అన్వేషించండి

Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్

తన పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా.. ప్రొఫెషనల్ లైఫ్ నుండి ఏ మాత్రం బ్రేక్ తీసుకోవడం లేదు విజయ్ ఆంటోనీ. తాజాగా తన తరువాతి చిత్రం ‘హిట్లర్’కు సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.

డిఫరెంట్ కాన్సెప్ట్స్‌కు డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తే.. ఇక ఈ మూవీకి క్రియేట్ అయ్యే హైప్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అలా సినిమాలు తెరకెక్కించే నటులలో విజయ్ ఆంటోనీ కూడా ఒకరు. తన పర్సనల్ లైఫ్‌లో తట్టుకోలేని విషాదం జరిగినా కూడా ప్రొఫెషనల్ లైఫ్‌పై ఆ ప్రభావం ఏ మాత్రం పడకుండా మ్యానేజ్ చేస్తున్నాడు ఈ మల్టీ టాలెంటెడ్ హీరో. తాజాగా విజయ్ ఆంటోనీ అప్‌కమింగ్ మూవీ ‘హిట్లర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను టీమ్ అంతా కలిసి రిలీజ్ చేశారు. ‘హిట్లర్’ ఫస్ట్ లుక్ లాంచ్‌లో విజయ్ ఆంటోనీ మాత్రం పాల్గొనలేకపోయారు.

ఆసక్తికరమైన మోషన్ పోస్టర్..
మామూలుగా విజయ్ ఆంటోనీ చేసే ప్రతీ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ‘హిట్లర్’ కూడా అదే విధంగా ఉంది. ట్రెయిన్ జర్నీలో ఉన్న హీరో విజయ్ ఆంటోనీ.. ఒక క్రైమ్ ఇన్సిడెంట్‌ను ఎదుర్కున్నట్టు మోషన్ పోస్టర్ లో చూపించారు. ఇదే ట్రెయిన్ లో హీరోయిన్ రియా సుమన్‌ను హీరో కలుసుకోనున్నట్టు తెలుస్తోంది. గన్ పేలుస్తున్నట్టుగా గౌతమ్ మీనన్ పాత్రను కూడా ఈ మోషన్ పోస్టర్‌లో పరిచయం చేసింది మూవీ టీమ్. తన ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే.. ‘హిట్లర్’ మోషన్ పోస్టర్‌లో విజయ్ ఆంటోనీ లుక్ కాస్త డిఫరెంట్‌గా ఉన్నారు. ఇక ఈ మోషన్ పోస్టర్ చివర్లో హీరో ఒక జోకర్ గెటప్‌లో కనిపించడం ఆసక్తికరంగా ఉంది. ఈ మోషన్ పోస్టర్‌ను స్పష్టంగా చూస్తుంటే.. ట్రెయిన్ జర్నీ అనేది ఇందులో కీలకంగా ఉంటుందని అర్థమవుతోంది.

మళ్లీ ఆ సంస్థతోనే..
చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి ఇప్పటికే విజయ్ ఆంటోనీ.. ‘విజయ్ రాఘవన్’ అనే చిత్రాన్ని చేశారు. ఇప్పటికీ ఈ సంస్థ.. 6 సినిమాలు తెరకెక్కించగా.. ‘హిట్లర్’ ఏడవ చిత్రంగా తెరకెక్కనుంది. ధన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు డీటీ రాజా, డీఆర్ సంజయ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మామూలుగా విజయ్ ఆంటోనీ నటించే ప్రతీ సినిమాలో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. అదే విధంగా ‘హిట్లర్’లో కూడా ప్రజాస్వామ్యం పేరుతో పాలకులు చేస్తున్న నియంత పాలనను ఎదుర్కోవడానికి హీరో ముందుకొస్తాడు. ఆ హీరో కథే ‘హిట్లర్’ అని మూవీ టీమ్ అంటోంది.

ప్యాన్ ఇండియా రేంజ్‌లో..
‘హిట్లర్’ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టనుంది. ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ‘హిట్లర్’ రిలీజ్ కానుంది. ‘హిట్లర్’ కోసం మొదటిసారిగా విజయ్ ఆంటోనీ, రియా సుమన్ జతకట్టనున్నారు. వివేక్, మెర్విన్ కలిసి సంయుక్తంగా ఈ మూవీకి మ్యూజిక్‌ను అందించారు. డైరెక్షన్‌కంటే ఎక్కువగా యాక్టింగ్‌పై దృష్టిపెట్టిన గౌతమ్ వసుదేవ్ మీనన్. ‘హిట్లర్’లో విజయ్ ఆంటోనీతో తలపడే విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

Also Read: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

OTT Latest Movie: బడ్జెట్‌లో 16 శాతమే రికవరీ... 150కు 24 కోట్లు వచ్చాయ్ - ఓటీటీలో యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ షురూ
బడ్జెట్‌లో 16 శాతమే రికవరీ... 150కు 24 కోట్లు వచ్చాయ్ - ఓటీటీలో యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ షురూ
Jana Nayagan: సీఎం సినిమాను లీక్ చేస్తారా... ఆరుగుర్ని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
సీఎం సినిమాను లీక్ చేస్తారా... ఆరుగుర్ని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Peddi Collections Day 1: సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Peddi Collections: ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
What is Special Intensive Revision SIR: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
Embed widget