Vijay Sethupathi: 'అమ్మ' రాజశేఖర్ కోసం విజయ్ సేతుపతి... తమిళంలోనూ ప్రేమికుల రోజు 'తల'
Amma Rajasekhar: 'అమ్మ' రాజశేఖర్ కొత్త సినిమాకు మద్దతుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వచ్చారు. తనయుడు హీరోగా రాజశేఖర్ దర్శకత్వం వహించిన 'తల'ను తమిళంలోనూ విడుదల చేస్తున్నారు.

తనయుడు 'అమ్మ' రాగిన్ రాజ్ హీరోగా ఫేమస్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ 'అమ్మ' రాజశేఖర్ (Amma Rajasekhar) దర్శకత్వం వహించిన సినిమా 'తల' (Thala Movie). దీనిని తమిళంలో 'వెట్టు' పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పుడీ సినిమాకు మద్దతుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వచ్చారు.
'వెట్టు' ట్రైలర్ విడుదల చేసిన విజయ్ సేతుపతి
'అమ్మ' రాజశేఖర్ మీద విజయ్ సేతుపతికి గౌరవం ఉంది. ఆయన హీరోగా యాక్ట్ చేసిన కెరీర్ స్టార్టింగ్ సినిమాల్లో కొన్ని పాటలకు అమ్మ రాజశేఖర్ నృత్య దర్శకత్వం వహించారు. వాళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకని, 'అమ్మ' రాజశేఖర్ అడగ్గానే 'వెట్టు' ట్రైలర్ విడుదల చేసి కంగ్రాట్స్ చెప్పారు.
'రణం'తో దర్శకుడిగా సత్తా చాటిన 'అమ్మ' రాజశేఖర్ మరోసారి ఆ తరహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కమర్షియల్ హంగులతో పాటు తన కంఫర్ట్ జోన్ నుంచి కాస్త బయటకు వచ్చి కొత్తగా ట్రై చేసినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
'తల' తెలుగు ట్రైలర్ కొన్ని రోజుల క్రితం విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. 'అమ్మ' రాజశేఖర్ డిఫరెంట్‌గా ట్రై చేశారని పేరు వచ్చింది. తమిళ ట్రైలర్ గురించి కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయ్ సేతుపతి కూడా ఈ ట్రైలర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారని, స్టార్ హీరో రేంజ్ 'అమ్మ' రాగిన్ రాజ్ నటనలో కనిపిస్తోందని ప్రశంసించినట్టు తెలిసింది.
Launching the Tamil Trailer of #VETTU, Best wishes to director #AmmaRajashekar and the cast & crew!
— VijaySethupathi (@VijaySethuOffl) February 3, 2025
In cinemas from Feb 14th
https://t.co/6hjGKF165o
Starring: #RaaginRaj #AnkithaNasskar #EsterNoronha@Satyamrajesh2 #MukkuAvinash#AmmaRajashekar #DeepaArts #PSreenivasaGoud… pic.twitter.com/7lLpWHBHoc
''ఇటువంటి సినిమాతో హీరోగా పరిచయం కావడం రాగిన్ రాజ్ (Amma Ragin Raj)కు చాలా పెద్ద ప్లస్ అవుతుంది. అతని కెరీర్ బావుంటుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని విజయ్ సేతుపతి చెప్పారు. ఆయన నుంచి ప్రశంసలు రావడంతో చిత్ర బృందం సంతోషంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో బిజినెస్ పరంగానూ 'తల'కు ఫ్యాన్సీ రేట్స్ ఆఫర్ చేస్తున్నారని టాక్. సినిమాలో కంటెంట్ బావుంటే సూపర్ హిట్ గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నాయ్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న సినిమాను విడుదల చేస్తున్నారు.
Also Read: మెగా కోడలు లావణ్య కొత్త సినిమా షురూ... పూజతో 'సతీ లీలావతి' ప్రారంభం
అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటించిన 'తల' సినిమాలో అనితా నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, 'ముక్కు' అవినాష్, 'సత్యం' రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి దర్శకుడు: అమ్మ రాజశేఖర్, నిర్మాత: శ్రీనివాస్ గౌడ్, నిర్మాణ సంస్థ: దీపా ఆర్ట్స్, ఛాయాగ్రహణం: శ్యామ్ కె నాయుడు, సంగీతం: ధర్మ తేజ - అస్లాం కేఈ, నేపథ్య సంగీతం: అస్లాం కేఈ, రచన - మాటలు: అమ్మ రాజశేఖర్ అండ్ టీం.
Also Read: నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

