అన్వేషించండి

Nidhhi Agerwal: 'పెళ్లి సంబంధం మాట్లాడతా... ప్లీజ్ నెంబర్ ఇవ్వొచ్చుగా?' - హీరోయిన్ నిధి అగర్వాల్ క్యూట్ రిప్లై

Hari Hara Veera Mallu: హీరోయిన్ నిధి అగర్వాల్ ఓ ఫ్యాన్‌ అడిగిన ప్రశ్నకు క్యూట్ రిప్లై ఇచ్చారు. అంతే కాకుండా హరిహర వీరమల్లు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Nidhhi Agerwal Cute Reply To Fan On Marriage Proposal: సోషల్ మీడియా వేదికగా చాలా మంది హీరోయిన్లు యాక్టివ్‌గా ఉంటూ తమకు టైం దొరికినప్పుడు తమ అభిమానులతో చిట్ చాట్ నిర్వహిస్తుంటారు. సినిమాలకు సంబంధించిన విషయాలే కాకుండా తమకు నచ్చిన వాటి గురించి కూడా తెలుసుకుంటుంటారు.

'హరిహర వీరమల్లు' హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ నిర్వహించారు. ఓ అభిమాని నుంచి ఆమెకు ఓ ప్రశ్న ఎదురు కాగా... ఆమె క్యూట్‌గా రిప్లై ఇచ్చారు. దీంతో పాటే ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు నిధి ఆన్సర్ ఇచ్చారు.

ప్లీజ్... నెంబర్ ఇవ్వొచ్చుగా...

ఓ అభిమాని నిధి అగర్వాల్‌కు డైరెక్ట్‌గా పెళ్లి ప్రపోజ్ చేయగా... ఆమె తెలివిగా సమాధానం చెప్పారు. 'మీ అమ్మగారి ఫోన్ నెంబర్ ఇవ్వండి. మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతా... ప్లీజ్ ఇవ్వొచ్చుగా నిధి.' అంటూ హార్ట్ ఎమోజీతో రిక్వెస్ట్ చేశాడు. దీనికి నిధి... 'అవునా?... చిలిపి' అంటూ ఆన్సర్ ఇచ్చారు.

ఆ సీన్స్ సూపర్

'హరిహర వీరమల్లు' లో ఏ సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయని అడిగిన ప్రశ్నకు... 'ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్, క్లైమాక్స్ కోసం ఎదురుచూడండి. నేను చెప్పానని ఎవరికీ చెప్పొద్దు.' అని అన్నారు. ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ చేశానని... లైఫ్‌లో ఇలాంటి ఛాన్స్ అరుదుగా వస్తుందని అన్నారు నిధి. మూవీలో హార్స్ రైడింగ్, డ్యాన్స్ సరదాగా సాగాయన్నారు. ఈ సినిమా తన బిడ్డలాంటిదని... టీం, అభిమానులపై ప్రేమ ప్రత్యేకమైందన్నారు. ఇది దేవుడిచ్చిన బహుమానమని అన్నారు.

ప్రభాస్ రాజాసాబ్‌లో రొమాంటిక్ సాంగ్

ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీలో తనది రొమాంటిక్ సాంగ్ ఉందని నిధి అగర్వాల్ తెలిపారు. యాక్టింగ్ చాలా కష్టమైన రంగమని... మనల్ని మనం నమ్ముకుంటే అనుకున్నది సాధించొచ్చని చెప్పారు.

Also Read: పవన్ కళ్యాణ్ ‘సుస్వాగతం’, మహేష్ ‘సర్కారు వారి పాట’ to అల్లు అర్జున్ ‘ఆర్య’, లావణ్య త్రిపాఠి ‘అందాల రాక్షసి’ వరకు- ఈ మంగళవారం (జూలై 08) టీవీలలో వచ్చే సినిమాలివే

ఈ నెల 24న రిలీజ్

ఈ మూవీ ట్రైలర్ ఇటీవల రిలీజ్ కాగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. భారీ బడ్జెట్‌తో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో ఎ.దయాకరరావు నిర్మించారు. పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో పవన్ పవర్ ఫుల్ యోధుడిగా కనిపించనున్నారు. ఆయన సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటు ఔరంగజేబు రోల్‌లో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్ గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, నోరా ఫతేహి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 24న పాన్ ఇండియా లెవల్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.

మరోవైపు... ఈ మూవీలో చరిత్రను వక్రీకరించారంటూ తెలంగాణ బీసీ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని మూవీ రిలీజ్ అడ్డుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చాయి. దీనిపై మూవీ టీం స్పందించాల్సి ఉంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Anil Ravipudi Animated Movie : అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget