అన్వేషించండి

Gagana Margan First Look: ‘గగన మార్గన్’గా విజయ్ ఆంటోనీ... ఫస్ట్ లుక్‌తోనే అంచనాలు పెంచేశాడుగా

విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గగన మార్గన్’. లియో జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు.

Gagana Margan First Look Out: సౌత్ హీరో విజయ్ ఆంటోనీ, జాన్ పాల్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గగన మార్గన్’. మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా టైటిల్ రివీల్ చేశారు. తాజాగా పోస్టర్ ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విజయ్ ఆంటోనీ రెండు రకాలుగా కనిపిస్తున్నారు.  ఓవైపు గాయపడి ఆవేదనతో కూడిని లుక్ లో కనిపించగా, మరోవైపు బాధలో తల పైకెత్తి గట్టిగా అరుస్తున్న వ్యక్తిగా కనిపించాడు. ఈ పోస్టర్ ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచుతోంది.      

దర్శకుడిగా పరిచయం అవుతున్న లియో జాన్ పాల్

‘అట్టకత్తి’, ‘బీడ’, ‘సూదు కవ్వుం’, ‘ఇంద్రు నేత్ర నాళై’, ‘తేకడి’, ‘ముండాసుపట్టి’, ‘కదలుం కాదందు పోగుం’, ‘ఏ1’, ‘మాయవన్’ లాంటి సినిమాలకు ఎడిటర్‌గా వ్యవహరించిన లియో జాన్ పాల్... ‘గగన మార్గన్’తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. లియో జాన్ పాల్ 2013లో ‘ఇదర్‌ కుతానే ఆసైపట్టై బాలకుమార’ సినిమాకు బెస్ట్ ఎడిటర్ గా తమిళనాడు ప్రభుత్వం నుంచి రాష్ట్ర చలన చిత్ర అవార్డును అందుకున్నారు.  

స్పెషల్ అట్రాక్షన్ గా అండర్ వాటర్ సన్నివేశాలు

‘గగన మార్గన్’ సినిమాలో సముద్రఖని, మహానది శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  యువ ఎస్ సినిమాటోగ్రాఫర్‌గా, రాజా ఆర్ట్ డైరెక్టర్‌గా, విజయ్ ఆంటోని మ్యూజిక్ కంపోజర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ముంబైలో కీలక సన్నివేశాలను షూట్ చేశారు. నీటి అడుగు భాగంలో తెరకెక్కించిన సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనున్నట్లు తెలుస్తోంది. ‘గగన మార్గన్’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేస్తామని వెల్లడించింది. 

ఆల్ రౌండర్ గా సత్తా చాటుతున్న విజయ్ ఆంటోనీ

విజయ్ ఆంటోనీ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ని క్రాఫ్ట్ లలో అనుభవాన్ని సంపాదించారు. నటుడిగా, దర్శకుడిగా, లిరిసిస్ట్‌ గా, సంగీత దర్శకుడిగా తన సత్తాను చాటుతున్నారు. మల్టీ టాలెంటెడ్ అయిన విజయ్ ఆంటోనీ డిటెక్టివ్ ఫిక్షన్ ప్రపంచంలోకి అందరినీ తీసుకెళ్లేందుకు గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. ‘గగన మార్గన్’ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. ‘బిచ్చగాడు‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విజయ్ ఆంటోనీ, తొలి సినిమాతోనే మంచి ప్రేకాదరణ పొందారు. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మంచి వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో విడుదల అయ్యాయి. గత ఏడాది ‘బిచ్చగాడు 2‘తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఈ సినిమా ‘బిచ్చగాడు‘ లాంటి సక్సెస్ ను అందుకోలేకపోయింది. ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Read Also: ‘పుష్ప 2’, ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’లకు మైత్రీ క్రేజీ డీల్ - బాలీవుడ్‌లో ఇంక జాతరే!

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget