అన్వేషించండి

MM Keeravani: కీరవాణి ఇంట తీవ్ర విషాదం - ఆయన తండ్రి కన్నుమూత

Keeravani: ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా కన్నుమూశారు. ఆయన రైటర్, చిత్రకారుడిగా గుర్తింపు పొందారు.

MM Keeravani Father Passed Away: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా (92) మణికొండలోని తన నివాసంలో సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు సోదరుడైన శివశక్తి పలు తెలుగు సినిమాలకు పాటలు రాశారు. లిరిక్ రైటర్, స్క్రీన్ రైటర్, చిత్రకారుడిగా మంచి గుర్తింపు పొందారు.

1932 అక్టోబర్ 8న రాజమండ్రి సమీపంలోని కొవ్వూరులో శివశక్తి జన్మించారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. అప్పట్లోనే ఇంటర్ చదువుకున్న ఈయన చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయి ముంబయిలోని సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజీ చేరారు. రెండేళ్ల తర్వాత మళ్లీ కొవ్వూరు తిరిగొచ్చి చిత్రకారుడిగా పని చేశారు. 'కమలేశ్' అనే కలం పేరుతో ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మ్యూజిక్‌పై ఇష్టంతో సితార, గిటార్, హార్మోనియం నేర్చుకున్నారు.

విజయేంద్ర ప్రసాద్‌తో ఇండస్ట్రీలోకి...

సంగీతంపై పట్టు సంపాదించిన తర్వాత మద్రాస్ వెళ్లిపోయి సోదరుడు విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1988లో వచ్చిన 'జానకి రాముడు' సినిమాకు స్క్రీన్ రైటర్‌గా పని చేశారు శివ దత్తా. ఈ మూవీతో ఇద్దరికీ మంచి పేరొచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలకు పాటలు రాస్తూ వచ్చారు. బాహుబలి 1లో (మమతల తల్లి, ధీవర), బాహుబలి 2 (సాహోరే బాహుబలి), 'ఎన్టీఆర్: కథానాయకుడు' (కథానాయక), 'సై' సినిమాలో (నల్లా నల్లాని కళ్ల పిల్ల), హనుమాన్ (అంజనాద్రి థీమ్ సాంగ్), రాజన్న (అమ్మా అవని), ఛత్రపతి (మన్నేల తింటివిరా) పాటలు రాశారు.

శివశక్తి దత్తాకు ముగ్గురు సంతానం. కీరవాణి, శివశ్రీ కాంచి, కల్యాణి మాలిక్. ఆయనకు ఒక అన్న, ఓ అక్క, నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. తమ్ముడు విజయేంద్ర ప్రసాద్. శివశక్తి దత్తా మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read: 'పెళ్లి సంబంధం మాట్లాడతా... ప్లీజ్ నెంబర్ ఇవ్వొచ్చుగా?' - హీరోయిన్ నిధి అగర్వాల్ క్యూట్ రిప్లై

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
S Janaki Death - Health Bulletin: జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?
జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?
S Janaki Death - Celebs Reaction: జానకమ్మ మృతిపై చిరంజీవి, బాలకృష్ణ సంతాపం... సెలబ్రిటీల రియాక్షన్
జానకమ్మ మృతిపై చిరంజీవి, బాలకృష్ణ సంతాపం... సెలబ్రిటీల రియాక్షన్
Singer Janaki Passed Away: దక్షిణాది గానకోకిల ఇకలేరు... సింగర్ ఎస్ జానకి కన్నుమూత
దక్షిణాది గానకోకిల ఇకలేరు... సింగర్ ఎస్ జానకి కన్నుమూత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
E85 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ Yamaha FZ Blue వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే
E85 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ Yamaha FZ Blue వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే
Embed widget