Vijay Sethupathi: 'విడుదల 2' రిలీజ్ డేట్ వచ్చేసింది - రామ్ చరణ్‌కు పోటీగా వస్తున్న విజయ్ సేతుపతి
Viduthalai 2 Release Date: విజయ్ సేతుపతి విడుదల 2 రిలీజ్ డేట్‌ను ప్రకటించింది మూవీ టీం. 2023లో వచ్చిన విడుదల చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Makers Annouce Viduthalai 2 Release: కోలీవుడ్ స్టార్ హీరో, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా 'మహారాజ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. తండ్రి, కూతుళ్ళ సెటిమెంట్‌తో వచ్చిన బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇక ఓటీటీలోనూ మహారాజా చిత్రం అదరగొట్టింది. అత్యధిక వ్యూస్‌తో టాప్‌లో నిలిచింది. మహారాజా వంటి హిట్ సినిమా తర్వాత విజయ్ సేతుపతి నటిస్తున్న చిత్రం 'విడుదల 2'.
గతేడాది విడుదలైన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ విడుదల 1 (Vidudala 2 Release Date)కు సీక్వెల్‌గా వస్తుంది. విజయ్ సేతుపతి, కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వస్తున్న విడుదల 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం తమిళ్, తెలుగు ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది మూవీ టీం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించడంతో తమిళ్ ఆడియన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు.
View this post on Instagram
కాగా డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న విడుదల 2ను క్రిస్మస్ కానకగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ మేరకు రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. డిసెంబర్ 20న గ్రాండ్‌గా మూవీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కాగా ఈ సీక్వెల్‌లో అనురాగ్ కశ్యప్, గౌతమ్ వాసు దేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, రాజీవ్ మీనన్ వంటీ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్, గ్రాస్‌రూట్ ఫిల్మ్ కంపెనీ, రెడ్ జియాంట్ మూవీస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: చిరంజీవి, బన్నీని ఒకే వేదిక మీదకు తీసుకొస్తున్న బాలకృష్ణ - మెగా వర్సెస్ అల్లు గొడవకు ఫుల్ స్టాప్?
ఇదిలా ఉంటే విడుదల 1తో కమెడియన్ సూరి హీరోగా ఎంట్రీ ఇవ్వగా.. మంచి బ్రేక్ అందుకున్నాడు. విజయ్ సేతుపతి పెరుమాళ్ వాథియార్ పాత్రలో నటించాడు. ఇందులో ఆయన గిరిజనులకు అండగా నిలిచే పెరుమాళ్‌గా కనిపించాడు. సీక్వెల్‌లోనూ ఈ పాత్ర కొనసాగనుందని టాక్. ఇక ఇందులో విజయ్ సేతుపతికి జోడీగా మంజు వారియర్ నటిస్తోంది. అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే డిసెంబర్ లోనే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా రిలీజ్ కానున్న సంగతి తలిసిందే. ఈ క్రిస్మస్ కి గేమ్ ఛేంజర్ రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు.
Also Read: పేరు పెట్టినంత మాత్రాన ఆయన.. ఈయన అవ్వరు - ‘ఎన్టీఆర్’ పేరుపై వైవీఎస్ చౌదరి కామెంట్స్
Before You Go
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు






















