Kushi Movie in OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ' ఖుషి' - స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి' మూవీ ఇప్పుడు ఓటీటీ లోకి రానున్నట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'ఖుషి' మూవీ సెప్టెంబర్ 1న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందే ఈ సినిమా పాటలు, ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో రిలీజ్ కి ముందే సినిమాపై మంచి హైప్ నెలకొంది. ఇక విడుదలయ్యాక ఆడియన్స్ నుంచి మాత్రమే కాకుండా సినీ క్రిటిక్స్ నుంచి సైతం పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. అటు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా డీసెంట్ కలెక్షన్స్ తో ఆదరగొట్టింది. మొదటి రోజే ఈ ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి విజయ్ దేవరకొండ కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది.
విజయ్ గత చిత్రం 'లైగర్' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినా కూడా తదుపరి చిత్రంగా వచ్చిన 'ఖుషి'కి ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ దక్కడం విశేషమనే చెప్పాలి. అలా ఫస్ట్ వీకెండ్ భారీ కలెక్షన్స్ అందుకున్న ఈ మూవీ ఆ తర్వాత అదే జోరును కనబరచలేకపోయింది. అయితే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయినట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.' ఖుషి' మూవీ ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 6 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే 'ఖుషి' ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.
మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని పాండియా లెవెల్ లో తెలుగుతోపాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ ని రొమాంటిక్ రోల్లో చూసేందుకు ఫ్యాన్స్ సినిమాపై ఆసక్తి కనబరిచారు. అలాగే విజయ్, సమంతల జోడి వెండితెరపై మొదటిసారి పూర్తిస్థాయిలో కనిపించనుండడంతో ఆడియన్స్ లోనూ మూవీపై క్యూరియాసిటీ నెలకొంది. అయితే సమంత, విజయల జోడి బాగున్నా దర్శకుడు శివ నిర్మాణ స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేకపోయారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది. అయితే సినిమాకి ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత కలెక్షన్స్ భారీగా పడిపోయాయి.
ముఖ్యంగా ఏపీలో ఈ సినిమాకి భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'గీతాగోవిందం' బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబో రిపీట్ కాబోతుండడంతో ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. 'VD13' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ సరసన సీతారామం బ్యూటీ మృనాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : నేనెక్కడికి పారిపోలేదు - డ్రగ్స్ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు: హీరో నవదీప్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial