Kingdom Release Date: 'కింగ్ డమ్' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - స్పైగా విజయ్ మాస్ లుక్... స్పెషల్ వీడియో రిలీజ్
Kingdom Movie: యంగ్ హీరో విజయ్ దేవరకొండ 'కింగ్ డమ్' మూవీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన మూవీ విడుదల తేదీ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

Vijay Deverakonda Kingdom Movie Release Date: యంగ్ హీరో విజయ్ దేవరకొండ అవెయిటెడ్ మూవీ 'కింగ్ డమ్'. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీని జులై 31న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్... ఓ స్పెషల్ వీడియోను సైతం రిలీజ్ చేశారు. 'ఓ మనిషి కోపంతో నిండిన హృదయం. చాలా దూరం నెట్టివేయబడిన ప్రపంచం. ఇప్పుడు మారణహోమ సమయం' అంటూ క్యాప్షన్ ఇవ్వగా భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
ఈ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు వీడియోను బట్టి అర్థమవుతోంది. వీడియో ప్రారంభంలో పోలీస్ ఆఫీసర్ అంటూ చూపించగా... వెను వెంటనే ఓ స్పైగా కనిపించారు. 'ఏమైనా చేస్తా సార్. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్.' అని విజయ్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అసలు ఆయన రోల్ ఏంటి... పోలీస్ ఆఫీసరా? స్పైనా? అనేది ఆసక్తికరంగా మారింది. యాక్షన్ సీన్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి.
One man.
— Sithara Entertainments (@SitharaEnts) July 7, 2025
A heart full of fury.
A world that pushed too far.
Now it’s CARNAGE time.#Kingdom Release Date Promo out now 🔥
Telugu - https://t.co/SYAlvEXoNh
Tamil - https://t.co/QHRfX0jNEU
In Cinemas July 31st, 2025 ❤️@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev… pic.twitter.com/OxOmcrZhil
Also Read: 'SSMB 29' మూవీ షూటింగ్‌లో ఆర్ మాధవన్ - ఆయన రోల్ ఏంటో తెలుసా?
ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. జులై 31న తెలుగు సహా ఇతర భారతీయ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
పలుమార్లు వాయిదా
ఇప్పటికే ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు సహా ఇతర కారణాలతో మేకర్స్ రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. ఫస్ట్ మార్చిలో రిలీజ్ చేయాలని భావించగా... ఆ తర్వాత మే 30 అని ప్రకటించారు. మళ్లీ రిలీజ్ డేట్ మారుస్తూ జులై 4ను ప్రకటించారు. తాజాగా ఈ నెల 31న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో ఆడియన్స్‌కు ఓ వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అందుతుందని ఇటీవలే నిర్మాత నాగవంశీ ప్రకటించారు. 'కింగ్ డమ్' అంతటా విజయాన్ని అందుకోనుందని చెప్పారు.






















