అన్వేషించండి

Vijay Deverakonda: 'అంబాజీ పేట మ్యారేజి బ్యాండు' సినిమాపై రౌడీ హీరో రివ్యూ - థియేటర్ లో అందరూ అదే ఫీల్ అవుతారంటూ!

Vijay Devarakonda : సుహాస్ హీరోగా నటించిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' మూవీ పై విజయ్ దేవరకొండ తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు.

'కలర్ ఫోటో’ చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యాడు సుహాస్. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డును సైతం అందుకుంది. ఆ తర్వాత 'రైటర్ పద్మభూషణ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా మహిళలను బాగా ఆకట్టుకుంది. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణిస్తున్నాడు. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన అడివి శేష్ 'హిట్ 2' చిత్రంలో నెగెటివ్ రోల్ పోషించి అలరించాడు.

ఇక ఇప్పుడు 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహించారు  ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకోగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఫిబ్రవరి 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' సినిమా చూసి తన రివ్యూ ఇచ్చారు.

'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' పై రౌడీ హీరో రివ్యూ..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ తాజాగా హైదరాబాదులో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా బీఫ్ టికెట్ రిలీజ్ చేశారు ఇక ఈ సినిమాను చూసి చాలా బాగుందంటూ ప్రశంసించారు." అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. మ్యూజిక్, ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ లు నెక్ట్ లెవెల్ లో ఉన్నాయి. సుహాస్ ఎప్పటిలాగా చాలా బాగా నటించాడు. శరణ్య అద్భుతంగా పర్ ఫార్మ్ చేసింది. ఏ సినిమాకైనా ఫస్ట్ హాఫ్ చూశాక కొంత విరామం తీసుకునే నేను ఈ సినిమాకు కంటిన్యూగా ఫుల్ మూవీ చూశాను. అంత క్యూరియస్ గా అనిపించింది. మీరు కూడా థియేటర్ లో ఇదే ఫీల్ అవుతారు" అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాపై రౌడీ హీరో కామెంట్స్ మరింత అంచనాలను పెంచాయి.

'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' కాస్ట్ అండ్ క్రూ

కంప్లీట్ విలేజ్ నేటివిటీతో ఎమోషనల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సుహాస్ సరసన శివాని నాగారం హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ నటుడు గోపరాజు రమణ, పుష్ప ఫ్రేమ్ జగదీష్ బండారి ఇతర కీలక పాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎటాచ్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. వెంకటేష్ మహా సమర్పకుడు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రానికి వాజిద్ బేగ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

'ఫ్యామిలీ స్టార్' గా రాబోతోన్న విజయ్ దేవర కొండ..

'గీతా గోవిందం' మూవీ ఫేమ్ పరశురాం - విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : మగాళ్లకు సారీ చెప్పిన ప్రియమణి - ఎందుకో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Embed widget