Vijay Devarakonda: ఇద్దరు పిల్లలను కనండి - నాకు, ఆనంద్‌కు అలాంటి బాండింగ్ లేదు: విజయ్ దేవరకొండ
Vijay Devarakonda: టాలీవుడ్‌గా హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్న తర్వాత తన తమ్ముడు ఆనంద్‌ను కూడా హీరోగా పరిచయం చేశాడు విజయ్ దేవరకొండ. తాజాగా వారి బాండింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Vijay Devarakonda About Anand Devarakonda: ఒక హీరో లేదా హీరోయిన్ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్‌గా ఎదిగితే.. ఆ తర్వాత వారి తమ్ముడు లేదా చెల్లెలు కూడా ఆటోమేటిక్‌గా హీరో లేదా హీరోయిన్ అయిపోతారు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే జరిగింది. తను స్టార్‌గా ఎదిగిన తర్వాత తన తమ్ముడు ఆనంద్‌ను హీరోగా పరిచయం చేశాడు. విజయ్.. ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యాడో.. తన తమ్ముడు ఆనంద్ కూడా మంచి స్క్రిప్ట్ సెలక్షన్‌తో యూత్‌కు అంతే దగ్గరయ్యాడు. తాజాగా ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న విజయ్.. తన తమ్ముడు ఆనంద్ గురించి చెప్తూ తల్లిదండ్రులకు ఒక సలహా ఇచ్చాడు.
తల్లిదండ్రులకు సలహా..
‘‘నేను, మా తమ్ముడు చిన్నప్పటి నుండి చాలా క్లోజ్. ఒకే హాస్టల్‌లో చదువుకున్నాం, క్రికెట్ ఆడేవాళ్లం. బ్రదర్స్ బాండింగ్ అంటే ఒకలాగా ఉంటుంది. ఒకే పిల్లలు ఉన్న తల్లిదండ్రలను కలిసినప్పుడు నేను చెప్తూ ఉంటాను ఇంకొకరిని కనమని. ఎందుకంటే ఒక బ్రదర్ ఉంటే ఎలా ఉంటుందని నాకు తెలుసు. ఆ బాండింగ్, ఆ కంఫర్ట్ వేరేలాగా ఉంటుంది. ప్రపంచంతో, అమ్మ నాన్నతో చెప్పడానికి భయపడే విషయాలను బ్రదర్‌తో మాట్లాడుకుంటాం. సినిమాలో ఉన్నట్టుగా బ్రదర్ బాండింగ్ మాకు లేదు. ఆ విధమైన సందర్భాలు రాలేదు కానీ నేను మా తమ్ముడు చాలా క్లోజ్. పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు ఉంటే ఒక తోడు, సపోర్ట్ ఉంటుందని తల్లిదండ్రులకు సలహా ఇస్తాను’’ అని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.
మిక్స్‌డ్ టాక్..
విజయ్ దేవరకొండ తాజాగా ‘ఫ్యామిలీ స్టార్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తనతో కలిసి ‘గీతా గోవిందం’ లాంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్‌తోనే ‘ఫ్యామిలీ స్టార్’ చేశాడు ఈ హీరో. ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లాగా తెరకెక్కించినా కూడా చాలామంది ప్రేక్షకుల దగ్గర నుండి మిక్స్‌డ్ టాక్ అందుకుంది. దీంతో కలెక్షన్స్‌పై కూడా నెగిటివ్ ప్రభావం పడిందని, బ్రేక్ ఈవెన్ కూడా కష్టమే అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ‘ఫ్యామిలీ స్టార్’ టీమ్ మాత్రం ఇంకా ఆశలు వదులుకోకుండా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. సినిమాకు ఎన్ని నెగిటివ్ రివ్యూలు వచ్చినా.. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ మాత్రం హైలెట్ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
‘బేబి’తో గుర్తింపు..
‘పెళ్లిచూపులు’తో హీరోగా ప్రేక్షకులకు పరిచయమయినా కూడా ‘అర్జున్ రెడ్డి’తో అందరికీ మరింత దగ్గరయ్యాడు విజయ్ దేవరకొండ. ముఖ్యంగా విజయ్ ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ అయ్యింది. అందుకే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా రంగంలోకి దించాడు. ఆనంద్.. ‘దొరసాని’ అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ మొదటి సినిమా తనకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయింది. ఆ తర్వాత చేసిన ఒకట్రెండు చిత్రాలు కూడా యావరేజ్‌గానే నిలిచాయి. ఫైనల్‌గా గతేడాది విడుదలయిన ‘బేబి’ మాత్రం టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ హీరోల లిస్ట్‌లో ఆనంద్ దేవరకొండను ఒకడిగా చేర్చింది.
Also Read: పవన్ కల్యాణ్‌కు చెడ్డ పేరు తెస్తున్నారు - ట్రోలింగ్‌పై స్పందించిన కోనా వెంకట్