Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?
ఎప్పటికైనా తను హీరోగా నటించే సినిమాల్లో కృతి శెట్టితో రొమాన్స్ చేయనని తేల్చేశాడు విజయ్ సేతుపతి. అంతే కాకుండా దానికి కారణమేంటో కూడా బయటపెట్టాడు.
![Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా? Vijay Sethupathi never wants to romance with krithi shetty due to this reason Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/8a99df6bbb9acdb6c4a3908c5d3f636f1695992706474802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కొందరు హీరోహీరోయిన్లు కలిసి నటించకపోయినా.. వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూద్దామని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. కానీ ఎందుకో అలాంటి కొన్ని కాంబినేషన్స్ అసలు వర్కవుట్ అవ్వవు. అలాంటి వాటిలో విజయ్ సేతుపతి, కృతి శెట్టి కాంబినేషన్ కూడా ఒకటి. ఇప్పటికే విజయ్ సేతుపతి హీరోగా నటించిన పలు సినిమాల్లో కృతికి హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. కానీ విజయే స్వయంగా తనకు జోడీగా కృతి వద్దని స్పష్టం చేశాడట. దాని వెనుక ఆయనకు ఒక కారణం కూడా ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అసలు ఆ కారణం ఏంటి అని ప్రేక్షకులు గెస్ చేయడం మొదలుపెట్టారు.
‘జవాన్’లో విలన్‌గా క్రేజ్..
విజయ్ సేతుపతి.. ముందుగా తమ కెరీర్‌ను తమిళంలో ప్రారంభించినా కూడా ఇప్పుడు ప్రతీ సౌత్ భాషలో ఆయన మోస్ట్ వాంటెడ్ నటుడు అయిపోయారు. కేవలం హీరోగా మాత్రమే కాదు.. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది అనిపించే ప్రతీ సినిమాను యాక్సెప్ట్ చేస్తారు విజయ్ సేతుపతి. అందుకే ఆయన వెతుక్కుంటూ ఎన్నో పాత్రలు, ఎన్నో సినిమాలు వస్తుంటాయి. అందుకే ప్రస్తుతం విజయ్ సేతుపతి మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అయిపోయారు. తాజాగా ఈ నటుడు.. షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘జవాన్’లో విలన్‌గా చేశారు. ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులకు పరిచయమయిన విజయ్ సేతుపతి.. ‘జవాన్’తో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. ఇలాంటి నటుడు త్వరలోనే తను హీరోగా నటిస్తున్న సినిమాలో కృతితో జతకడుతున్నాడని వార్తలు రాగా.. అవన్నీ కేవలం రూమర్స్ అని తేలిపోయింది.
‘ఉప్పెన’తో ఎంట్రీ..
తమిళంలో ఎన్నో సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటించిన తర్వాత విజయ్ సేతుపతికి తెలుగులో అవకాశం వచ్చింది. కానీ అది హీరోయిన్‌కు తండ్రి పాత్రలో. ‘ఉప్పెన’ చిత్రంలో హీరోయిన్ కృతి శెట్టికి తండ్రి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించాడు విజయ్ సేతుపతి. ఇది కృతికి మొదటి సినిమానే అయినా ఇందులో తన పర్ఫార్మెన్స్‌తో మేకర్స్‌ను మెప్పించి మరిన్ని అవకాశాలు సంపాదించుకుంది. అదే క్రమంలో విజయ్ సేతుపతి హీరోగా నటించే సినిమాలో కూడా తనకు హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. కానీ అది విజయ్ సేతుపతికి నచ్చలేదు. కృతితో రొమాన్స్ చేయనని క్లియర్‌గా చెప్పేశాడు. అలా ఎందుకు చేశాడు అని ఒక మూవీ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు సేతుపతి.
తండ్రిగా చేశాను కాబట్టి..
ఉప్పెనలో కృతి శెట్టికి తండ్రి పాత్రలో నటించాను కాబట్టి తనతో హీరోగా రొమాన్స్ చేయడం తనకు ఇష్టం లేదని క్లారిటీ ఇచ్చాడు విజయ్ సేతుపతి. ఇప్పటికీ కృతిని తన కూతురిలాగానే చూస్తానని అన్నాడు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘లాభం’ చిత్రంలో కృతిని హీరోయిన్‌గా అనుకున్నా కూడా ముందు తండ్రిగా నటించి, ఆ తర్వాత హీరోహీరోయిన్‌గా నటించడం తనకు ఇష్టం లేదని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం కృతి శెట్టి.. సూర్యతో నటిస్తున్న చిత్రంతో తమిళ డెబ్యూకు సిద్ధమయ్యింది. మామూలుగా హీరోలు.. హీరోయిన్స్ విషయంలో ఇలాంటి కారణాలు పట్టించుకోరని, కానీ విజయ్ సేతుపతి మాత్రం ఒకప్పుడు తండ్రిగా నటించినందుకు ఇంకా ఆ హీరోయిన్‌ను తన కూతురిగా ఫీల్ అవుతున్నానని చెప్పడం గ్రేట్ అని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. మనవరాలి వయస్సు ఉండే అమ్మాయిలతో రొమాన్స్‌కు సిద్ధమయ్యే మన తెలుగు హీరోలు విజయ్ సేతుపతిలా నిర్ణయం తీసుకోగలరా? అని కొందరు విమర్శిస్తున్నారు.
Also Read: ఆయన పెదాలు తాకగానే- షాకింగ్ విషయాన్ని వెల్లడించిన రవీనా టాండన్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)