అన్వేషించండి

Maharaja Trailer: సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న విజయ్‌ సేతుపతి 'మహారాజా' ట్రైలర్‌ - ఎవరయ్యా ఆ లక్ష్మి 

Maharaja Trailer: విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి 50వ సినిమా మహారాజా ట్రైలర్‌ విడుదల చేశారు. పూర్తి సస్పెన్స్‌తో సాగిన ఈ ట్రైలర్‌ మూవీపై క్యురియాసిటీ పెంచుతుంది.

Maharaja Trailer Out: తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్‌‌ బేస్‌ ఉంటుంది. పాత్రలతో ప్రయోగాలు చేసే హీరోల్లో విజయ్‌ సేతుపతి ఒకరు. తన సినిమాల్లో వైవిధ్యం, కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు విజయ్‌ సేతుపతి. హీరో పాత్రలైనా, విలన్‌ రోల్‌ అయినా తన పాత్రలో వైవిధ్యం ఉండేలా జాగ్రత్తపడుతుంటాడు. అందుకే విజయ్‌ సేతుపతి సినిమా అనగానే ఆడియన్స్‌లో ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. ఇప్పుడు విజయ్‌ సేతుపతి మరో సరికొత్త కథతో వస్తున్నాడు. ఆయన 50వ సినిమాగా వస్తున్న సినిమా 'మహారాజా' (తమిళంలో మక్కళ్‌ సెల్వన్‌). 

త్వరలో ఈ సినిమా రిలీజ్‌ కానున్న నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. క్రైం థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు రిలీజైన ట్రైలర్‌ మరిన్ని అంచనాలు పెంచేస్తోంది. ఇందులో విజయ్‌ సేతుపతి మరోసారి తన యాక్టింగ్‌ స్కిల్స్‌తో సర్‌ప్రైజ్‌ చేశారు. అయితే ట్రైలర్‌లో మొత్తం ఆయన చెవికి కట్టు కట్టుకుని ఉండటం మూవీపై హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సెలూన్‌ రన్‌ చేసే వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని ట్రైలర్‌ మొదట్లోనే రివీల్‌ చేశారు. చేవికి కట్టుకట్టుకుని ఉన్న విజయ్‌ సేతుపతి పోలీసు స్టేషన్‌కి వెళ్లి తన పేరు మహారాజా అని, కేకే నగర్‌లో సెలూన్‌ షాప్‌ నిర్వహిస్తున్నట్టు చెబుతాడు. 

తన ఇంట్లోని లక్ష్మిని ఎవరో దొంగలించారని, ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసేందుకు వచ్చానంటూ పోలీసుతో చెబుతున్న సీన్‌తో ట్రైలర్‌ మొదలవుతుంది. ఆ తర్వాత లక్ష్మి అంటే డబ్బా, నగలా, డాక్యుమెంట్స్‌ అంటే అవేవి కాదంటాడు. పోలీసులు ప్రశ్నలకి విజయ్‌ సేతుపతి సైగలతో చెప్పే ప్రయత్నం చేశాడు.. కానీ, ఎక్కడా కూడా లక్ష్మి ఎవరనేది రివీల్‌ చేయలేదు. ట్రైలర్‌ లక్ష్మి అంటే ఎక్కడా కూడా రివీల్‌ చేయకుండ సస్పెన్స్‌లో ఉంచారు. కానీ, లక్ష్మి అంటే మనిషి కాదని ట్రైలర్‌లో మాత్రం ఓ స్పష్టత ఇచ్చారు. మొత్తానికి ట్రైలర్‌ లక్ష్మి ఎవరనేది చెప్పుకుండ మూవీపై క్యూరియసిటీ పెంచాడు డైరెక్టర్‌. తన లైఫ్‌లో అంతా ఇంపార్టెంట్‌ అయినా లక్ష్మి ఎవరనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందేనంటూ ట్రైలర్‌ ద్వారా మూవీ టీం స్పష్టం చేసింది. 

Also Read: బాలీవుడ్‌లో మరో బ్రేకప్‌ - ఐదేళ్ల బంధానికి ముగింపు పలికిన మలైకా, అర్జున్‌..!
 
సెలూన్‌ షాష్‌ రన్‌ చేసుకునే మహారాజా ఇంట్లో లక్ష్మి పోవడం.. అతడు చెవికి కట్టుకుని ఉండటం చూస్తుంటే మహారాజా ఇంట్లో ఎదో క్రైం జరిగినట్టు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమైపోతుంది. ఆ కేసు ఛేదించడం, తన లక్ష్మిని కనిపెట్టడం చూట్టే ఈ సినిమా సాగునుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ కూడా నటిస్తున్నారు. అయితే ఆయనది విలన్‌ రోలా? కీలక పాత్ర అనేది తెలియాల్సి ఉంది. కానీ ట్రైలర్‌ ఆయనను ఒక్క సీన్‌లో చూపించి మూవీపై మరింత ఆసక్తిని పెంచారు. మొత్తానికి 'మహారాజా' ట్రైలర్‌ పూర్తి సస్పెన్స్‌లో సాగుతూ మూవీపై హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. కాగా అనురాగ్‌ కశ్యప్‌ దర్వకత్వ వహిస్తున్న ఫేం నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం మమతా మోహన్‌ దాస్‌, నట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget