అన్వేషించండి

Vijay Deverakonda: 'ది' ట్యాగ్... ట్రోలింగ్స్... విమర్శలు - విజయ్ దేవరకొండ రియాక్షన్ ఏంటంటే?

Vijay Deverakonda Tag: 'ది' ట్యాగ్‌పై యంగ్ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. ఈ ట్యాగ్ వల్ల తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని... అందుకే దాన్ని తొలగించాలని చెప్పినట్లు తెలిపారు.

Vijay Deverakonda Reaction On The Tag: యంగ్ హీరో విజయ్ దేవరకొండ 'కింగ్ డమ్' మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ట్యాగ్‌పై ఆయన స్పందించారు. ఇండస్ట్రీలో ఏ ట్యాగ్ లేకుండా ఉన్న హీరో తానొక్కిడినేమోనని అన్నారు.

'ది' ట్యాగ్ తొలగించాలని చెప్పా

గతంలో విజయ్ పేరుకు ముందు 'ది' ట్యాగ్ జోడించడం వల్ల వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.  దీంతో దాన్ని తొలగించాలంటూ ఫ్యాన్స్‌కు ఆయన సూచించారు. ఆ ట్యాగ్ ఇతర హీరోలతో పాటు వారి అభిమానులకు ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

'నా పేరుకు ముందు 'ది' ట్యాగ్ పెట్టడం వల్ల విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఇతర హీరోలు ఎవరూ ఎదుర్కోనన్ని ఎదురుదెబ్బలు నాకు తగిలాయి. నా కంటే ఇండస్ట్రీకి ముందు వచ్చిన వారికి కూడా ట్యాగ్ లైన్స్ ఉన్నాయి. యూనివర్సల్ స్టార్ నుంచి పీపుల్ స్టార్ వరకూ ఎన్నో ట్యాగ్స్ ఉన్నాయి. నా కంటే చిన్న వారితో పాటు పెద్ద వారు వీటిని ఉపయోగించుకుంటున్నారు. బహుశా ఏ ట్యాగ్ లేని హీరో నేనొక్కడినే. ట్యాగ్ లైన్‌తో కాదు. ఆడియన్స్ నా నటనతో నన్ను గుర్తుంచుకోవాలి.

అంతకు ముందు రౌడీ బాయ్, రౌడీ స్టార్ అనే పేర్లతో నన్ను పిలిచేవారు. వాటిని యాక్సెప్ట్ చేయకపోవడంతో 'లైగర్' మూవీ ప్రచారంలో టీం 'ది' అనే పదాన్ని జోడించింది. అప్పటివరకూ ఎవరికీ ఈ ట్యాగ్ లేకపోవడంతో అంగీకరించా. కానీ దీని వల్ల ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ట్యాగ్ వల్ల ఎవరికీ తగలనన్ని ఎదురుదెబ్బలు నాకు తగిలాయి. దీంతో దాన్ని తీసేయాలని నా టీంకు చెప్పాను. నన్ను విజయ్ దేవరకొండ అని మాత్రమే పిలవాలి.' అని స్పష్టం చేశారు.

Also Read: పాన్ ఇండియా హిట్స్‌కు కేరాఫ్ అడ్రస్ శివశక్తి దత్తా... రాజమౌళి సినిమాల్లో ఆ సాంగ్స్ రాసింది ఆయనే

రూమర్స్‌పై ఏమన్నారంటే?

తన పర్సనల్ లైఫ్‌పై వచ్చే రూమర్స్‌పై విజయ్ స్పందించారు. లైఫ్‌లో ప్రతిదీ అవసరమేనని... ఎన్నో ఒడుదొడుకులను కూడా తాను సవాల్‌గా తీసుకుని వాటిని అధిగమిస్తానన్నారు. చిన్నప్పటి నుంచి ఎన్నో క్లిష్ట పరిస్థితులను దాటుకొని ఈ రోజు ఈ స్థాయిలో గుర్తింపు సాధించినట్లు తెలిపారు.

కింగ్‌డమ్ కొత్త రిలీజ్ డేట్

విజయ్ దేవరకొండ లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్‌డమ్' మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ సోమవారం అనౌన్స్ చేశారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్, లుక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సినిమాలో విజయ్ స్పై ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఆయన మాస్ లుక్, యాక్షన్ సీన్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా... విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Embed widget