 20, 2024
.@tamannaahspeaks Vibing With @ShraddhaKapoor And @kritisanon For #AajKiRaat Song From #Stree2 Success Party!🤍🪄#TamannaahBhatia #Tamannaah #ShraddhaKapoor #KritiSanon pic.twitter.com/HliHzOcoLb
‘స్ట్రీ 2’ మూవీ గురించి..
గత కొద్ది కాలంగా బాలీవుడ్ లో చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో ‘స్ట్రీ 2’ హిందీ చిత్ర పరిశ్రమకు మంచి జోష్ తీసుకొచ్చింది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అమర్ కౌశిక్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో తమన్నా భాటియా స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది. అందాల ఆరబోతతో ప్రేక్షకులను కవ్వించింది. ఇక ఈ సినిమాలో నటనకు గాను శ్రద్ధా కపూర్ రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. తమన్నా కూడా బాగానే డబ్బులు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. 2018లో విడుదలై మంచి హిట్ అందుకున్న ‘స్త్రీ’ సినిమాకు సీక్వెల్ గా ‘స్త్రీ 2’ తెరకెక్కింది. అప్పట్లో హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. విడుదలైన మూడు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. మళ్లీ ఆరేళ్ల తర్వాత స్త్రీ మూవీకి సీక్వెల్ ‘స్ట్రీ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Also Read: ఒకే వేదికపైకి అల్లు అర్జున్ - సుకుమార్... మారుతి నగర్ ఈవెంట్‌లో 'పుష్ప 2' పుకార్లకు చెక్!?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

