Keerthy Suresh: ‘కల్కి 2898 ఏడీ’ కోసం కీర్తి సురేశ్ అంత కష్టపడిందా? ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి
Keerthy Suresh: ‘కల్కి 2898 ఏడీ’లో బుజ్జి క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెప్పడం వల్ల సినిమాకు ఎంతో కామెడీని యాడ్ చేసింది కీర్తి సురేశ్. తాజాగా ఈ మూవీ కోసం తను కష్టపడిన వీడియో ఒకటి బయటికొచ్చింది.
Keerthy Suresh As Bujji In Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ ప్రేక్షకులను అంతగా అలరించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. భారీ క్యాస్టింగ్, రిచ్ విజువల్స్, అడ్వాన్స్ టెక్నాలజీ.. ఇలా అన్ని అంశాలు సినిమా చూసిన ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందులో ఒకటి బుజ్జి క్యారెక్టరైజేషన్. బుజ్జి - భైరవ గ్లింప్స్ విడుదల చేసినప్పుడే బుజ్జికి చాలామంది ఫిదా అయిపోయారు. ఇక బుజ్జి అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్‌ను తన వాయిస్‌తో వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది కీర్తి సురేశ్. తాజాగా కీర్తి సురేశ్ డబ్బింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్.
బుజ్జికి బుజ్జి మాటలతో కీర్తి వాయిస్..
‘కల్కి 2898 ఏడీ’ తెలుగులో మాత్రమే కాకుండా ఇంకా చాలా ఇండియన్ భాషల్లో విడుదలయ్యింది. అన్నింటిలో బుజ్జి క్యారెక్టర్‌కు కీర్తి సురేశే డబ్బింగ్ చెప్పడం విశేషం. హీరో, హీరోయిన్ మధ్యకంటే బుజ్జి, భైరవ మధ్య వచ్చే సీన్స్‌నే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. దానికి కీర్తి సురేశ్ వాయిస్‌లోని హ్యూమర్ కూడా కారణమని వారు అంటున్నారు. దీంతో ఇంతమంది ఎంజాయ్ చేసిన ఆ వాయిస్ వెనుక ఎంత కష్టముందో మేకర్స్ తాజాగా బయటపెట్టారు. కీర్తి సురేశ్ అన్ని భాషల్లో బుజ్జికి డబ్బింగ్ చెప్పిన వీడియోను రిలీజ్ చేశారు. ఇది చూసినవారంతా కీర్తి సురేశ్.. ‘కల్కి 2898 ఏడీ’కి చాలా ప్లస్ అయ్యిందని ప్రశంసిస్తున్నారు.
డబ్బింగ్ వీడియోకు ఫ్యాన్స్..
వైజయంతీ మూవీస్ నిర్మించిన ‘మహానటి’ మూవీతో మొదటిసారిగా తెలుగులో డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది కీర్తి. సినిమా విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ హిట్ అయిన తర్వాత హీరోయిన్ డబ్బింగ్ చెప్పిన వీడియోను విడుదల చేశారు మేకర్స్. అందులో సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పడం కోసం కీర్తి సురేశ్ అంత కష్టపడిందా అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అంతే కాకుండా ఆ డబ్బింగ్ వీడియోకు తెగ లైకులు కూడా వచ్చాయి. అప్పటినుండి కీర్తి సురేశ్ డబ్బింగ్ వీడియోల కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరిగిపోయింది. దానిని దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ మేకర్స్.. ఇప్పుడు బుజ్జి డబ్బింగ్ వీడియోను విడుదల చేసి ఉండవచ్చు అనుకుంటున్నారు ఫ్యాన్స్.
View this post on Instagram
కామెడీ యాంగిల్..
చాలాకాలం తర్వాత ‘కల్కి 2898 ఏడీ’తో తన కామెడీ యాంగిల్‌ను కూడా బయటపెట్టాడు ప్రభాస్. దానికి బుజ్జి క్యారెక్టర్ కూడా బాగా హెల్ప్ చేసింది. ఇక ప్రభాస్‌తో పాటు ఇందులో అశ్వద్ధామగా నటించిన అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా మంచి మార్కులు పడ్డాయి. అమితాబ్ క్యారెక్టర్ ఇలా ఉంటుందని ఊహించలేదంటున్నారు ప్రేక్షకులు. ఆయనతో పాటు క్లైమాక్స్‌లో వచ్చే కమల్ హాసన్ క్యారెక్టర్ కూడా ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచింది. ఇలా ‘కల్కి 2898 ఏడీ’లో క్యాస్టింగ్ అంతా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడంలో సక్సెస్ అయ్యింది.
Also Read: సూపర్ స్టార్ సినిమాకి ఫాహద్ ఫజిల్ డబ్బింగ్, వైరల్ అవుతున్న ఫొటోలు