అన్వేషించండి

Vijay: తండ్రిని కలిసిన విజయ్, మనస్పర్థలు తొలగిపోయినట్టేనా?

లీవుడ్‌లో విజయ్ పర్సనల్ లైఫ్ గురించి ప్రత్యేకమైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే విజయ్.. తన తండ్రిని కలవడానికి వెళ్లాడు.

కోలీవుడ్‌ హీరో విజయ్ పర్సనల్ లైఫ్ గురించి ప్రత్యేకమైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే విజయ్.. తన తండ్రిని కలవడానికి వెళ్లాడు. అసలు విజయ్ పర్సనల్ లైఫ్ గురించి తెలియని వాళ్లు తండ్రిని కలిస్తే పెద్ద విషయమా అని అనుకోవచ్చు. కానీ విజయ్‌కు, తన తండ్రికి మధ్య జరిగిన గొడవ గురించి తెలిసిన వారికి మాత్రం దీని గురించి ఒక క్లారిటీ ఉంటుంది.

చాలాకాలం తర్వాత..
ఇటీవల విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌కు ఒక సర్జరీ జరిగింది. ఆ సర్జరీ తర్వాత ఇంట్లోనే ఉంటూ తగిన చికిత్స తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం చంద్రశేఖర్‌కు ఎలా ఉంది అని, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అని విజయ్ పర్సనల్‌గా తెలుసుకోవడం మొదలుపెట్టారట. అంతే కాకుండా విదేశాల్లో షూటింగ్ ముగించుకొని వచ్చిన విజయ్.. తన తండ్రిని కలవడానికి కూడా వెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్.. ‘లియో’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అదే పనిపై ఫారిన్‌కు కూడా వెళ్లాడు. అక్కడి నుండే తన తండ్రి ఆరోగ్యం గురించి కనుక్కుంటూ ఉన్న విజయ్.. తిరిగి రాగానే తండ్రిని కలవడానికి వెళ్లడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

తల్లిదండ్రులపై కేసు..
2021లో విజయ్.. తన తల్లిదండ్రులతో పాటు మరో తొమ్మిది మందిపై లా సూట్ ఫైల్ చేశాడు. పబ్లిక్ మీటింగ్స్‌ను ఏర్పాటు చేసే విషయంలో తన పేరును అనవసరంగా ఉపయోగిస్తున్నారని అందులో పేర్కొన్నాడు. అంతే కాకుండా విజయ్‌కు రాజకీయాలు అంటే ఆసక్తి ఉందని ప్రకటించిన తన తండ్రి చంద్రశేఖర్.. విజయ్ పేరు మీద పార్టీ పేరును కూడా రిజిస్టర్ చేశాడు. ఈ పార్టీకి ట్రెజరర్‌గా తన భార్య, విజయ్ తల్లి శోభాను నిలబెట్టాడు. తన బంధువు పద్మనాభన్‌ను పార్టీ ప్రెసిడెంట్‌ను చేశాడు. అయితే తన అనుమతి లేకుండా రాజకీయ పార్టీ పేరును ప్రకటించాడని విజయ్ సీరియస్ అయ్యాడు. ఈ కారణంగానే 11 మందిపై లాసూట్ ఫైల్ చేశాడు.

‘బీస్ట్’ రిజల్ట్‌పై వ్యాఖ్యలు..
ఆ సంఘటన తర్వాత విజయ్‌కు, తన తండ్రికి దూరం పెరిగిపోయింది. వీరిద్దరిని కలపడానికి విజయ్ తల్లి శోభా ఎంత ప్రయత్నించినా తన వల్ల అవ్వలేదు. చంద్రశేఖర్ మాత్రం సందర్భం దొరికినప్పుడల్లా విజయ్ విషయాల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. విజయ్ హీరోగా తెరకెక్కిన ‘బీస్ట్’ సినిమా రిజల్ట్ గురించి కూడా కామెంట్స్ చేశారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ వల్లే ‘బీస్ట్’ మూవీ ఫ్లాప్ అయ్యిందని ఓపెన్‌గా వెల్లడించారు. కానీ ఆ వ్యాఖ్యల గురించి విజయ్ అసలు స్పందించడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత విజయ్ హీరోగా వచ్చిన ‘వారిసు’ ఫంక్షన్‌కు మూవీ టీమ్ చంద్రశేఖర్‌ను కూడా ఆహ్వానించారు. అప్పుడే విజయ్‌కు, చంద్రశేఖర్‌కు మనస్పర్థలు తొలగిపోయాయని అనుకున్నారంతా. కానీ నిజంగా వారి మధ్య మనస్పర్థలు తొలగిపోవడానికి ఇంత సమయం పట్టింది.

Also Read: 14 ఏళ్లకే పెళ్లి, 35 ఏళ్లకే ఆత్మహత్య - సిల్క్ స్మిత మరణానికి కారణం అదేనా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget