అన్వేషించండి

Vicky Kaushal: అల్లు అర్జున్ పై విక్కీ కౌశల్ ప్రశంసలు, జ్యూరీ గొప్ప నిర్ణయం తీసుకుందని వెల్లడి!

టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ను బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయనను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపిక చేస్తూ జ్యూరీ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్ పై విక్కీ కౌశల్ ప్రశంసలు

తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాలపై బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవార్డుల విషయంలో జ్యూరీ మెంబర్స్ నిర్ణయం చాలా అద్భుతంగా ఉంటుందని వెల్లడించారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే అవార్డులను ప్రకటించారని చెప్పుకొచ్చారు. ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాకు  గాను ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికైన టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ ను ఆయన అభినందించారు. ఈ చిత్రంలో  అర్జున్‌ అద్భుతంగా నటించారని ప్రశంసలు కురిపించారు.సౌత్ స్టార్ ను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక చేయడం ద్వారా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ గొప్ప నిర్ణయం తీసుకుందని విక్కీ కౌశల్ అభిప్రాయపడ్డారు.  

'సర్దార్ ఉద్దమ్'కు 5 జాతీయ అవార్డులు

ఇక 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో విక్కీ కౌశల్ హీరోగా నటించిన 'సర్దార్ ఉద్దమ్' ఉత్తమ హిందీ చిత్రం, ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ ఆడియోగ్రఫీ: రీ-రికార్డింగ్ (ఫైనల్ మిక్సింగ్) విభాగాల్లో ఐదు అవార్డును గెలుచుకుంది. అయితే, ఈసారి ఉత్తమ నటుడిగా అవార్డు వస్తుందని భావించినా, ఆయనకు రాలేదు. అయినప్పటికీ నిరాశచెందడం లేదన్నారు. 2019లో వచ్చిన ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమాలో అద్భుత నటనకు గాను ఇప్పటికే ఆయన జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. 'సర్దార్ ఉద్దమ్' చిత్రానికి సరైన గౌరవం వచ్చిందని అనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు కౌశల్ ఆసక్తికర సమాధానం చెప్పారు. ఈ చిత్రంలో దర్శకుడు సర్కార్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.  ఈ సినిమా ఐదు అవార్డులు గెలుచుకోవడం అద్భుతమైన అనుభూతిని కలిగించిందన్నారు కౌశల్.

69 ఏండ్లలో తొలిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్‌ చరిత్ర సృష్టించారు. 69 ఏండ్లలో మొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించింది. ఇదే సినిమాకిగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్‌ అవార్డుకు ఎంపిక అయ్యారు. ‘పుష్ప: ది రైజ్‌’ సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ రూపొందుతోంది. ఈ యాక్షన్-థ్రిల్లర్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ‘పుష్ప 2’లో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక 'పుష్ప1'కి ప్రపంచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ రావడంతో 'పుష్ప 2'ను భారత్ తో పాటు పలు దేశాల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

Read Also: డిలీటెడ్ సీన్లతో ‘జవాన్’ ఓటీటీ విడుదల, అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన దర్శకుడు!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rammohan Naidu: రాజ్యసభలో సుధామూర్తి సూటిప్రశ్న, స్పష్టమైన సమాధానంతో ఆకట్టుకున్న రామ్మోహన్ నాయుడు
Rammohan Naidu: రాజ్యసభలో సుధామూర్తి సూటిప్రశ్న, స్పష్టమైన సమాధానంతో ఆకట్టుకున్న రామ్మోహన్ నాయుడు
MMTS Services : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ - చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ సర్వీస్ లు
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ - చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ సర్వీస్ లు
Producer Bunny Vasu: కలెక్షన్స్ 2000 కోట్లు వస్తే నిర్మాత చేతికి వచ్చేది ఎంతో తెల్సా... కలెక్షన్ పోస్టర్లు, ఐటీ రైడ్స్‌పై బన్నీ వాసు కామెంట్స్
కలెక్షన్స్ 2000 కోట్లు వస్తే నిర్మాత చేతికి వచ్చేది ఎంతో తెల్సా... కలెక్షన్ పోస్టర్లు, ఐటీ రైడ్స్‌పై బన్నీ వాసు కామెంట్స్
Mirai Movie: నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TDP Won Hindupur Municipality | టీడీపీ కైవసమైన హిందూపూర్ మున్సిపాలిటీ | ABP DesamJC Prabhakar reddy vs Kethireddy peddareddy | తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం | ABP DesamTirupati Deputy Mayor Election | తిరుపతి పీఠం కోసం కూటమి, వైసీపీ బాహా బాహీ | ABP DesamPrabhas Look From Kannappa | కన్నప్ప సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rammohan Naidu: రాజ్యసభలో సుధామూర్తి సూటిప్రశ్న, స్పష్టమైన సమాధానంతో ఆకట్టుకున్న రామ్మోహన్ నాయుడు
Rammohan Naidu: రాజ్యసభలో సుధామూర్తి సూటిప్రశ్న, స్పష్టమైన సమాధానంతో ఆకట్టుకున్న రామ్మోహన్ నాయుడు
MMTS Services : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ - చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ సర్వీస్ లు
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ - చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ సర్వీస్ లు
Producer Bunny Vasu: కలెక్షన్స్ 2000 కోట్లు వస్తే నిర్మాత చేతికి వచ్చేది ఎంతో తెల్సా... కలెక్షన్ పోస్టర్లు, ఐటీ రైడ్స్‌పై బన్నీ వాసు కామెంట్స్
కలెక్షన్స్ 2000 కోట్లు వస్తే నిర్మాత చేతికి వచ్చేది ఎంతో తెల్సా... కలెక్షన్ పోస్టర్లు, ఐటీ రైడ్స్‌పై బన్నీ వాసు కామెంట్స్
Mirai Movie: నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
Crime News: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ మృతి, జగిత్యాల జిల్లాలో ఘటన
రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ మృతి, జగిత్యాల జిల్లాలో ఘటన
BC Reservation: బీసీ ఓట్లు టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం.. నేడు అసెంబ్లీ సాక్షిగా వారికి అడిగింది ఇచ్చేస్తారా..!
బీసీ ఓట్లు టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం.. నేడు అసెంబ్లీ సాక్షిగా వారికి అడిగింది ఇచ్చేస్తారా..!
Green Field Airport: భద్రాచలం-కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుకు ప్రీ ఫిజిబిలిటీ స్టడీ పూర్తి
భద్రాచలం-కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుకు ప్రీ ఫిజిబిలిటీ స్టడీ పూర్తి
Indian Migrants: భారత్‌కు ట్రంప్ సెగ, వలసదారులతో ఢిల్లీకి బయలుదేరిన విమానం!
భారత్‌కు ట్రంప్ సెగ, వలసదారులతో ఢిల్లీకి బయలుదేరిన విమానం!
Embed widget